కొత్తగా బడికి

                                          కొత్తగా బడికి

BOY
BOY

మరోవారం రోజుల్లో జూన్‌మాసం మొదలవ్ఞతుంది. తెలంగాణలో జూన్‌మొదటిరోజునే స్కూలు ప్రారంభమవ్ఞతే, ఆంధ్రప్రదేశ్‌లో జూన్‌ 12న మొదలవ్ఞతాయి. మొత్తానికి జూన్‌మాసంలో పిల్లలకు స్కూలు చదువ్ఞ ఆరంభం అవ్ఞతాయి. అయితే మీ పాపనో, బాబునో ఈ సంవత్సరమే కొత్తగా స్కూల్లో చేర్పిస్తే, వారు స్కూలుకి అలవాటు పడేవరకు కొన్ని విషయాల్లో శ్రద్ధ వహించాలి. అవేమిటో గమనిద్దాం.
్య మొదట్టమొదటిగా మీరు పిల్లలకు నేర్పాల్సింది పాస్‌ కానీ టా§్‌ులెట్‌ వస్తే వాష్‌రూమ్‌కు వెంటనే వెళ్లాలి అని నేర్పించండి. క్లాస్‌టీచర్‌ను అడిగి, ఆయామ్మ సాయంతో వాష్‌రూమ్‌కు వెళ్లాలి, ఒంటరిగా వెళ్లవద్దనే చెప్పాలి.
్య పిల్లలు స్కూల్లో చేయాల్సిన పనులు కొన్నింటిని ఉదా: టిఫిన్‌ బాక్స్‌, వాటర్‌బాటిల్‌ మూతతీయుట వంటివి ఇంటి దగ్గరే చేయించి అలవాటు చేయాలి.
్య అన్నిటినీ త్వరత్వరగా నేర్చుకోవాలి. లేకపోతే తోటిపిల్లలు ఏడిపిస్తారు. అని చెప్పి పిల్లల్ని అనవసర భయానికి గురిచేయకూడదు.
్య ప్రతిరోజూ స్కూలుకి పంపేటప్పుడు లంచ్‌తిను, బూటులేసులు ఊడకుండా చూసుకో, తోటిపిల్లలతో చక్కగా మెలుగు లాంటివి బోధించ కూడదు. పిల్లలకు వాటి గురించి స్కూలులో టీచరే చెపుతారు.
్య మీ పిల్లలు వాడే పెన్సిళ్లతో పాటు బూట్లు, టిఫిన్‌ బాక్సులు తోటి పిల్లల కుండే లాంటివి కొనాలి. అవి మారకుండా వాటిపైన పేర్లు రాయించాలి.
్య పిల్లల్ని స్కూలు ఎలా ఉంది? లాంటి కష్టమైన ప్రశ్నలు వేయ కుండా మీ ప్రక్కన ఎవరు కూర్చుంటారు. లంచ్‌ తిన్నవి బాగున్నాయా? మీ టీచర్‌ మంచి కథలేమైనా చెప్పిందా లాంటి ప్రశ్నలు వేస్తే పిల్లలు ఉత్సాహముగా సమాధానాలు చెపుతారు.
్య మొదటిరోజు మీ బిడ్డను మీరే స్వయంగా టీచర్‌కి పరిచయం చేయాలి. అప్పుడు వారికి కనీసం నేనెవరో తెలిసిన టీచర్‌ ఉంది అనిపిస్తుంది.
్య స్కూల్‌లో ఆడుకున్నానని పిల్లలు చెబితే మందలించకూడదు. జీవితం గురించి తెలుసుకోవడానికి పిల్లలకు ఉత్తమ మార్గం ఆటలే.
్య పిల్లలు ఒకటి రెండు వారాలు స్కూలు నుండి తిరిగొచ్చినపుడు అలసట ఉండవచ్చు. మిమ్మల్ని విసిగించవచ్చు. పిల్లలు తమ ధ్యాసలో తాముండి సేదతీరేటట్లయితే కాసేపు వారినలా వదిలి వేయాలి. స్కూల్‌లో జరిగిన వన్నీ చెప్పబోతే శ్రద్ధగా వినాలి.
్య టిఫిన్‌ బాక్సులో ప్రతిరోజూ ఒకేలాంటి ఆహారం కాకుండా రోజుకోరకం ఆహారపదార్థం పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు.
్య స్కూలు గురించి మంచి విషయాలే మాట్లాడాలి. టీచర్లను ఎగతాళి చేయటం, ఏదో ఒకటి అనటం తగదు. ఎందుకంటే వారే చదువ్ఞనకు సంబంధించి మీ పిల్లలకు జీవితాంతం ముఖ్యమైన వ్యక్తులవ్ఞతారు.
్య తోటివిద్యార్థులతో ప్రేమగా, ఆప్యాయతతో ఉండాలని నేర్పించండి. పోట్లాడకూడదు, ఇతరుల వస్తువ్ఞలను తీసుకోకూడదని చెప్పండి.
్య అబద్దాలు చెప్పకూడదని, టీచర్లకు ఎదురుతిరిగి మాట్లాడకూదని, బుద్ధిగా మసలుకోవాలని నేర్పించండి. ఒంటరిగా బాత్‌రూమ్‌కు వెళ్లవద్దని, ఆయమ్మ లేదా తోటి విద్యార్థుల సాయం తీసుకోవాలని చెప్పాలి. పిల్లలు ఇంటికి రాగానే ఆరోజు స్కూల్లో చేసిన విషయాలన్నింటిని శ్రద్ధగా అడిగి తెలుసుకోండి. చదువ్ఞలో వారు ఎలాంటి శ్రద్ధ చూపుతున్నారో గ్రహించి, దానికి అనుగుణంగా వారిని ప్రోత్సహించండి.
్య ఇతర పిల్లలతో పోల్చి, విమర్శించేధోరణికి దూరంగా ఉండండి.

CHILD IN SCHOOL
CHILD IN SCHOOL