పరుగుతో ప్రయోజనాలు

Running

ఆఫీసుల్లో గంటల తరబడి కూర్చుని పనిచేస్తుంటాం. పనిలో పడితే అదే పనిగా కూర్చుని నడకకు దూరమవుతాం. ఫలితంగా అనేక అనారోగ్యాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఆరోగ్యంగా ఉండాలంటే మన దినచర్యలో పరుగుకు గంట కేటాయిస్తే మంచిది. ఉదయాన్నే సూర్యుడి కిరణాలు పడి విటమిన్‌ డి అందడమే కాదు అందం. ఆనందం మన సొంతమవుతాయి. ఇక పరుగు ద్వారా వచ్చే లాభాలు ఎన్నో. నిద్రలేమితో బాధపడేవారికి పరుగు మంచి చిట్కాగా ఉపయోగపడుతుంది. దీంతో నిద్ర బాగా పడుతుంది. ఇది మరింత ఉత్సాహానిస్తుంది. పరుగెత్తడం వల్ల మానసిక ఉల్లాసం చేకూరుతుంది. ఒత్తిడి దూరమవుతుంది. ఆనందాన్ని కలిగించే ఎండార్ఫిన్లు విడుదలై ఉత్సాహం ఇనుమడిస్తుంది. పరుగుతో వయసుకు కళ్లెం పడుతుంది. వృద్ధాప్యం త్వరగా దరిచేరదు. రక్త సరఫరా మెరుగుపడుతుంది. చర్మం కొత్తకాంతితో నిగనిగలాడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మాటిమాటికి జబ్బుల బారిన పడడం తగ్గుతుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/