సుతిమెత్తని పాదాలకు

Beautiful Legs
Beautiful Legs

సుతిమెత్తని పాదాలకు

చలికాలంలో పాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో కాలిమడమలపై పగుళ్లు వచ్చి సమస్య మరింత పెరుగుతుంది. అదే డయాబెటిస్‌ ఉన్నవారికైతే ఈ సమస్య వచ్చినప్పుడు అదే తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ కాలంలో పాదాలను జాగ్రత్తగా ఉంచుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ్య ప్రతిరోజూ పాదాలను చల్లటి నీళ్లతో కాకుండా గోరువెచ్చటి నీటితో కడుక్కోవాలి. ్య పాదాలను, వేళ్ల మధ్య ఎప్పుడూ పొడిగా ఉంచుకోవాలి. ్య రోజూ పాదాలను జాగ్రత్తగా పరిశీలించుకోవాలి.

కాలి బొటనవేలి గోరును జాగ్రత్తగా కట్‌ చేసుకోవాలి. ్య పాదరక్షలు సరిగ్గా సరిపోయేలా ఉండేలా చూసుకోవాలి. ్య షూస్‌ ధరించేవారు బూట్లలో ఏదైనా ఉన్నట్లు స్పర్శకు తెలిస్తే వెంటనే బూట్లు తొలగించి ఆ వస్తువ్ఞను తొలగించాకే మళ్లీ వేసుకోవాలి. ్య చెప్పులు లేకుండా నడవకూడదు. పాదాలపై వేడినీళ్లు పోసుకోకూడదు.

ఉతకని సాక్స్‌ ఎక్కువరోజులు వేసుకోకూడదు. ్య రోజూ పడుకోబోయే ముందు కాళ్లను బాగా శుభ్రం చేసుకుని పగుళ్లను తగ్గించే క్రీముతో పదినిమిషాలు మసాజ్‌ చేయాలి.