ఇంకెంత కాలం సర్ధుకుపోవాలి?

ఈ విప్లవాత్మక మార్పులో భార్యలు అన్నింటికీ మేమెందుకు సరిపెట్టుకోవాలి. అసలు ఆడ, మగతేడాలు ఎవరు సృష్టించారు? ఇంటా బయటా సర్దుకుపోవడానికి మాకేం తక్కువ? మేమూ పురుషులతో సమానంగా బాధ్యతలు వహిస్తున్నాం కదా! అని ప్రశ్నిస్తున్నారు. ఇంతవరకు అలా ప్రశ్నించకుండా ఉండబట్టి కుటుంబ శాంతి నూరుపాళ్లూ ఉండేది…

కవిత , కరుణాకర్‌ ఇద్దరూ భార్యాభర్తలు. పెళ్లై సంవత్సరం అయ్యింది. ప్రారంభంలో కరుణాకర్‌ ఇంటిపనుల్లో భార్యకు సాయం చేసేవాడు. రానురాను ఇంటిపని, వంటపని భార్య బాధ్యతగా భావించి, ఆమెకు సాయం చేయడం మానేసాడు. దీంతో ఇద్దరిమధ్య గొడవలు, మనస్పర్థలు ప్రారంభమయ్యాయి. నేనే ఎందుకు చేయాలని కవిత, ఇది నీ బాధ్యత అంటూ కరుణాకర్‌. ఇదెక్కడి న్యాయమని కవిత, ఇదే భారతదేశ సంప్రదాయమని ఆయన ఇలా రోజూ వాదోపవాదాలతో ఇంట్లో ప్రశాంతత కరువైపోయింది. ఇది ఎంతవరకు దారితీసిదంటే ఇద్దరు విడిపోవాలనే నిర్ణయానికి వచ్చేంతగా. అయితే అందరూ కవితనే సర్దుకుని పోవాలని ఆమెకు నీతిబోధలు చేయడం ఆరంభించారు. సర్దుకుంటేనే కాపురాలు నిలుస్తాయని, లేదంటే బంధాలు విచ్ఛిన్నమవ్ఞతాయని ఆమెకు చెప్పసాగారు. బంధం నిలబడాలంటే అది ఒక్క భార్య బాధ్యతమాత్రమేననే భావన అనాధిగా సమాజంలో పాతుకుని పోయిన సంకుచిత భావన. సాధారణంగా ఈ సర్దుకుపోవడం భారతీయులలో ద్యోతకమవ్ఞతుంది. కూతురు కాపురానికి వెళ్లేటప్పుడు తల్లి ఆమెకు ఇచ్చే సలహా ఒకే ఒకటి. ‘ఆయన చెప్పినట్లు వినమ్మా మంత్రోపదేశం. ‘భార్యభర్త చెప్పినట్లు సర్వదా వినాలి అనేదే ఆ ఉపదేశసారం. దీన్నే నాగరిక భాషలో ‘సర్దుకుపోవడం అంటారు. ఈ సర్దుకుపొమ్మనే సూత్రం స్త్రీలపాలిట గొడ్డలిపెట్టుగా పరిణమిస్తున్నది. వారిలో స్వతంత్ర ఆలోచనను చిదిమివేస్తున్నది, వ్యక్తిత్వ వికాసాన్ని అరికడుతుంది. ఇంకా విని స్త్రీలవల్ల బాధపడే పురుషులు లేరా? అని ప్రశ్నిస్తే లేరనడం సత్యదూరం అవ్ఞతుంది. పురుషులవల్ల బాధితులైన స్త్రీలు 100కి 70మంది ఉంటే స్త్రీల వల్ల బాధితులైన పురుషులు 100కి ఒక్కరో అరో వ్ఞంటారు. ఈ సత్యాన్ని దాటవేసి ఇరువ్ఞరూ సర్దుకొనిపోవాలని తరచు చెప్పటం స్త్రీ జాతిని నిస్తేజం చేయటమే. సహనభావం వేరు, సర్దుకుపోవడం వేరు. ఇంతవరకు కుటుంబ ప్రశాంతతకోసం, కుటుంబ సంక్షేమానికి, స్త్రీ సహనం, సౌశీల్యం, సర్దుబాటుతనం వల్లనే భార్యాభర్తల సహజీవనం సాఫీగా కొనసాగిపోతుందనే భావం వేల సంవత్సరాల నుండి వ్ఞంది. ఈ భావం ఈ దేశానికి, ఈ రాష్ట్రానికే పరిమితం కాదు.

ప్రపంచమంతటా అమల్లోవ్ఞన్న నగ్నసత్యం. ‘అమ్మాయి నీ విప్పుడు ఇక్కడ అంటే ఈ ఇంటి ఆడపడుచువే కాదమ్మా! అక్కడ పుష్పించాల్సిన దానివమ్మా! ఇక నుండి భర్తే నీకు సర్వస్వం. నీ అత్తమామలే తల్లిదండ్రుల. నీవ్ఞ ఇకముందు మాకు ఒక చుట్టపు చూపువేనమ్మా! నీవ్ఞ అత్తింట ఒద్దికగా మసులుకోవాలమ్మా. నీ పుట్టింటికి, మెట్టినింటికి కీర్తి ప్రతిష్టలు తేవాలమ్మా! నీవ్ఞ తిరిగి నీ పుట్టింటికి ఏ పరిస్థితుల్లోనూ తిరిగి రాకూడదమ్మా! ఈ విషయాన్ని ఏమాత్రం విస్మరించకు. అంటూ అత్తింటికెళ్లే అమ్మాయికి ప్రబోధిస్తుంది తల్లి. ‘భర్త దుర్మార్గుడయినా, దుష్టుడయినా, రోగి అయినా, వ్యభిచారి అయినా పడతికి ఇహపరం ఆ పతియే తల్లీ! అని మా అమ్మ నాకు చెప్పింది. అది నేను నీకు బోధిస్తున్నా. అందువల్లనే మాతరం వారంతా మహాపతివ్రతలంగా చెలామణి అయ్యేవారం. ద్రౌపది, సీత, అహల్య, తార, మండోదరి లాంటి పంచకన్యలను వధించి వారి త్రోవలోనే, వారి ఆదర్శాలను పాటించటమే మన విద్యుక్త ధర్మమమ్మా అంటూ బోధించే ఆడపిల్ల, అలాగే మసలుకోవాలి కాబోలు అనుకొని అత్తింటికి అలాగే సంచరించేవాళ్లం.

