ప్రేమంటే నీకు తెలుసా?

Beautiful Lovely Couple
Beautiful Lovely Couple

ప్రేమ కోసం జీవితాలను త్యాగం చేసిన వారున్నారు. అదే ప్రేమ కోసం ప్రాణాలను తీస్తున్న సంఘటనలు జరుగుతున్నాయి. నాకు తెలిసినంత వరకు ప్రేమ ఎప్పుడూ ఎవరికీ హాని చేయదు సుమా!. ప్రేమ ఎప్పుడూ ఎదుటివారి క్షేమాన్నే కోరుకుంటుంది తప్ప నాశనం చేయాలని కోరుకోదు. ప్రేమ గొప్పతనం త్యాగంలో కనిపిస్తుంది. దూరమైనకొద్దీ ప్రేమ పెరుగుతుంది అంటారు. ఇదెంత నిజమో తెలియదు కానీ, నీతో ఎంత సమీపంగా ఉంటే అంతగా ప్రేమ పెరుగుతుందని నాకు అనిపిస్తుంది. గడ్డిపరకపై మంచు ముత్యంలా మెరిస్తున్న వేళలో వేకువజామున నిద్రలేచి, ఆ ముత్యాలను ఏరుకుని, నీకోసం అందమైన మానల్ని అల్లి, నీరాక కోసం దారిపొడుగునా పరచాలని తపిస్తున్నాను. అంతేకాదు సుమా! ఆ దారిలో ముళ్లు లేకుండా ఉండేందుకు ప్రతిగడ్డిపరకపై
దీపాలను వెలిగించాను.

ప్రియనేస్తం! నిన్ను చూడాలని, నీతో గడపాలని మనసు కోరుకుంటున్నది. కొన్నివందల మైళ్ల దూరంలో నువ్ఞ్వ ఉన్నా నాకు మాత్రం అతిసమీపంలోనే ఉన్నావ్ఞ. గాలికూడా దూరనంత దగ్గరగా ఉన్నావ్ఞ. వెన్నెల అధికంగా విరబూసిన రోజున నిన్ను అధికంగా గుర్తుకు చేసుకుంటానని జ్ఞాపకం ఉంచుకో. ప్రేమ..ప్రేమ..రెండక్షరాల ప్రేమను వర్ణించేందుకు అనాధికాలం నుంచి రచయితలు, కవ్ఞలు, మేధావ్ఞలు, పండితులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ప్రేమ మరణమంత బలమైంది. ప్రేమ కోసం జీవితాలను త్యాగం చేసిన వారున్నారు. అదే ప్రేమ కోసం ప్రాణాలను తీస్తున్న సంఘటనలు జరుగుతున్నాయి. నాకు తెలిసినంత వరకు ప్రేమ ఎప్పుడూ ఎవరికీ హాని చేయదు సుమా!. ప్రేమ ఎప్పుడూ ఎదుటివారి క్షేమాన్నే కోరుకుంటుంది తప్ప నాశనం చేయాలని కోరుకోదు. ప్రేమ గొప్పతనం త్యాగంలో కనిపిస్తుంది. దూరమైనకొద్దీ ప్రేమ పెరుగుతుంది అంటారు. ఇదెంత నిజమో తెలియదు కానీ, నీతో ఎంత సమీపంగా ఉంటే అంతగా ప్రేమ పెరుగుతుందని నాకు అనిపిస్తుంది.

గడ్డిపరకపై మంచు ముత్యంలా మెరిస్తున్న వేళలో వేకువజామున నిద్రలేచి, ఆ ముత్యాలను ఏరుకుని, నీకోసం అందమైన మానల్ని అల్లి, నీరాక కోసం దారిపొడుగునా పరచాలని తపిస్తున్నాను. అంతేకాదు సుమా! ఆ దారిలో ముళ్లు లేకుండా ఉండేందుకు ప్రతిగడ్డిపరకపై దీపాలను వెలిగించాను. నీకుముందుగా
ఆ మార్గంలో నేను నడచి, ముళ్లులేని బాటను సిద్ధం చేస్తున్నాను. కంటిపాపపై కునుకులేకుండా, కాటుకలేని కనులతో నిరీక్షిస్తున్నాను. ప్రేమ కోసం ఏదైనా చేస్తాను. ప్రేమ వందేళ్లు నిలబడేందుకు ఇతరులకు ఆదర్శంగా నిలిచేలా నా ప్రేమ కావాలి. ప్రేమ ఎప్పటికీ ఆదర్శంగా నిలుస్తుంది. ప్రేమ కులం, ప్రాంతం, సరిహద్దులకు అతీతంగా ఉప్పొంగిపోతుంది. ప్రేమంటే ఆన్‌లైన్‌లో రెండులైకులు, రెండు డైలాగులతో ప్రారంభమయ్యేది కాదు. ప్రేమంటే ఆకట్టుకునే ఫిగర్‌ను చూసి, మనసు పాడేసుకునేది అంతకన్నా కాదు.ఆన్‌లైన్‌లో ప్రేమించి, దేన్నో ఆశించి, మోసం చేయడం కాదు ప్రేమంటే. అభిరుచులు, అభిప్రాయాలు, భావాలు, అలవాట్లు ఏవీ కలవకపోయినా ప్రేమతో వాటన్నింటితో ఏకీభవించడమే నిజమైన ప్రేమ.

