మౌనమేలనోయి..

ఇంటికొచ్చాక రాధికకు వళ్లుమండిపోయి, ఒక వారం రోజులు తనకు జ్వరం వచ్చిందని, ఇంటిపనులను, పిల్లల పనులను వేటినీ పట్టించుకోకుండా మంచానికే అతుక్కునిపోయింది. మనసును కఠినం చేసుకుని, ఏ పనులను చేసేందుకు ప్రయత్నించలేదు. ఒకరోజు రెండు రోజులు రమేష్‌ ఎలాగో ఇబ్బంది పడ్డాడు కానీ మూడోరోజు నుంచి ఆయనకు కష్టమైపోయింది. రోజూ రాధిక చేసే ఇంటిపనిపై చిన్నచూపు ఉన్న రమేష్‌ తన ఆలోచనావిధానం తప్పని గ్రహించాడు.
కాలింగ్‌ బెల్‌ మోగగానే ఈ సమయంలో ఎవరొస్తారబ్బా అనుకుంటూ తలుపు తీసింది ఆ ఇంటి ఇల్లాలు నీరజ. ఎదురింటి కామాక్షి నవ్ఞ్వతూ కనిపించింది. ‘లోపలికి రావచ్చా? అని అడిగింది. నీరజ ‘రండి..రండి ఆంటీ అని లోపలికి ఆహ్వానించింది.

ఎప్పుడూ రానిది ఈరోజు వచ్చిందేమిటి అని సందేహపడుతూనే ఉంది నీరజ. రోజూ కనిపించినప్పుడు చిరునవ్ఞ్వ నవ్వే ఆంటి నేడు ఇంటికే వచ్చింది అని మనసులో కాస్త ఆనందపడింది. ‘కాఫీ ఏమైనా తాగుతారా? అడిగింది నీరజ. ‘నువ్ఞ్వ ఆ పనులేమీ పెట్టుకోవద్దు, కాసేపు సరదాగా నీతో మాట్లాడి వెళ్దామని వచ్చాను అంది. ‘మీవారు పిల్లలు ఎక్కడివారు అక్కడి వెళ్లిపోయారు. మరి రోజంతా ఏం చేస్తుంటావ్ఞ? అడిగింది కామాక్షి. ‘ఏం ఉంటుంది ఆంటీ! ఇంటి పనులతోనే సరిపోతుంది. పని అయిపోతే టివి పెట్టుకుంటాను అంది.

‘అందరం అదే పని చేస్తున్నాం లే చిరునవ్ఞ్వతో చెప్పింది మీనాక్షి. కాసేపు ఇద్దరూ ఆ ముచ్చట్లు, ఈ ముచ్చట్లు చెప్పుకుని ఇంటికి వెళ్లిపోయింది మీనాక్షి. మళ్లీ తన పనులో మునిగిపోయింది నీరజ. ఎందుకనో తన మనసు కాస్త ఆనందంగా అనిపించింది. కాసేపు మనసు విప్పి మాట్లాడుకున్నందుకు సంతృప్తి అనిపించింది. సాయంత్రం ఇంటికొచ్చిన భర్తకు కాఫీ ఇచ్చింది నీరజ. అతనితో ఏదో మాట్లాడలనుకుంది. ఇంతలో అతను నేను చాలా అలసిపోయాను అంటూ, విశ్రాంతి తీసుకునేందుకు ప్రయత్నించాడు. నిజంగా అలసిపోయాడని నీరజ అక్కడ నుంచి వంటిట్లోకి వెళ్లిపోయింది. ఇంతలో ఆమెకు భర్త మాటలు వినిపించాయి. ఎవరితో మాట్లాడుతున్నాడనుకుని అటువైపుగా వెళ్లి చూసింది నీరజ. ఆఫీసు నుంచి కాల్‌లాగా ఉంది. చాలా ఉత్సాహంగా, ఆనందంగా మాట్లాడుతున్నాడు. అతడిని అలాగే చూస్తూ ఉండిపోయింది నీరజ. తాను మాట్లాడేందుకు ప్రయత్నిస్తే, అయిష్టతను వ్యక్తం చేసిన ఈ మనిషి, ఎంత హ్యాపీగా మాట్లాడుతున్నాడో అని నిట్టూర్పు విడిచింది.

