గ్రీన్‌ చట్నీల రుచులు

Ruchi

తోటకూర పచ్చడి


కావలసినవి:
తోటకూర-రెండు కప్పులు
సన్నగా తరిగిన గోంగూర-ఒక కప్పు
ఉల్లి తరుగు-అరకప్పు
వెల్లుల్లిరేకలు-5, తాలింపుగింజలు-కొద్దిగా
ధనియాలు-ఒక స్పూన్‌
తెల్లనువ్ఞ్వలు-ఒక స్పూన్‌, మెంతులు-అర స్పూన్‌
ఎండుమిర్చి-5, పచ్చిమిర్చి-4
ఇంగువ-పావ్ఞస్పూన్‌,పసుపు-పావ్ఞ స్పూన్‌
నూనె-తగినంత, ఉప్పు-తగినంత
సన్నగా కోసిన కొత్తిమీర – రెండుస్పూన్లు

తయారుచేసే విధానం:
ముందుగా స్టౌమీద బాండీ పెట్టి తగినంత నూనె వేసి శుభ్రంగా కడిగి ఆరబెట్టి సన్నగా కోసిన తోటకూర, గోంగూర వేసి కొద్దిసేపు వేయించి తీసి బౌల్‌లోకి తీసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కల్ని కూడా కొద్దిగా నూనె వేసి దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు మరల స్టౌమీద బాణలి పెట్టి తగినంత నూనె వేసి తాలింపు గింజలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి వేగాక పసుపు, ఇంగువ, వెల్లుల్లి రేకులు, తగినంత ఉప్పువేసి రెండు నిమిషాలు తిప్పి దించి రోట్లో వేసుకోవాలి. ఈ తాలింపుగింజల్ని కొద్దిగా వేడి తగ్గాక రోకలితో మెత్తగా దంచి ముందు వేగించిన ఉల్లిపాయలు వేసి కొద్దిగా నలిగేవరకు దంచి ఆ తర్వాత దానిలోనే వేయించిన తోటకూర, గోంగూర వేసి మెత్తగా దంచి తీయాలి. దీనికి పైన కొత్తిమీర వేస్తే ఇంకా రుచిగా ఉంటుంది.

చుక్కకూర తాళింపు

Ruchi
RUCHI

కావలసినవి:
తోటకూర-రెండు కట్టలు, చుక్కకూర-ఒక కట్ట
సన్నగా కోసిన టమాట ముక్కలు-అరకప్పు
పచ్చి శనగపప్పు-రెండు స్పూన్లు
తాలింపు గింజలు-కొద్దిగా,ఎండుమిర్చి-రెండు
ఇంగువ-పావ్ఞ స్పూన్‌
సన్నగా కట్‌చేసిన పచ్చిమిర్చి-నాలుగు
ఉప్పు, కారం-తగినంత,నూనె-తగినంత, వాము ఆకులు-రెండు,సన్నగా తరిగిన కొత్తిమీర-రెండు స్పూన్లు
పసుపు-పావు స్పూన్‌, వెల్లుల్లిరేకలు-మూడు

తయారుచేసే విధానం:
ముందుగా తోటకూర, చుక్క కూరలను (కాడలతో కలిపి) శుభ్రంగా కడిగి సన్నగా కట్‌చేసి స్టీలు గిన్నెలోకి తీసుకోవాలి. దీనిలోనే ఉల్లిపాయ ముక్కలు, టమాటముక్కలు, పచ్చిశనగపప్పు, పచ్చిమిర్చి, పసుపువేసి దీనిలో నీళ్లు పొయ్యకుండా కుక్కర్లో పెట్టి ఒక గ్లాస్‌ నీళ్లుపోసి నాలుగు కూతలు వచ్చేవరకు ఉడికించి దించి పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లారేలోపు స్టౌమీద బాండీపెట్టి తగినంత నూనెవేసి దీనిలో మినపప్పు, ఆవాలు, జీర, ఎండుమిర్చి వేసి దోరగా వేగాక కొద్దిగా ఇంగువ, మెత్తగా చేసిన వెల్లుల్లిరేకలు, సన్నగా కట్‌చేసిన వాము ఆకులు వేసి ఒకసారి బాగా కలిపి దించి ఉడికించిన పులుసు కూరలో వేసి బాగా కలిపి దీనిని మరల ఐదునిమిషాలు స్టవ్‌ మీద పెట్టి ఉడికించి దించుకోవాలి. తోటకూరతో పెరుగు పచ్చడి కూడా చేస్తారు. ఇది చాలా రుచిగా ఉంటుంది.