కాక నూనెలతో కేన్సర్‌!

oil

ప్రపంచ ఆరోగ్య సంస్థ దశాబ్దం క్రిందటే కాకనూనెల వాడకం మానవ మనుగడకు ఎంతటి ప్రమాదం తెచ్చిపెడుతుందో తేల్చిచెప్పటమే కాక, దీని వాడకాన్ని నిషేధించాలని సూచించింది. ఇపుడు స్వీడన్‌ దేశం ఈ అంశంపై మరిన్ని పరిశోధనలు కావించి కాకనూనెతో తయారుచేసిన వంటకాలను తినటం వల్ల కంటిచూపు మంద గించటం, నరముల బలహీనత, పక్షవాతం, కేన్సరు వంటి వ్యాధులు సంక్రమించి మనిషి నిర్వీర్యుడై జీవనకాలం తగ్గుతుందని సోదాహరణంగా నిరూపించింది. ఇపుడు మనరాష్ట్రంలో వీధి పక్క దుకాణాలలో మిరపబజ్జీలు, ఇతర తినుబండారాలు, కర్రీపాయింట్లు, ఫాస్ట్‌ఫుడ్‌ దుకాణాలలో నిత్యం వారు కాకనూనెలు వాడటం గమనిస్తూనే ఉన్నాం. కొనుక్కొని తింటూనే ఉన్నాం. నూనెధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో వ్యాపారి మిగిలిన నూనెను తిరిగి వాడతాడే గాని పారబోయడన్నది నిజం. కనుక ప్రజారోగ్యాన్ని కాపాడే దిశగా జంటనగరాల లోను జిల్లా, మండల కేంద్రాలలోను ఆరోగ్యశాఖ తనిఖీలు ముమ్మరం చేసి కాకనూనెను నిర్మూలించి నేరస్తులను కఠినంగా శిక్షించాలి. వినియోగదారులు కూడా అప్రమత్తంగా ఉంటే ఆరోగ్యానికి ముప్పు వాటిల్లకుండా చూసుకోవచ్చు.

తాజా నిఘా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/investigation/