‘సిగ’సోయగాలు

CHELI0
CHELI0

‘సిగ’సోయగాలు

ఎండలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. జడ వేసుకోవడం కంటే ముడి వేసుకోవడం, లేదా కొప్పుతో అందంగా అలంకరించుకుంటే సౌకర్యంగా ఉంటుంది. ఇప్పుడు పెళ్లికూతురు కూడా మ్యారేజ్‌ రిసెప్షన్‌లో ముడినే వేసుకుంటున్నది. అయితే కొందరికి జట్టు తక్కువగా ఉంటుంది. ఇంత తక్కువగా ఉంటే ఎలా అనో ఏమాత్రం బెంగపడొద్దు. ఉన్న కేశాలనే కాస్త అటుఇటూ తిప్పి ‘ముడివేసారనుకోండి. మీ సిగలో పూలు పెట్టనఖ్ఖర్లేకుండానే సిగధగలు ధగధగలనిపిస్తాయి. మీకు తెలుసున్న వాళ్లు కూడా మీ అందం చూసి ఆశ్చర్యపోతారు. మీ అందమైన ఆకృతికి అందమైన సిగచుడితే ఎంత బాగుంటుందో మీరెపుడైనా అద్దంలో చూసుకున్నారా. మీకోసం కొన్ని శిరోజాలంకరణలను ఇక్కడ ఇస్తున్నాం. ముందుగా మీ ‘సిగకు ఏ అలంకరణ నప్పుతుందో చూసుకోండి మరి!