క్యాబేజీ పకోడా

Cabbage pakoda

కావలసిన పదార్థాలు
మీడియం సైజులో ఉన్న క్యాబేజీని సన్నగా తురుముకోవాలి, ఎండుకొబ్బరి పౌడర్‌ అరకప్పు ఒక కందికప్పు ఒక టేబుల్‌ స్పూన్‌ పసుపు, ఒక టేబుల్‌ స్పూన్‌ కారంపొడి, ఒక స్పూన్‌ గరం మసాలా పౌడర్‌, ఉప్పు తగినంత, నూనె కావలసినంత

తయారు చేయు విధానం
కందిపప్పును కొద్దిగంటలపాటు నానబెట్టిన తరువాత మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి. తురిమిపెట్టుకున్న క్యాబేజిని, కొబ్బరిపౌడర్‌ను, కారం, ఉప్పు, మసాలా పొడి, కొత్తిమీర ఆకులు అన్ని బాగా కలిపి వీటికి రుబ్బి పెట్టుకున్న కందిపప్పును వేయాలి. ఈ మిశ్రమాన్ని గిన్నెలో ఉడికించాలి. ఉడికిన తరువాత మీకు నచ్చిన షేపులో వీటిన్‌ కట్‌ చేసుకుని నూనెలో వేయించుకోవాలి. కొబ్బరి పచ్చడితో దీనిని సర్వ్‌ చేస్తే బాగుంటుంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/