కుక్కర్‌తో జాగ్రత్త

Cooker Using
Cooker Using


కుక్కర్‌తో ఇబ్బందులు ఏర్పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే…కుక్కర్‌లో కొలత ప్రకారం నీటిని పోయాలి. కంటైనర్స్‌ ఒరగకుండా సరిగ్గా అమర్చాలి. పాత్రలు ఒరిగితే అందులోని పదార్థాలు కుక్కర్లో పడిపోయి, కుక్కర్‌లోని నీటితో ఉడకటం వల్ల, కుక్కర్లో నీరు ఇంకిపోయి సేఫ్టీ వాల్వ్‌ బద్దలవడం, వెయిట్‌ ఎగిరిపోయి కుక్కర్లోని పదార్థాలు పైకి చిమ్మటం లాంటివి జరుగుతాయి.

గ్యాస్కెట్‌ పాడయిపోతే, కుక్కర్‌ పక్కల నుంచి ఆవిరి బయటకు వచ్చేస్తుంది. అందువల్ల లోపలి పదార్థాలు ఉడకకపోగా ఎంతసేపటికి విజిల్‌రాదు. కుక్కర్‌లోని నీరంతా అయిపోయి, సేఫ్టీవాల్వ్‌ పోతుంది. కుక్కర్‌ మూత పక్క నుంచీ ఆవిరి బయటకు వస్తుంటే గాస్కెట్‌ను మార్చాలి. కుక్కర్‌లో పెట్టిన గిన్నెలలో ఆహారపదార్థాలను, బియ్యాన్ని పెట్టినప్పుడు ఆ పాత్రలలో నీరు అవి ఉడికించేందుకు సరిపడా పోయాలి.
చిన్న గిన్నెలలో ఎక్కువ పదార్థాలను పెట్టడం వల్ల అవి సరిగ్గా ఉడకవ్ఞ. లేదా పొంగి కుక్కర్లో పడతాయి. కుక్కర్లో మూత కున్న ఆవిరి రంధ్రం మూసుకు పోకుండా ప్రతిరోజు శుభ్రపరచాలి. అదేవిధంగా వెయిట్‌ని కూడా ప్రతిరోజు శుభ్రం చేయాలి. కుక్కర్లోంచి ఆవిరి త్వరగా రావటానికి, లోపలి పదార్థాలు ఉడకటానికి హెచ్చుమంటను పెట్టాలి.