డిప్రెషన్‌కు కారణాలు

Depression

డిప్రెషన్‌ అనేది కేవలం మనసుకూ, మెదడుకూ సంబంధించింది మాత్రమే కాదు. అది శరీరానికి సంబంధించింది అని అంట్నూరు పరిశోధకులు. ఎందుకంటే సాధారణ మనుషులతో పోలిస్తే, ఎముకల సాంద్రత (బోన్‌ మినరల్‌ డెన్సిటీ) దెబ్బతినే ఆస్టియోపొరోసిస్‌ సమస్య డిప్రెషన్‌ బాధితుల్లోనే ఎక్కువ. ఎముకలు దెబ్బతినడం అనేది స్ట్రెస్‌ హార్మోన్ల తీవ్రత ఉన్న వారిలోనే ఎక్కువగా ఉన్నట్లు వైద్య పరీక్షల్లో కనిపిస్తుంది. అలాగే ఈస్ట్రోజన్‌ నిలువలు, గ్రోత్‌ హార్మోన్‌ నిలువలు తగ్గడానికి, డిప్రెషన్‌కు సంబంధం ఉన్నట్లు కూడా పలు
అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. డిప్రెషన్‌ వలేల ఆస్టియోపొరోసిస్‌ వస్తుందని కాదు గానీ, ఆస్టియోపొరోసిస్‌ రావడానికి గల కారణాల్లో డిప్రెషనల్‌ కూడా ఉందనేది మాత్రం వాస్తవం. అందువల్ల డిప్రెషన్‌తో ఉన్న మహిళలు తమ ఎముకల దారుధ్యం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండడం చాలా అవసరం. కొన్ని నివారణా చర్యలు చేపట్టడం కూడా అంతే ముఖ్యం. ఇందులో భాగంగా రోజూ కాల్షియం మాత్రలు వేసుకోవడం, వాకింగ్‌, ఇతర వ్యాయామాలు చేయడం తప్పనిసరి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/