మాంసకృత్తులు తగ్గితే రోగనిరోధక శక్తిపై ప్రభావం

Best Meals
Best Meals

మాంసకృత్తుల శరీర ధర్మాలను బట్టి అవి తక్కువ అయితే వచ్చే సమస్యలను సలభంగానే అర్థం చేసుకోవచ్చు. మన శరీరంలో మాంసకృత్తులు తగ్గితే యాంటీబాడీలు తగ్గుతాయి. కనుక రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. అందువలన సులభంగా రోగాల బారిన పడటం, రోగాలు విజృభించటం జరుగు తుంది. రక్తక్షీణత, బరువు తగ్గటం, కొంచెం శ్రమ చేసినా అలసి పోవటం, లివర్‌ సరిగా పనిచేయకపోవటం, అందు వలన కామెర్ల వ్యాధి రావటం తదితర సమస్యలు తలెత్తు తాయి. అదే సమయంలో మన శరీరంలో మాంసకృత్తులు ఎక్కువైతే తెలివి తేటలు తగ్గుతాయి. బుద్ధి మందగిస్తుంది. అందువలన మాంసకృత్తులు పుష్కలంగా ఉండే పప్పుపదార్థా లను మరీ ఎక్కువగా తీసుకోకుండా జాగ్రత్తగా ఉండటం ఎంతో అవసరం. ఫలహారాలలో ఎక్కువగా వాడే మినప పప్పు విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తెలివితేటలను మందగింపజేసే పప్పుపదార్థాలలో మినుములు ప్రథమస్థానంలో ఉంటాయి. మాంసకృత్తులు తయారు కావాలంటే 18 నుండి 20 రకాల అమినో ఆసిడ్లు కావాలి. వీటి కలయిక, మిశ్రమం వలననే మాంసకృత్తులు తయారవుతాయి. వీటికి మూలాధారములు అంగారము అనగా బొగ్గు (కార్బన్‌), నత్రజని (నైట్రోజన్‌), ఉదజని లేక జలవాయువు (హైడ్రోజన్‌), ప్రాణవాయువు (ఆక్సిజన్‌), గంధకము (సల్ఫర్‌), ఇనుము (ఐరన్‌), భాస్వరము (పాస్పరస్‌), అయితే ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకొనవలసినది ఏమిటంటే అన్ని అమినో ఆసిడ్లను మన శరీరం తయారుచేసుకోలేదు. కొన్ని రకాల అమినో ఆసిడ్లను మాత్రమే (సుమారు 11 రకాలు) శరీరం తయారుచేసుకుంటుంది. వాటితో కొన్ని రకాల మాంసకృత్తులను తయారుచేసుకుంటుంది. మిగిలిన తొమ్మిది అమినో ఆసిడ్లను మనం తీసుకునే ఆహార పదార్థాలనుండి శరీరం గ్రహించి మాంసకృత్తులను తయారుచేసుకుంటుంది. (ఆ తొమ్మిదీ అత్యంత అమూల్యమైన, ప్రధానమైన అమినో ఆసిడ్లని వైద్య శాస్త్రం గుర్తించింది). ఉదాహరణకు మెదడును చైతన్య పరచే అమినో ఆసిడ్లు మనం తీసుకునే ఆహారంలోని మాంసకృత్తుల ద్వారానే మనకు లభిస్తాయి. దీనిని బట్టి మనకు అర్థం అయ్యేది ఏమిటంటే మన శరీరానికి అవసరమైనన్ని మాంసకృత్తులు కావాలంటే మనం తప్పనిసరిగా మాంసకృత్తులు పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. అందువలన ఇప్పుడు తెలుసుకోవలసింది ఏమిటంటే ఎటువంటి ఆహార పదార్థాలలో మాంసకృత్తులు పుష్కలంగా ఉన్నాయి అనేది. శాకాహార లేక వృక్ష సంబంధమైనవి. – జంతు సంబంధమైనవి. చిక్కుడు, బఠాని, సోయాచిక్కుడు, వేరు శనగ, శనగలు, కందులు, మినుములు, పెసలు మొదలైన పప్పుధాన్యా లలోను, బంగాళ దుంపలోను, నువ్వులు, బాదం, జీడిపప్పు మొదలైన గింజలలోను మాంసకృత్తులు పుష్కలంగా ఉంటాయి. ఇవి అన్నీ వృక్ష సంబంధమైనవి. చేపలు, మాంసము, కోళ్ళు, గ్రుడ్లు, పాలు, వెన్న మొదలైన జంతు సంబంధమైన వాటిలో కూడా మాంసకృత్తులు పుష్కలంగా ఉంటాయి.