అందుకు… ఇద్దరూ బాధ్యులే..

... both are responsible ..
… both are responsible ..

ఇక లాభం లేదురా.. నాలుగేళ్లయింది. ఇప్పటికీ ఓ మంచి వార్తలేదు. ఇక రెండో పెళ్లి చేసుకోవాల్సిందే! ఇన్నేళ్లయినా పిల్లలు పుట్టలేదన్న బాధ ఒకవైపు..భర్త రెండోపెళ్లి చేసుకుంటాడేమోనన్న ఆందోళన మరోవైపు..ఇలా సంతానలేమితో బాధపడే అమ్మాయిలు ఇటీవలి కాలంలో ఎక్కువ అవ్ఞతున్నారు. ఆధునిక అలవాట్లు. కాలుష్య వాతావరణం సంతానలేమి సమస్యలకు దోహదపడుతున్నాయి.

కాని ఆధునిక వైద్యరంగం సంతానలేమికి కూడా పరిష్కారాలెన్నింటినో తీసుకువచ్చింది. అందుకే ఇక సంతానలేమి పెద్ద సమస్యకాబోదు.

లావణ్య పెళ్లై నాలుగేళ్లయింది. ఆమె మంచి వార్త చెబుతుందేమో అని అంతా ఎదురుచూస్తున్నారు. ఆమెకు కూడా తాను పండంటి బిడ్డకు తల్లినవ్వాలన్న తపనగా ఉంది. ఒకటి రెండుసార్లు ఆమె నెల తప్పినప్పటికీ అవి నిలవలేదు. కారణం తెలీలేదు. డాక్టర్లు ఆమెలో లోపమేదీ లేదని అన్నారు. లోపం అతనిలో ఉండొచ్చన్న అనుమానం ఎవరికీ రానే లేదసలు. గర్భం నిలవకపోవడానికి స్త్రీలో లో

పాలే కారణమని అనుకుంటారు అందరు కానీ పురుషులలో లోపం వల్ల కూడా గర్భం నిలవకపోవచ్చు. ఇది ఒక లావణ్య దంపతుల సమస్య మాత్రమే కాదు.దాదాపు 20 శాతం మంది దంపతుల ఇలా ఏదో ఒకరకమైన సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు. సంతానం కలగకపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి.వాటిలో ముఖ్యమైనవి పాలిసిస్టిక్‌ ఒవేరియన్‌ సిండ్రోమ్‌, ఎండోమెట్రియాసిస్‌, వీటికి తోడు పురుషుల్లో ఉండే లోపాలూ ఇందుకు కారణమవ్ఞతున్నాయి.

హార్మోన్‌ సమస్యల వల్ల అండాశయంలో చిన్న చిన్న తిత్తుల వంటివి ఏర్పడితే పాలీసిస్టిక్‌ ఒవేరియన్‌ సిండ్రోమ్‌ అంటారు. ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ క్రియాశీలకంగా ఉండదు. పురుష హార్మోన్లయిన ఆండ్రోజన్లు ఎక్కువగా ఉత్పత్తి అవ్ఞతాయి. అంతేకాక ఎల్‌హెచ్‌ ఉత్పత్తి కూడా ఎక్కువవ్ఞతుంది. ఇలా మొత్తం హార్మోన్ల వ్యవస్థ పనితీరు మీద దీని ప్రభావం ఉంటుంది. కాబట్టి అండం విడుదల కావడంలో సమస్యలు వస్తాయి. అందువల్ల గర్భధారణ జరగదు.

వాతావరణంలో పెరిగిన కాలుష్యం కూడా కారణంగా భావిస్తున్నారు. రక్తపరీక్షలు. దీనిని మందులతో సరిచేయవచ్చు కానీ పూర్తిగా చికిత్స చేయడం సాధ్యపడదు. ఈ సమస్య జీవిత పర్యంతం ఉంటుంది. దీనికి హార్మోన్‌ చికిత్స, జీవన శైలిలో మార్పులు చేసుకొని శరీర బరువ్ఞ అదుపులో ఉంచుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే అందం విడుదల కూడా క్రమబద్దీకరించబడుతుంది. అందువల్ల గర్భం రావడం సులభమవ్ఞతుంది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/