స్విచ్ఛాఫ్‌ మోడ్‌లో ఉంచాలి

TV
TV

స్విచ్ఛాఫ్‌ మోడ్‌లో ఉంచాలి

మనం పడుకునే గదిలో టీవీలు మాత్రమే కాదు. విద్యు దయస్కాంత తరంగాలని, పెద్దమొత్తంలో ఎలక్ట్రాన్‌లని విడుదల చేసే అటువంటి ఏ ఇతర పరికరాలూ ఉండకూడ దని శాస్త్రజ్ఞులు స్పష్టం చేస్తున్నారు. మనం నిద్రించే గదిలో టీవీలు, సెల్‌ఫోన్‌లు, డీవిడి ప్లేయర్లు, కంప్యూటర్లు, ఫ్రిజ్‌లు వంటివి ఉండటం వలన వాటి నుంచి విడుదలయ్యే తరంగాలు, వాయువ్ఞలు మనల్ని చక్కటి నిద్రకు దూరం చేస్తాయని వివిధ పరిశోధనల్లో కనుగొన్నారు. అందువల్ల మనం నిద్రించే గదిలో ఇలాంటి పరికరాలు ఏమీ ఉండకూడదు.

ఒకవేళ తప్పరిసరై ఉండవలసి వస్తే అవన్నీ రాత్రిపూట తప్పనిసరిగా స్విచ్ఛాఫ్‌ మోడ్‌లో ఉంచాలి. అంతేకాక మనకు దూరంగా ఉండేలా చేసుకోవాలి. ముఖ్యంగా పడుకొనే గదిలో టీవి ఉండటం అనేది మన నిద్ర మీద, ఆరోగ్యం మీద బాగా ప్రభావాన్ని చూపిస్తుం దని అమెరికాకు చెందిన ఒక శాస్త్రజ్ఞులబృందం కనుగొంది. ‘యూనివర్శిటీ ఆఫ్‌ మిన్నిసోటా స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌కు చెందిన ఈ శాస్త్రజ్ఞులు 15 నుంచి 18ఏళ్ల వయ స్సున్న 781మంది టీనేజీ పిల్లలపై పరిశోధనలు చేసి, టీవి చూడ్డానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలను కనుగొన్నారు.

బెడ్‌రూపంలో టీవి ఉండేవారు మిగతా వారి కన్నా ఎక్కువగంటలు టీవిని చూడటంలో గడుపుతున్నారు. వీరు సగటున రోజుకి ఐదుగంటల పాటు టీవిని చూస్తున్నారు. ఇది వారి శారీరక, మానసిక ఆరోగ్యం మీద బాగా ప్రభావాన్ని చూపిస్తోంది. టీవిని ఎక్కువగా చేసేవారు మిగతా వారికన్నా కూరలు తక్కువగా తింటున్నారు. శీతల పానీయాల వంటి వాటిని చిప్స్‌ లాంటి పనికిమాలిన వాటిని ఎక్కువగా తీసుకుంటున్నారు. పడకగదిలో టీవీలు ఉండే అబ్బాయిల్లో చాలామందికి పరీక్షల్లో మార్కులు తక్కువ వస్తున్నాయి. గ్రేడ్లు పడిపోతున్నాయి.

ఇలాంటి పలు నష్టాలున్న కారణంగా పడకగదిలో టీవీలు ఉంచు కోవద్దని, ఒకవేళ ఉన్నట్లయితే దాన్ని ఒక నిర్దిష్ట సమయం తరువాత ఆన్‌ చేయకూడదని నిర్ణయించుకుని దానిన తు. చ. తప్పక పాటించాలని శాస్త్రజ్ఞులు సూచిస్తున్నారు.