అక్వేరియం నిర్వహణ ఇలా..

ఇంట్లో అలంకరణ

Aquarium Management
Aquarium Management

అక్వేరియంలోని చేపలను చూస్తుంటే మనసుకు ప్రశాంతత కలుగుతుంది. ఇంట్లో పెద్ద పెద్ద ఆక్వేరియంలే పెట్టుకోవాలని ఏమీ లేదు.

చిన్న ఫిష్‌ బౌల్‌లో కూడా రెండు చేపలను పెంచుకోవచ్చు. సాధారణంగా గోల్డ్‌ఫిష్‌ అయితే భలేగా ఆకట్టుకుంటాయి.

వీటి సంరక్షణలో విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో బాగా గాలి, వెలుతురు వచ్చే చోట ఫిష్‌ బౌల్‌ లేదా అక్వేరియం ఏర్పాటు చేసుకోవాలి.

టివి, ఫ్రిజ్‌ మీద కాకుండా హాల్లో ఒక టేబుల్‌ లేదా స్టాండ్‌ను పెట్టి దానిపై ఉంచాలి.

బౌల్‌ అయితే రెండు ఫిష్‌లకు మించి వేయకూడదు. అక్వేరియం సైజ్‌ని బట్టి ఫిష్‌లను ఎన్ని వేయాలో చూసుకోవాలి. చాలా మంది ఇళ్లలో పెట్టుకునే అక్వేరియంలో గోల్డ్‌ఫిష్‌లను వేస్తారు. ఇవి చూసేందుకు ఆకర్షణీయంగా ఉంటాయి.

ఇంటి అందాన్ని మరింత పెంచుతాయి. వివిధ రకాల చేపలను ఒకే చోట చేర్చడం వల్ల ఎక్కువ కాలం ఉండలేవు. అక్వేరియంలో పంపునీళ్లు కాకుండా, బోర్‌ నీళ్లు వాడాలి.

లేదంటే పంపునీటిని మూడు రోజుల పాటు నిలువ చేసి వాడాలి.

అలా చేయడం వల్ల క్లోరైడ్‌ ప్రభావం తగ్గుతుంది. లేదంటే చేపలు చనిపోతాయి. ఫిష్‌బౌల్‌ అయితే మూడు రోజులకు, ఒకసారి, అక్వేరియం అయితే వారం రోజులకు ఒకసారి నీటిని మార్చి శుభ్రం చేయాల్సి ఉంటుంది.

ఫిష్‌ట్యాంక్‌ శుభ్రం చేసేటపుడు చేపలను వల సహాయంతో మరొక నీటి తొట్టిలోకి మార్చుకోవాలి. వీటికి ఆహారం రోజుకు ఒకసారి మాత్రమే వేయాలి.

చేపల సంఖ్యను బట్టి వేయాలి. అక్వేరియం పెద్దయితే వాటిని అనువైన మొక్కలను కూడా పెంచుకోవచ్చు.

అక్వేరియంలో అందానికి వాడే లైట్‌, రాళ్లు, ప్లాస్టిక్‌ మొక్కలు, బొమ్మలు.. వంటి వాటి విషయంలో జాగ్రత్తలు అవసరం.

అక్వేరియం సైజ్‌కు సరిపడా ఎయిర్‌ పంప్‌ను ఏర్పాటు చేయాలి. చేపల పెంపకం గురించిన జాగ్రత్తలు పిల్లలకు వివరించడంతో పాటు ఇతర పెంపుడు జంతువులకు అక్వేరియం అందకుండా జాగ్రత్త పడాలి.

బంధువులకు వేరు వేరు సందర్భాలలో బహుమతిగా పెట్‌ ఫిష్‌లను, అక్వేరియంను ఇవ్వవచ్చు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/