సర్వ సమస్యల పరిష్కార గీతిక భగవద్గీత

(డిసెంబరు 8 – గీతా జయంతి )

Bhagavadgita

శ్రీకృష్ణ పరమాత్ముడు మానవాళికి అందించిన అద్భుత బహుమతి భగవద్గీత. మానవ జీవిత గమనానికి అవసరమైన అన్ని కోణాలను స్పృశించి ్పతి సమస్యకు పరిష్కారం చూపే గ్రంథ రాజమే. శ్రీమద్‌ భగవద్గీత. మానవ జీవిత గమనానికి అవసరమైన అన్ని కోణాలను స్పృశించి ప్రతి సమస్యకు పరిష్కారం చూపే గ్రంథ రాజమే. శ్రీమద్‌భగవద్గీత. గీతా మకరందపు అనుభూతిని పొందిన వారు జీవితాంతం ఆ మధురామృతపు మాధుర్యాన్ని గ్రోలకుండా ఉండరనడంలో సందేహం లేదు. భగవద్గీత అర్జునునికి శ్రీకృష్ణుడు ఇచ్చిన ఉపదేశంలా అగుపించినా అది విశ్వ మానవళికి దిక్సూచిలాంటింది. సమస్యల వలయాన్ని చేధించే పాశుపతాస్థం లాంటిది. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో కూడా ప్రశాంతతను చేకర్చి చల్లని వెన్నెల కురిపించే అమృత కలశం గీతామాత. సర్వేపలిల, అబ్దుల్‌కలాం లాంటి మహానుభావ్ఞల మేధస్సులలో జ్ఞాన విజ్ఞాన కాంతులను వెదజల్లిన ఆదర్శ క్రాంతి గీత. అలసిన మనసుకు, భీతిల్లే హృదయానికి మానసిక ధైర్యాన్నిచ్చే ఓదార్పు గీతిక భగవద్గీత.

తెలుగు ఆటగాడు
వివిఎస్‌ లక్ష్మణ్‌ ఏ దేశంలో క్రికెట్‌ ఆడటానికి వెళ్లినా తనకు మనో బలాన్నిచ్చే గీతను తనతోపాటు తీసుకెళేల్వఆడు. నవ జీవన స్రవంతిలో విజయ సోపానికి భగవద్గీత ఎంత అవసరమో యండవరి వీరేంద్రనాథ్‌ గారు తన విజయానికి ఆరోమెట్టు గ్రంథంలో సోదాహరణంగా వివరించారు. వ్యక్తిత్వ వికాసానికి బలాన్నిచ్చే ఉత్తేజ తరంగం భగవద్గీత. గీ నేర్చుకో తలరాత మార్చుకో అనే వాక్యం చదువ్ఞ నేర్చుకోవడానికి ఉద్దేశించినా అది భగవద్గీత విషయంలో కూడా చక్కగా సరిపోతుంది. మన భవిష్యత్తును చక్కగా మలచుకోవడానికి గీత సారాన్ని వంటబట్టించకోవడం ఎంతైనా అవసరం.
పద్దెనిమిది అధ్యాయాలు గల భగవద్గీతలో మొత్తం 700 శ్లోకాలు ఉండగా దృతరాష్ట్రుడు మొదటి, తన ఏకైక శ్లోకంతో గీతను ప్రారంభించాడు.

సంజయుడు చెప్పిన శ్లోకాలు 41 కాగా అర్జునుని నోటి నుండి వెలువడిన శ్లోకాలు 84. మిగతా 574 శ్లోకాలు కృష్ణ పరమాత్ముడు ఉపదేశించినవి. మొదటి అధ్యాయం అర్జునుని మనో వేదనను తెలిపితే రెండవ అధ్యాయమైనసాంఖ్య యోగం నుండి ృష్ణ పరమాత్మ తన ఉపదేశాన్ని ప్రారంభించి కర్మ, జ్ఞాన, కర్మ సన్యాస, ఆత్మ సంయమ, విజ్ఞాన, అక్షర పరబ్రహ్మ, రాజవిద్యా రాజగుహ్యా, విభూతియోగం తరువాత పదకొండో అధ్యాయమైన విశ్వరూప సందర్శన యోగంలో భగవానుడు తన పూర్తి రూపాన్ని అర్జునునికి చూపించి జ్ఞాన దృష్టిని ప్రసాదిస్తాడు.

