పశ్నించనివ్వండి!

Children Questing
Children Questing

నిజమే, నిపుణులు చెబుతున్న విషయంపై కాస్త దష్టి పెట్టాల్సిందే అనిపిస్తోంది. ఎందుకంటే చాలామంది పిల్లలు తమ ముందు ఏం జరుగుతున్నా ప్రశ్నించకుండా ప్రేక్షకపాత్ర వహిస్తారు. అంటే అదేదో సమాజానికి చేటు జరిగిపోతున్న విష యాల్లోనే కాదు, తాము ఎదుర్కొంటున్న పరిస్థితు లపై కూడా అందుకు కారణం అయిన వారిని ప్రశ్నించకపోవడం ఇక్కడ ప్రధాన సమస్యగా పరిగణించాలి.
మరికొంత మంది తమకు ఇష్టంలేని ప్రవర్తనలను కూడా బలవంతంగా అంగీ కరిస్తూ, తరువాత తమలో తామే మదన పడుతూ ఉంటారు.
ఇలాంటి ఆలోచనా విధానాలన్నింటికీ కచ్చితంగా చిన్నతనంలో పిల్లల్ని ప్రశ్నించనీయక పోవడమే అని చెప్పలేం కానీ, ఇదొక ప్రధాన కారణంగా మాత్రం చెప్పవచ్చు. ప్రశ్నించే పిల్లల్ని అడ్డుకోవడం, విసుక్కోవడం వల్ల ఆ సమస్య అక్కడితే ఆగిపోదు, అనేక సమస్యల్ని సృష్టిస్తుంది.
మొహమాటాన్ని నేర్పుతుంది
ప్రశ్నించకపోవడం అనేది మొహమాటాన్ని తీవ్రస్థాయిలో పెంచుకుంటూపోతుంది. తీరని అన్యాయం జరుగుతున్నా, మోయలేని బరువును నెత్తిన పెడుతున్నా, అకారణంగా నిందిస్తున్నా, అనవసర విషయాలు గంటలకొద్దీ మాట్లాడుతున్నా నోరు మెదపలేని స్థితి నిజంగా మానసిక రుగ్మత లకు దారితీస్తుంది. డిప్రెషన్‌లో పడేస్తుంది.
మనిషి నిత్యం తనలో తాను ఆలోచించుకుంటూ, ఒంట రితనంలో కూరుకుపోయేలా చేస్తుంది.
ఇదంతా అవసరమైన చోట ప్రశ్నించకపోవడం వల్ల, అనవసరమైన చోట మొహమాటం ప్రదర్శించడం వల్ల ఏర్పడే పరిస్థితి. అదే ప్రశ్నించే గుణం ఉన్నవాళ్లయితే ఎప్పటికప్పుడు తమ సందేహాల్ని నివత్తి చేసుకుంటూ, ఇష్టంలేని విషయాల నుంచి, మనుషుల నుంచి తప్పుకుంటూ ప్రతి చిన్న విషయానికి మానసిక ఆందోళనకు గురికాకుండా హాయిగా ఉంటారు. ఇలాంటి వారికి విషయాలపై స్పష్టమైన అవగాహన కూడా ఏర్పడుతుంది.
నమ్మి మోసపోయే అవకాశం
ప్రశ్నించే గుణంలేని వాళ్లు తమని తాము కూడా చాలా సందర్భాల్లో ప్రశ్నించుకోరు. ఎదురుగా ఉన్న పరిణామాలు ఎన్ని సందేహాలను కలిగిస్తున్నా గాలికి వదిలేసి గుడ్డిగా ముందుకుపోయే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి మనస్థత్వం ఉన్న వాళ్లు ఎవరి నైనా ఇట్టే నమ్మేస్తారు,
అలా నమ్మడం వల్ల ఒక్కోసారి తీవ్రంగా నష్టపోతారు. అదే ప్రశ్నించే గుణం ఉంటే జరుగుతున్న పరిణా మాలను దష్టిలో పెట్టుకొని తమని తాము ప్రశ్నిం చుకోవటం, సంబంధిత వ్యక్తిని ప్రశ్నించడం, విషయాన్ని లోతుగా ఆలోచించడం, అర్థం చేసుకోవడం వంటివి వెంట వెంటనే జరిగిపోతూ ఉంటాయి. ఈ క్రమంలో ఎదుటి వ్యక్తిని, ముందున్న పరస్థితులను అంచనా వేసి తగిన జాగ్రత్తలు తీసుకోవడం వీలవుతుంది.
ప్రశ్నించకపోవడంవల్ల ఎదురయ్యే సమస్యలు ఎప్పుడో పెద్దయిన తరువాత అప్పటికప్పుడు వచ్చేవి కావు.
అవి చిన్నప్పటినుంచే ఒక విధమైన నడవడికకు అలవాటు చేసేస్తాయి. కారణం పెద్దవాళ్లు పిల్లలనుంచి ఎదురయ్యే ప్రశ్నలకు సరైన స్పందన ఇవ్వకపోవడమే, అంతకు మించి అదేదో నేరం అన్నట్లుగా వారిపై విసుగు ప్రదర్శించడమే.
కాబట్టి పిల్లలు తమజీవితంలో ఎదుగుతున్న కొద్దీ వారి మేధస్సును పెంచుకుంటూ నిత్యం వారి మెదడు చురుకుగా పనిచేయాలన్నా, ఏదైనా విషయాన్ని తెలుసుకోవాలనే, నేర్చుకోవాలనే కుతూహలం వారిలో ఎప్పుడూ ఉండాలన్నా చిన్న తనంలో వారి ప్రశ్నించే తీరును అభినందిస్తూ, సరైన సమాధానాలు చెబుతూ, తెలియని విష యాలు తెలుసుకొని చెప్పే ప్రయత్నం చేస్తే వారి వ్యక్తిత్వానికి అవి ఎంతో ఉపకరిస్తాయి అంటు న్నారు మానసిక నిపుణులు.
అన్నింటికీ మించి ఇలా ప్రశ్నించే గుణం ఉన్న పిల్లలు చదువులోనే కాదు, సజనాత్మకతలోనూ ముందుంటారని చెబుతున్నారు.
ఇంకెందుకు ఆలస్యం ఈసారి మీ చిన్నారులు ప్రశ్నలు అడుగుతుంటే ముద్దుగా సమాధానాలు చెప్పి వారి మనసులోని సందేహాలన్నీ తీర్చి ప్రోత్సహించండి. విషయాలపై అవగాహన ఏర్పడే సమాధానాలు చెప్పి వారి ఆలోచనా ప్రపంచ పరిధిని పెంచండి.