స్త్రీ వ్యధలే అక్షర శిల్పాలు

Amrita Preetam
Amrita Preetam

ఇటు భారత్‌లో, అటు పాక్‌లోనూ స్త్రీలపై జరిగిన అత్యాచారాలు, అకృత్యాలు అన్నీఇన్నీ కావ్ఞ. భారతదేశ చరిత్రలో వీటికి సంబంధించిన సమాచారం పెద్దగా వ్ఞండదు. కానీ సాహిత్యంలో మాత్రం స్త్రీలు పడ్డకష్టాలు పవిరంగా చర్చించబడ్డాయి. మంజూకపూర్‌ రాసిన ‘డిఫికల్ట్‌ డాటర్స్‌, బపి సిధ్వా రాసిన ‘క్రాకింగ్‌ఇండియా, జ్యోతిర్మయి రాసిన ‘దరివర్‌ చర్నింగ్‌ సవలలు దేశవిభజన సమయంలో స్త్రీలు అనుభవించిన నరకాన్ని ఆవిష్కరిస్తాయి.

మనదేశంలో ప్రాచీన కాలం నుంచి మహిళా రచయితలు ఉన్నారు. సమాజంలో జరిగే అన్యాయాలను, సాంఘిక దురాచారాలను తమ రచనల ద్వారా ఎప్పటికప్పుడు సమాజానికి చేరవేసేవారు. ఇలాంటి వారిలో అమృతాప్రీతమ్‌ ఒకరు. ఈమె ప్రాచీన కాలానికి చెందిన వనిత కాదు. 19వ శతాబ్దానికి చెందిన రచయిత్రి. భారతీయ సాహిత్యంలో అమృతా ప్రీతమ్‌కు సమున్నత స్థానం ఉన్నది. స్త్రీ సాహిత్యానికి, సాహితీ సంస్కృతికి ఆమె చేసిన అవిరామ కృషి ఒక సుదీర్ఘ పోరాటం. పురుషాధిక్య సమాజంలో స్త్రీ మనుగడే ప్రశ్నార్ధాకమనుకుంటే బుసలుకొట్టే పురుషాహంకారాన్ని సవాలు చేయడమంటే నిజంగా సాహిసమే. స్వాతంత్య్రం రాకమునుపు అవిభక్త భారతదేశంలోని గుజ్రన్‌ వాలాలో ఆగస్టు 31న 1919వ సంవత్సరంలో జన్మించారు. ప్రీతమ్‌ సాధించిన విజయాలెన్నో ఎదుర్కొన్న ఒడిదుడుకులు అంతకు రెట్టింపు. అయినా అవేవీ ఆమె దృఢచిత్తాన్ని కదిలించలేకపోయాయి. తన జీవితాన్ని తన ఇష్టానుసారంగా, ఎక్కడా రాజీపడకుండా జీవించిన ధీరశాలి ఆమె.
నిజాన్ని నిర్భయంగా చెప్పడమే ఆమెకు తెలుసు..
నిజాన్ని నిర్భయంగా చెప్పడం ప్రీతమ్‌ ప్రత్యేకత. తనకు కవిసాహిర్‌ అంటే వ్ఞన్న ప్రేమను ఆమె ఎన్నడూ దాచుకోలేదు. దేశం భగ్గుమన్న క్షణం ఆమెను, ఆమె ఆరాధించిన వ్యక్తి నుండి విడదీసింది. అయినా ఆమెకు అతడిపట్ల ప్రేమ సజీవంగా మిగిలిపోయింది. ఆమె ప్రారంభించిన సాహిత్య పత్రిక ‘నాగమణి ఎంతోమంది వర్ధమాన కవ్ఞలను, రచయితలను ప్రపంచానికి పరిచయం చేసింది. ఆమె నివాసంలో నిత్యం చర్చలు, గోష్టలు కొనసాగుతుండేవి. ఆమె సుదీర్ఘ ప్రస్థానం ఆమె పన్నెండవ ఏట ప్రారంభమయింది. పదహారో ఏడు వచ్చేసరికి గుర్తింపు లభించింది.
జ్ఞానపీఠ్‌ అవార్డు
పంజాబీ సాహిత్యంలో ధృవతారగా వెలగడం మొదలైంది. ‘సునేరే (సందేశం) రచనకు 1956లో సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. ‘కాగజ్‌ కి కాన్వాస్‌ అనే కావ్యానికి జ్ఞానపీఠ్‌ అవార్డు వచ్చింది. ఢిల్లీ, జబల్‌పూర్‌, విశ్వభారతి విశ్వవిద్యాలయాలు ఆమెను గౌరవ డాక్టరేట్‌లు ప్రధానం చేసి సత్కరించాయి. కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, పద్మవిభూషణ్‌ అవార్డులతో గౌరవించింది.


విభజనతో ఏకాకిలా..
1947లో జరిగిన దేశవిభజన ఆమె జీవితంలో అతిపెద్ద విషాదం. తనకున్న సర్వస్యం వదిలేసి అనాధలా కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆమె సృజించిన కవిత్వం ఎన్నో హృద్యాలను కదిలించింది. దేశం రెండు ముక్కలయితే ఆమె మనసు అనేక ముక్కలయింది. అందుకే ఆమె కవిత్వంలో అన్నీ పోగొట్టుక్ను వృధార్తుల ఆవేదన, మాతృభూమి నుండి దూరమైనందుకు శరణార్దులు అనుభవించేబాధ, అటూఇటూ కాని త్రిశంకు స్వర్గం లాంటి కల్లోల పరిస్థితి కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి. దేశ విభజన కేవలం ఒక రాజకీయ ఘటన కాదు. ఎన్నో జీవితాలను కూకటి వేళ్లతో సహా పెకలించిన ఒక సాంఘిక భూకంపం. కుటుంబాలు చీలిపోయాయి. కన్నీరు వరదలా పొంగి ఎంతోమందిని ముంచేసింది. ఆ సమయంలో అందరికన్నా ఎక్కువ క్షోభననుభవించింది ఆమె.


స్త్రీలపై అకృత్యాలు ఎన్నో..
ఇటు భారత్‌లో, అటు పాక్‌లోనూ స్త్రీలపై జరిగిన అత్యాచారాలు, అకృత్యాలు అన్నీఇన్నీ కావ్ఞ. భారతదేశ చరిత్రలో వీటికి సంబంధించిన సమాచారం పెద్దగా వ్ఞండదు. కానీ సాహిత్యంలో మాత్రం స్త్రీలు పడ్డకష్టాలు పవిరంగా చర్చించబడ్డాయి. మంజూకపూర్‌ రాసిన ‘డిఫికల్ట్‌ డాటర్స్‌, బపి సిధ్వా రాసిన ‘క్రాకింగ్‌ఇండియా, జ్యోతిర్మయి రాసిన ‘దరివర్‌ చర్నింగ్‌ సవలలు దేశవిభజన సమయంలో స్త్రీలు అనుభవించిన నరకాన్ని ఆవిష్కరిస్తాయి. బ్రిటిష్‌ వలసవాదం పురుషులను నిస్సహాయస్థితిలోని నెట్టితే స్త్రీల పరిస్థితిని ఇంకా దిగజార్చింది. స్త్రీ ఇంటా బయటా కూడా అవమానాలు ఎదుర్కోవలసి వచ్చింది. మగవాడి నిస్సహాయస్థితి లోంచి పుట్టే ఆగ్రహానికి బలి అయింది స్త్రీ. కుష్వంత్‌సింగ్‌, భీష్మసహానీ, బాలచంద్ర రాజన్‌, చమన్‌ నహాల్‌ వంటి ప్రముఖ నవలాకారులు దేశవిభజననాటి సామాజిక పరిస్థితులను ప్రతిబింబించే రచనలు చేసినా స్త్రీ అంతరంగాన్ని అంచనా వేయడంలో మాత్రం విఫలమయ్యారు.


జీవింపచేసిన రచనలు
అమృతాప్రీతమ్‌ రాసిన కవితలు, కధలు, నవలలు గతాన్ని మళ్లీ జీవింపచేస్తాయి. పాఠకుణ్ణి తీవ్ర అంతర్మధనానికి గురిచేస్తాయి. అలాంటి నవలే ‘పింజరా. ఇది కుష్వంత్‌సింగ్‌ నుంచే అనువధించబడి ఇంగ్లీష్‌లో ‘దస్కెలిటర్‌గా వచ్చింది. పారో ఒక అమాయకురాలైన పల్లెటూరి అమ్మాయి. ఒక అబ్బాయిని ఇష్టపడుతుంది. అతడు కూడా ఆ అమ్మయిని పెళ్లి సుకోవడానికి సిద్ధపడతాడు. సరిగ్గా అదే సమయంలో మతఘర్షణలు ప్రారంభమవ్ఞతాయి. హిందువ్ఞ అయిన పారోను ఎత్తుకుపోతాడు రషీదా అని మహమ్మదీయుడు. పారో ఎంత ప్రతిఘటించినా ఫలితం వ్ఞండదు. ఆ అమ్మాయిని తన ఇష్టానికి వ్యతిరేకంగా మతం మార్చి పెళ్లి చేసుకుంటాడు. ఆ క్షణం నుంచి జీవచ్చవ´ంలా బతుకుతుంది పారో. నిజానికి రషీదా ఆమెను ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. కానీ తనవాళ్లను, తను పోగొట్టుకున్న ప్రేమను మరచిపోలేక రషీదాతో సంసారం చేయలేక నలిగిపోతుంది పారో. అనుక్షణం ఆమెకు తన ప్రియుడు, తనవాళ్లు గుర్తుకువస్తారు. పారో పడే మానసిక వ్యధ, సంఘర్షణ ఎంతో హృద్యంగా చిత్రీకరించబడ్డాయి. ఆమె ప్రేమను పొందాలని ఆరాటపడే భర్త రషీదా ఆమెను కంటికి రెప్పలా చూసుకున్నా పారో మనసులోని అశాంతి సమసిపోదు. ఇంతలో ఆమె తల్లి అవ్ఞతుంది. ఒక బిడ్డ పుట్టిన తర్వాత పారో క్రమేపీ మారుతుంది. రషీదాపట్ల ఆమెకు అనురాగం జనిస్తుంది. అదే సమయంలో ఆమెకు సరిహద్దు దాటి భారతదేశంలోకి వెళ్లే అవకాశం వచ్చినా కాదనుకుని రషీదాతోనే జీవితం కొనసాగించాలని నిశ్చయించుకోవడంతో నవల ముగుస్తుంది.


ఆణిముత్యపు రచన
అమృతాప్రీతమ్‌ రాసిన కధలలో ఆణిముత్యమనదగ్గ కధ ‘స్టెంచ్‌ ఆఫ్‌ కిరోసిన్‌. ఇందులో స్త్రీ పట్ల సాటి స్త్రీలోకం వ్యవహరించే తీరును ప్రీతమ్‌ గర్హిస్తుంది. గులరి ఒక ధనవంతుని బిడ్డ. కన్యాశుల్కం గురించి ఆలోచించకుండా వారిద్దరి వివాహం జరిపిస్తాడు గులేరి తండ్రి. అల్లుడి పేరు మానెక్‌. అయితే మానెక్‌ తల్లి పరమ కిరాతకురాలు. స్త్రీకి స్త్రీయే శత్రువ్ఞ అన్న నానుడికి ఆమె నిలువెత్తు నిదర్శనం. వివాహమై ఏడు సంవత్సరాలు గడిచినా గులేరికి సంతానం కలగకపోయేసరికి ఆమె తన కొడుకుకు మరో వివాహం చేయాలని నిశ్చయించుకుంటుంది. అయితే తన మనసులో ఉన్న ఆలోచనను తన కోడలికి తెలియనివ్వకుండా జాగ్రత్తపడుతుంది. కానీ తన తల్లి పధకం మానెక్‌ పసికట్టినా నోరు తెరచి భార్యకు నిజం చెప్పడు. వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న అమృత బాల్యవివాహ బాధితురాలు అంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆమెకు పదహారేళ్లకే వివాహం జరిగింది. ప్రీతమ్‌ భర్త ఒక వ్యాపారవేత్త. అతడి దృక్పధానికి, ఆమె అభిరుచికి మధ్య పొంతన లేకపోవడంతో వారి వివాహబంధం మూణాళ్ల ముచ్చటే అయింది. విడాకులు తీసుకున్నప్పటికీ తన భర్త ఆఖరి రోజుల్లో అతడిని కంటికి రెప్పలా చూసుకున్న మనసున్న మనిషి అమృత.