కానుక

కానుక

LIPS
Beauty Tips

తేనె చర్మానికి మృదుత్వాన్ని, మెరుపుని ఇస్తుంది. ముడతలను తగ్గిస్తుంది. కాబట్టి ఏ ప్యాక్‌లో నయినా మూడునాలుగు చుక్కలు తేనె కలుపుకోవచ్చు. ల పెదవ్ఞల తడి ఆరిపోయి నప్పుడు పెదవ్ఞలను తడిపితే అది తాత్కాలికంగానే పనిచేస్తుంది.

లిప్‌బామ్‌గాని బోరోలిన్‌ గాని రాస్తే మంచిది. ల చీరలకు గంజి పెట్టేటపుడు రెండు చుక్కలు సెంట్‌ గంజిలో కలపండి. చీర ఆరవేసిన తర్వాత మంచి వాసన వస్తుంది.

ఫ్యాంట్లు, షర్టులు పొడుగుచేయటానికి కుట్లువిప్పుతారు. ముడతలు పోవాలంటే వెనిగర్‌రాసి ఆరపెట్టండి. ఆరిన తర్వాత ఇస్త్రీచేస్తే మడతలు కనిపించవు.

మిక్సీలో ఎండుద్రాక్ష వేసేటపుడు కొద్దిగా నిమ్మరసం కలిపితే ద్రాక్షలు బ్లేడ్‌కు అంటు కోకుండా ఉంటాయి.

కొత్తిమీర పొడికి కొద్దిగా ఉప్పు, నిల్వ ఉంచితే ఎక్కువకాలం తాజాగా ఉంటుంది.
ఆమ్లెట్‌ లావుగా రావాలంటే సొన గిలకొట్టాక కొద్దిగా నీరు కలపాలి.

పట్టుజాకెట్‌ను షాంపూతో ఉతికితే ఎప్పటికీ మెరుపుపోదు. ల బంగారు గొలుసు ముడిపడితే ముడిపై టాల్కమ్‌పౌడర్‌ చల్లండి. ముడి త్వరగా, తేలికగా వచ్చేస్తుంది.

అన్నం మెత్తబడినపుడు క్యారెట్‌కోరువేస్తే పొడిగా ఉంటుంది.