పిల్లల్ని తినిపించే బడికి పంపాలి

Children Eating Before going to School
Children Eating Before going to School

సన్నగా తక్కువ బరువుతో ఉండటమే సరైన ఆరోగ్యమనే భ్రమలో ఉండవద్దని కూడా నిపుణులు అంటున్నారు. మానసికంగా ఒత్తిడిని అనుభవిస్తున్న వారు బ్రేక్‌ఫాస్ట్‌ని వదిలివేయటం అసలు మంచిదికాదు. వీరు అల్పాహారం తీసుకోలేకపోయినా కనీసం ఒక పండుని అయినా తినటం మంచిది. దీనివలన ఆకలి, ఆరోగ్యం పెరుగుతాయి.
బీ పొద్దున్న ఏమీ తినకుండా స్కూలుకి వెళ్లే పిల్లలు చదువులో ఎక్కువ ప్రతిభని కనబర్చకపోవటం కూడా పరిశోధకులు గమనించారు. ఉదయం ఆహారం తీసుకోకపోవటం మెటబాలిజం రేటుని ప్రభావితం చేయడమే కాకుండా ఏకాగ్రతను తగ్గిస్తుంది. ఎంత హడావుడిలో ఉన్నా పిల్లలకు ఉదయం టిఫిను పెట్టకుండా స్కూలుకి పంపకూడదు.

మొలకెత్తిన, ఉడికించిన గింజలు, ఉడికించిన గుడ్డు, ఇడ్లీ, ఉప్మా, చపాతీ ఇవే కాదు, పళ్లను కూడా ఉదయపు అల్పాహారంగా తీసుకోవచ్చు.
బీ పొద్దున్నే తృణధాన్యాలను అల్పాహారంగా తీసుకున్న మహిళలు ఇతర ఆహారాన్ని తీసుకున్న వారికంటే నాజూకుగా ఉన్నట్టు గమనించారు. ఈ ఆహారంలో కొవ్వు కేలరీలు తక్కువగా ఉండి, పీచు, ప్రొటీన్లు ఎక్కువ శాతంలో ఉంటాయి.

ఈ కారణంగా త్వరగా చక్కగా జీర్ణమవుతాయి. వీటితో పాటు పాలు తీసుకుంటే కాల్షియం లభించి అది శరీరబరువుని నియం త్రించడంలో సహాయం చేస్తుంది. ఇపుడు చాలా ఇళ్లలో ఉదయపు ఆహారంగా బ్రెడ్‌ని తీసుకుంటున్నారు. ప్లెయిన్‌ బ్రెడ్డే కాకుండా పలురకాల బ్రెడ్‌లు మార్కెట్‌లో దొరుకుతున్నాయి.

బ్రెడ్‌తోపాటు గుడ్డుని ఉడికించి, ఆమ్లెట్‌ వేసుకుని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవటం కూడా మంచి పద్దతే. గుడ్డులో ఖనిజాలు, విటమిన్లు ఎక్కువగా ఉండి కొవ్వు తక్కువగా ఉంటుంది. గుడ్డులో ఉండే కొవ్వు ప్రధానంగా పచ్చసొనలోనే ఉంటుంది. ఇది 450 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది.