ఆలూ పాలక్‌ కూర

ALLU CURRY
ALLU CURRY

ఆలూ పాలక్‌ కూర

కావలసినవి

100 గ్రా., పాలకూర (తరగాలి) 1 ఉల్లిగడ్డ (తరగాలి) 6 ఉడికించి పొట్టుతీసి చిన్న ఆలుగడ్డలు 1 చెంచా అల్లం, వెల్లుల్లి పేస్టు 3 పచ్చిమిరపకాయలు 1 చెంచా పచ్చి ధనియాల పొడి ఉప్పు తగినంత 2 గరిటెడు నూనె

తయారు చేసే విధానం:

గిన్నెలో ఒక గరిటెడు నూనె వేసి వేడిచేసి ఉల్లిముక్కలు, పచ్చిమిరపకాయముక్కలు వేసి వేయించాలి. ఆ తరు వాత అల్లం, వెల్లుల్లి పేస్టు వేసి మరో రెండు నిమి షాలు వేయించి పాలకూర కూడా వేసి మూతపెట్టి ఉడికించాలి. ఐదు నిమిషాలు ఉడికిన తరువాత ధనియాల పొడి, ఉప్పు చేర్చి రెండు నిమిషాలు ఉంచి స్టౌమీద నుంచి దించాలి. చల్లారిన తరువాత మిక్సీలో వేసి గ్రైండ్‌ చెయ్యాలి. దీన్ని తిరిగి గిన్నెలోకి తీసుకుని చివరిగా ఉడికించిన ఆలుగడ్డలు పాలకూర గ్రేవీలో వేసి స్టౌమీద రెండు నిమిషాలు ఉడికించి వేడి వేడిగా అన్నంలోకి వడ్డించండి.