సుమలత, సుధీర్‌ ఇద్దరూ భార్యాభర్తలు. సుమలత చెల్లి వివాహానికి ఇద్దరూ హాజరయ్యారు. వివాహ వేడుకలో సుధీర్‌ చూసిన సుమలత ఆశ్చర్యపోయింది. అసలు తన భర్తనేనా అనుకుంది. ఇంట్లో ఎప్పుడూ సీరియస్‌గా ఉంటాడు. ఒక్క చిరునవ్ఞ్వతో కూడిన మాట కూడా మాట్లాడడు, ఇక్కడేమో అంతా తానే అనేంతగా సరదాగా పనులు చేస్తూ, అందరితో నవ్ఞ్వతూ మాట్లాడుతున్నాడు అనుకుంది. ఆడవారు మగవారు అనే తేడా లేకుండా జోక్స్‌ వేస్తూ, నవ్ఞ్వతూ, నవ్విస్తూ ఉండే సుధీర్‌ ప్రవర్తన సుమలతకు కొత్తగా అనిపించింది.
రాధిక, రమేష్‌ దాంపత్యం మరీ విచిత్రమైంది. ఇంట్లో భార్య అనే ఒక మనిషి ఉందనే స్పృహ కూడా అతనికి ఉండదు. అంతటి నిశ్శబ్దాన్ని పాటిస్తుంటాడు. భార్యతో కనీసం ఒక్క మాట అంటే ఒక్క మాటైనా మాట్లాడడు. ఎప్పుడూ మౌనంగా ఉండిపోతాడు.

ఆమె ఏదైనా అడిగితే, అవును కాదు, లేదా తల ఊపడం తప్ప మరొక సంభాషణ వారిద్దరి మధ్య ఉండదు. ఇది తన భర్త నైజమని, తన జీవితం ఇంతేనని రాధిక అనుకునేది. ఇద్దరు కలిసి ఊరికి వెళ్లేందుకు బస్సు ఎక్కారు. ఒక బస్టాప్‌లో బస్సు దిగిన భర్త కాఫీ తాగుతూ, అక్కడున్న వారితో మాట్లాడేతీరును చూసి, అవాక్కైపోయింది రాధిక. అసలు తన భర్తనేనా అనుకుంది. అంతగా పగలబడి నవ్ఞ్వతూ, జోక్స్‌ వేస్తున్నాడు. ఎందుకనో రాధికకు మొట్టమొదటిసారిగా మనసు బాధతో నొచ్చుకుంది. చాలామంది భర్తల తీరు ఇలాగే ఉంటుంది. భార్య అంటే మన మనిషే, ఆమెతో ఎప్పుడైనా మాట్లాడవచ్చు లేదా మాట్లాడకపోయినా పర్వాలేదు అనే నిర్లక్ష్యం ఉంటుంది.

ఆమెకు అన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు, ఆమెను అడిగి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదనుకుంటారు. భార్య అంటే ఇంట్లో పనికి, పిల్లల పనికి మాత్రమే ఉపయోగపడుతుందని, ఆమెకు మెదడు, మనసు ఉంటుంది అనే ఆలోచన లేకుండానే ప్రవర్తిస్తుంటారు. మాట్లాడే ఆ రెండుమూడు మాటలు కూడా మొక్కుబడిగా ఉంటాయి. ఆమెను ఒక ఇంటి మనిషిగానే భావిస్తారు తప్ప ఆ మనసులో కూడా ఎన్నో వేలకొద్దీ ఉపయోగపడే ఆలోచనలు ఉంటాయని, నిరంతరం తన కుటుంబ సభ్యుల శ్రేయస్సును కాంక్షించే ఆమె విశాల భావాలు ఉన్నతమైనవనే ఆలోచనలు ఎందుకు వీరికి రావ్ఞ?
ఇంటికొచ్చాక రాధికకు వళ్లుమండిపోయి, ఒక వారం రోజులు తనకు జ్వరం వచ్చిందని, ఇంటిపనులను, పిల్లల పనులను వేటినీ పట్టించుకోకుండా మంచానికే అతుక్కునిపోయింది
.
మనసును కఠినం చేసుకుని, ఏ పనులను చేసేందుకు ప్రయత్నించలేదు. ఒకరోజు రెండు రోజులు రమేష్‌ ఎలాగో ఇబ్బంది పడ్డాడు కానీ మూడోరోజు నుంచి ఆయనకు కష్టమైపోయింది. రోజూ రాధిక చేసే ఇంటిపనిపై చిన్నచూపు ఉన్న రమేష్‌ తన ఆలోచనావిధానం తప్పని గ్రహించాడు. వారం రోజులు భార్య పనులు చేయకపోతే తన జీవితం ఇంత దుర్భరంగా, పిల్లల పరిస్థితి ఇంతగా ఉంటే ఇక ఆమె శాశ్వతంగా దూరమైపోతే.. ఆ ఆలోచనే ఆయనకు భయం వేసింది. అంతే రాధికకు ఏలోటు లేకుండా చూసుకోవడం మాత్రమే కాదు, ఆమె మనసును గ్రహించి, తన భార్యకు ప్రాధాన్యత ఇవ్వడం ఆరంభించాడు. రమేష్‌ మారినంత సులభంగా నీరజ, సుమలత భర్తలు మారరు.