తదనంతరం భక్తి, క్షేత్ర, క్షేత్రజ్ఞ విభాగ, గుణత్రయ విభాగ, పురుషోత్తమ ప్రాప్తి, దైవాసుర సంపద్విభాగ, శ్రద్ధాత్రయ విభాగ యోగల ద్వారా మోక్ష సంన్యాస యోగంతో భగవద్గీత బోధనను పరి సమాప్తం చేస్తాడు. ఇందులోని ప్రతి శ్లోకం వజ్రతుల్యమే.
భగవద్గీతను మానవ్ఞలు మరణించిన సందర్భంలో వేసే రికార్డులా కాకుండా సంసార సాగరన్ని దాటడానికి వాడే నావగా వినియోగించుకోవాలి. ‘ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవ సాధయేత్‌ అని గీతాచార్యుడు చెప్పినట్లుగా చెప్పినట్లుగా తనను తాను ఉద్ధరించుకోవాటినికి ఉపకరించే ఉపయుక్త గ్రంథం.
యతో యతో నిశ్చరతి
మనశ్చంచల మస్థిరం!
తత స్తతో నియమ్యతత్‌
ఆత్మన్యేవ వశం నయేత్‌!!
తేజః సమా దృతిః శౌచం
అద్రోహో నాతి మానితా
భవంతి సంపదం దైవం
అభిజాతస్య భారతా!
అహింస, నిజాయితే, కోపము లేకుండుట, త్యాగ నిరతి, శాంత స్వభావము, కొండెములు చెప్పకుండుట, అన్ని ప్రాణులయందు దయ, విషయ లోలత్వం, లేకుండుట, మృదు స్వభావం, బిడియము, చంచల స్వభావం లేకుండుట, తేజస్సు, ఓరిమి తనము, దృఢ నిశ్చయము, పవిత్రత, ద్రోహ రాహిత్యము, గర్వ శూన్యత మొదలగు సద్గుణాలన్ని దైవిక సంపదలో పుట్టే వానికి ఉంటాయని మనము ఆ గుణాలను అలవరచుకుంటే మానవ్ఞడు కూడా మహనీయుడు అవ్ఞతాడని గీత చెపుతున్నది. వివేకానందుడు, గాంధీజీ, అబ్దుల్‌కలాం లాంటి భారతీయ మహానుభావ్ఞలే కాకుండా పాశ్చాత్య దేశాలకు చెందిన అనిబిసెంట్‌ లాంటి మాజిక వేత్తను, హెన్రి డేవిడ్‌ థోరో, టి.ఎస్‌.ఇలియట్‌ వంటి రచయితలను రాబర్ట్‌ ఒపెన్మేయర్‌ లాంటి భౌతికశాస్త్ర వేత్తలను, వారెన్‌ హేస్టింగ్స్‌ లాంటి అధికారులను, పిలిప్‌గ్లాస్‌ లాంటి సంగీత దర్శకులను ఇలా ఎందరినో గీతా తన గంగా ప్రవాహంతో ముగ్ధులను చేసింది.. చేస్తుంది.. చేయనుంది కూడా!
అంతరిక్షంలో ఎక్కువ సమయం నడిచిన మహిళగా రికార్డ్‌ సృష్టించిన ప్రవాస భారతీయ వనతి సునితా విలియమ్స్‌ తనతో పాటు అంతరిక్షంలోకి భగవద్గీతను తీసుకెళ్లింది. ఇంత రపభావశీలి, ఉన్నతమైనది కాబట్టి ప్రపంచంలో ఏ గ్రంథానికి జరపని జయంతి వేడుకలు కేవలం భగవద్గీలకు మాత్రమే సొంతమయ్యాయి.

  • గుండేటి రమణ

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/