అధరాలు మెరిసే…ఇలా

Beautiful lips

అధరాలను రకరకాల రంగుల్లో మెరిపించడానికి అనేక రకాల లిప్‌స్టిక్‌లు లభిస్తున్నాయి. పెదాల సహజరంగుల్లోనే కాకుండా ఊదా, గ్రీన్‌లాంటి రంగుల్లోనూ, మెరుపుల్లోనూ ఈ లిప్‌స్టిక్‌లు లభిస్తున్నాయి.

అయితే లిప్‌స్టిక్‌లను కొనేముందు మంచి రంగుల ఎంపికలో తీసుకునే జాగ్రత్త కన్నా సరైన లిప్‌స్టిక్‌ ఎన్నుకోవడంలోనే ఎక్కువ జాగ్రత్త అవసరం.

ఎప్పటికప్పుడు మార్కెట్లో లభించే కొత్తరకం షేడ్‌లను ప్రయత్నించేవారు కొనేముందు తెల్లటి టిష్యూ పేపర్‌మీద లిప్‌స్టిక్‌ను రాసి పరీక్షించాలి.

కొన్ని రంగులు అనేక రకాల షేడ్స్‌ కలిగి ఉంటాయి. లిప్‌స్టిక్‌ మొత్తంగా ఒక రంగు కనిపిస్తే అది పెట్టుకున్న తర్వాత మరో రంగు కనిపిస్తుంది.

ఉదాహరణకు మీకు గులాబీరంగు లిప్‌స్టిక్‌ తీసుకుని ఇలా పరీక్షిస్తే ఎరుపురంగు షేడ్‌ వచ్చిందనుకోండి లిప్‌స్టిక్‌ చాలా గాఢత కలిగి, మందంగా ఉందని అర్థం.

అలాగే మీరు వేసే పొరలను బట్టి రకరకాల రంగుల్లో అది కనిపించవచ్చు. అందుకే సరైన రంగును, షేడ్‌ను ఎంచుకోవడానికి తప్పనిసరిగా టిష్యూపేపర్‌ టెస్టు చేయండి.

శరీర రంగుకు సూటయ్యే లిప్‌స్టిక్‌ రంగును ఎంచుకోండి. చర్మం, కళ్లు, జుట్టురంగు మొత్తంగా వేషధారణకు అనువుగా లిప్‌స్టిక్‌ రంగు ఉండాలి.

తాజా కెరీర్‌ సమాచారం కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/