మారాలనే నిబంధన కూడా లేదు. అలాగని మరీ మొండిగా ప్రవర్తిస్తే మాత్రం ఆ నష్టం కుటుంబాలకు చాలానే ఉంటుంది. భార్య తనతో ఇరవైనాలుగు గంటలు కలిసి జీవిస్తున్నంత మాత్రాన ఆమెను తక్కువగా చూడ్డం కానీ, ఆమెను పట్టించుకోకుండా ఉన్నా పర్వాలేదులే అనే చులకనభావాలను ఇకనైనా స్వస్తి చెప్పండి. మీరు ప్రేమతో రెండు మాటలు మాట్లాడితే అదే ఆమెకు కొండంత బలం.

ఆ కాసింత ప్రేమను పంచేందుకు కూడా కష్టంగా, భారంగా అనిపిస్తే, ఎవరికోసం అందరినీ వదిలేసి వచ్చిందో భర్తలుగా మీరు ఆలోచించాలి. అప్పటివరకు తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెల మధ్య పెరిగి వచ్చిన ఇల్లాలికి అందరిని ఏకకాలంలో వదిలేసి, వచ్చి, మీతో కాపురం చేస్తున్నది అంటే మీపట్ల ఆమెకు ఉన్న ప్రేమ, అనురాగాన్ని గ్రహించాలి. ఆమెపై ప్రేమను పంచాల్సిన బాధ్యత కూడా మీపైనే ఉంది. మీతో కలిసి జీవించేందుకు ఇంటికొచ్చిన భార్య అన్నింట్లోను మీతోపాటు ఆమెకు కూడా భాగం ఉందనే సత్యాన్ని గ్రహించి, ప్రేమించాలి.

కుటుంబం అంటే ప్రేమ, అనురాగం, ఆప్యాయత, పట్టించుకోవడం అనే నాలుగు లంగర్లను ఆధారపడి పయనించే జీవననావ. ఆ ఒక్క లంగరు లేకపోయినా నావ బ్యాలెన్స్‌ తప్పి, పక్కకు ఒరిగి, నీటిలో మునిగిపోయే అవకాశం ఉంది. రెండు శరీరాలు ఒకే కప్పుకింద జీవిస్తున్నా మనసు మాత్రం వందలవేల దూరంలో పయనించడం కాదు. ఒకే నీడలో ఒకే మనసు ఒకే ప్రేమతో పయనించాలి. అప్పుడే ఆ కాపురం హ్యాపీగా ఉంటుంది.

100గ్రా. ఉల్లిలో 50 కేలరీలుంటాయి. కాబట్టి రోజూ ప్రతివ్యక్తీ 70 కేలరీలు తీసుకోవాలి. కంటికి, జ్ఞాపకశక్తికి, జీర్ణక్రియకి దోహద కారి. ఉడికించిన ఉల్లి చర్మపు రంగు నిగారింపుకి, ఆకల్ని పెంచ టానికి దోహదం చేస్తుంది. స్త్రీలలో వంధ్యత్వాన్ని పోగొడుతుంది. అజీర్ణంగా అన్పిస్తే ఉల్లిని చిన్నముక్కలుగా తరిగి నిమ్మరసం పిండి అన్నంలో తినాలి.

అతిసారం వల్ల నీళ్ల విరేచనాలు అవ్ఞతుంటే ఉల్లిని అరగదీసి రోగి బొడ్డుపై రాయాలి. లేదా బట్టపై ఉల్లిరసం పట్టించి బొడ్డుపై కట్టాలి. కలరా వ్యాధికి ఉల్లిరసంలో ఉప్పు కలిపి తాగించాలి. 15నిము షాలకోసారి 10ఉల్లిచుక్కల్ని పుదీనారసాన్ని కలిపి తాగించాలి.

హైబి.పి ఉన్నవారు పచ్చిఉల్లిని తినాలి. వాంతులకి ఉల్లిలో ఉప్పు కలిపి నమలాలి. మానసిక అలసట పోవాలంటే ఉల్లిని తింటుండాలి. మూత్రం జారీ కావాలంటే ఉల్లిని నీటిలో ఉడికించి ఆ కషాయాన్ని రోజూ మూడుపూటలా తాగాలి. దగ్గు, గొంతునొప్పి, జలుబుకి ఉల్లిని చితకగొట్టి ముక్కు దగ్గర వాసన చూస్తుండాలి. జాండీస్‌కి, ఉల్లిని మధ్యలో చీల్చి వెనిగర్‌లో వేసి ఉప్పు, మిరియంతో కలిపి ఉదయం సాయంత్రం తినాలి.