మరి నేటి ప్రేమలు ఎలాగున్నాయి?
ప్రేమ పేరుతో డేటింగ్‌లో మునిగిపోవడం కాదు. ప్రేమ పేరుతో కోరికల్ని తీర్చుకోవడం కాదు. ప్రేమ పేరుతో మోసం చేయడం కాదు. ఆ ప్రేమ ఫలించకపోతే హతమార్చడం కాదు. నాకు దక్కని ప్రేమ ఇంకెవరికీ దక్కకూడదనే సంకుచితమైన, ఇరుకైన భావన కాదు. ప్రేమించడం ఎంత సహజమో తిరస్కరించడం కూడా అంతే సహజమని గ్రహించినప్పుడు నిశ్శబ్దంగా, మౌనంగా కొత్తజీవితాన్ని అన్వేషించుకోవడమే నిజమైన ప్రేమ. ప్రేమ గొప్పదే కానీ జీవితం మరింత గొప్పది. జీవితం గొప్పగా ఉండాలంటే ఆ ప్రేమ కూడా స్వచ్ఛంగా ఉండాలి. స్వేచ్ఛగా ఉండాలి. పవిత్రంగా ఉండాలి. ప్రేమంటే గంటలకొద్దీ చాటింగ్‌ చేసుకోవడం కాదు.

సినిమాలు, షికార్లు తిరిగి, కెరీర్‌ను పాడు చేసుకోవడం కాదు. ప్రేమ బాధ్యతతో కూడినది.అది టైమ్‌పాస్‌ కోసమో, సరదాకోసమో, నలుగురిలో గొప్పగా ఉండాలని ప్రేమించే ప్రేమ ప్రేమనే కాదు. ప్రేమకు వయసు అడ్డుకాదు. ప్రేమకు అంతస్తు లేదు. చదువ్ఞ, కులం, డబ్బు, రూపం ఇవేవీ ప్రేమకు అర్హత డిగ్రీలు కావ్ఞ. ప్రేమించడం ఎవరికైనా సులభమే. కానీ దాన్ని నిలుపుకోవడం మాత్రం చాలా కష్టం. అందుకు ఒక జీవితకాలం పడుతుంది. నలుగురిని ప్రేమించి, ఒకర్ని పెళ్లి చేసుకోవడం కాదు.

ప్రేమ ఎప్పుడూ ఒక్కరికే చోటు ఇస్తుంది. కలలో కూడా హాని తలపెట్టని ప్రేమను పండించుకునేందుకు పవిత్రమైన పోరాటం చేసినప్పుడే ఆ ప్రేమ అందరికీ ఆదర్శం అవ్ఞతుంది. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని, పరువ్ఞ తీసిందని, హత్య చేయించే తల్లిదండ్రులున్న సమాజం మనది.
తమను కాదని కులం తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకుందని కూతురని కూడా చూడకుండా చంపేస్తున్న నవసమాజంలో మనం ఉన్నాం. తన ప్రేమను నిరాకరించిందని నడిరోడ్డుపై కత్తితో పొడిచి, చంపేస్తున్న ప్రేమోన్మాదులకు కొరత లేదు. సమాజం ఆరోగ్యవంతంగా వర్ధిల్లుతుంది.
నీకోసం తపిస్తున్న నాకు నువ్వ త్వరగా వస్తావని, మన ప్రేమ గురించి పెద్దలతో మాట్లాడి, పెళ్లిబంధంతో ఒక్కటైపోదామని వేచిచూస్తున్నాను. మరి ఎప్పుడొస్తున్నావ్ఞ? నీరాకకోసం నిద్రలేని కనులతో, అలసట ఎరుగని మనసుతో వేచిచూస్తున్నాను. నీ ప్రియసఖి..