కేవలం చెప్పింది చేయటం, పెట్టింది తినడం, ఇలాగే గత శతాబ్దపు స్త్రీల జీవితాలు వెళ్లమారిపోయ్యేవి. అంతేకాదు ఆరోజుల్లో ఉమ్మడి కుటుంబాలు విరివిగా వ్ఞండేవి. ఇంటికి పెద్ద యజమాని మామగారే. భర్త సంపాదన మామగారికే ఇవ్వడం జరిగేది. కాల ప్రవాహంలో ఎన్నో మార్పులొచ్చాయి. దేశం పారిశ్రామిక యుగం అయింది. ఉమ్మడి కుటుంబం వ్యవస్థ అంతరించింది. చిన్న కుటుంబాల సంఖ్య పెరిగింది. వేరువేరు కాపురాలు పెరిగిపోతున్నాయి. ధరలు, ధరలతోపాటు ఖర్చులూ రోజురోజుకూ పెరిగి భర్త సంపాదిస్తే సరిపోని రోజులు ఉద్భవించి ఆడవారు కూడా సంపాదించాల్సిన పరిస్థితి వచ్చింది. సంపాదించాలంటే చదువ్ఞలుండాలి. చదువ్ఞకోటానికి స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లక తప్పడం లేదు. అంతేకాదు విద్యా, ఉద్యోగ స్థాయి వచ్చాక సహజంగానే స్త్రీకి కొంత హోదా పెరుగుతున్నది. ఇంటిపని, వంటపని, పిల్లల పెంపకం, బజారుపని,
షాపింగ్‌లాంటి అన్ని బాధ్యతలు పట్టణాల్లో ఆడవారిపైనే పడుతున్నాయి. ఇటు సంపాదన, అటు బయటి బాధ్యతలూ చేస్తున్న స్త్రీని పురుషుడు తన అధీనంలో ఒద్దికతో మెలగమంటే ఎవరు వింటారు? ఈనాడు అన్నిరంగాలలో అనేక మార్పులొచ్చి అవి పాత ఆచారాలను, సాంప్రదాయాలను పూర్తిగా ఛేదిస్తున్నాయి.

ప్రపంచం మొత్తం మీద పాత విలువల అర్థాలే మారి ఆ స్థానంలో కొత్త విలువలు వద్దన్నా కద్దన్నా వచ్చి పడుతున్నాయి. ముఖ్యంగా కుటుంబ వ్యవస్థలో సమూల మార్పులు రావడం వల్ల భార్యాభర్తల బాధ్యతలూ, ఒడంబడికలూ, హద్దులూ, ఆచారాలు సరికొత్త మార్పును ఆహ్వానిస్తున్నాయి. ఈ విప్లవాత్మక మార్పులో భార్యలు అన్నింటికీ మేమెందుకు సరిపెట్టుకోవాలి. మేం ఆడవారిగా పుట్టటం మా లోపమా? అసలు ఆడ, మత తేడాలు ఎవరు సృష్టించారు? ఇంటా బయటా సర్దుకుపోవడానికి మాకేం తక్కువ? మేమూ పురుషులతో సమానంగా బాధ్యతలు వహిస్తున్నాం కదా! అని ప్రశ్నిస్తున్నారు. ఇంతవరకు అలా ప్రశ్నించకుండా ఉండబట్టి కుటుంబ శాంతి నూరుపాళ్లూ ఉండేది. రెండు చేతులూ వాయిస్తే గదా చప్పట్లు మ్రోగేది! ఒక వ్యక్తి అధికారాన్ని చలాయించడం రెండో వ్యక్తి అతని ఆజ్ఞలను శిరసావహించడం జరుగుతుంటే ఇంక సంచలనానికి తావేది? అదే కుటుంబశాంతి, భార్యాభర్తల మధ్య ప్రశాంతత అని వ్యక్తీకరిస్తే ఇక వాదన అనవసరం.

అంటే ఇంతవరకు సర్దుకుపోండి, సర్దుకుపొండి అనేదానికి స్త్రీయే సర్దుకుపోవడం పరమసత్యం, అది సత్యం కూడాను. ఆలోచనలు సరికొత్త పుంతలు తొక్కుతున్నాయి. స్త్రీలు తమకు స్వంత ఆలోచన ఉందనే భావం కలిగి మా మాట కాస్త వింటారా? మా ఆలోచనా పరిధిలో మేమూ ఆలోచిస్తాం. ఈ విమర్శ ద్వారా తేలిందేమంటే పేచీలు, ఘర్షణలు వచ్చినాసరే ఎంత కాలమని మేం సర్దుకొనిపో తాం? ఇకముందు కలిసిమెలసి సహజీవనం సాగించాలంటే ఇద్దరం సర్దుకొనిపోవాలి. కాని మేం మాత్రమే సర్దుకొనిపో లేం అని తేత్చి చెపుతున్నారు ఆధునిక స్త్రీలు.

Couple
Couple