సాయి కృప

shirdi sai
shirdi sai

సాయి సామిత్యంలో ఎందరిగాధలో ఉన్నాయ. వాటిలో కొందరి భక్తులపేర్లు తరచుగా వినిపిస్తుంటాయి. ఉదాహరణగా మాధషావరావ్ఞ, కాకాసాహెబ్‌దీక్షితు, హేమాద్‌పంత్‌, దాసగణు మొదలైనవి. కొందరిపేర్ల ఒకే ఒకసారి వస్తాయి. ఉదాహరణగా చోల్కార్‌ను తీసుకొనవచ్చును. తరచుగా కన్పించే వారలు తారలైతే, చోల్కార్‌ను ఇంద్రధనస్సుగా తీసుకోవచ్చు. అందరినీ పరవశింపచేసేది ఇంద్రధనస్సు. చోల్కారుకూడా ఒకేసారి వచ్చినా, మనసులో చిరస్థాయిగా ఉండిపోతాడు. అందరికి నచ్చి, అందరూ మెచ్చే అతనికున్న సుగుణాలలో ఒకటి కర్తవ్యపాలన. అతడు తాను నిర్వర్తించదలచిన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు. పరీక్షకు చదివాడు. పరీక్షకు సరిగా చదవకుండా, సరిగా రాయకుండా గాలిలో దీపం పెట్టి సాయిబాబా నీ మహిమను చూపు నన్ను ఉత్తీర్ణునిగా చేయి అని కోరలేదు. అలా అందరూ తమ కర్తవ్యాన్ని పూర్తి చేయాలి.

గజేంద్రమోక్షగాధ మహాభాగవతంలో వస్తుంది. గజేంద్రుడు మకరంతో విసుగు చెందకుండా రాత్రుళ్లూ పగళ్లూ సంజలు వెయ్యిఏండ్లు తీవ్రంగా పోరాటం చేశాడు. తన శక్తిమేరకు కష్టపడ్డాడు. సత్తువ కోల్పోయాడు. అప్పుడు దైవాన్ని ప్రార్థించాడు. దైవం ఆదుకోవటం జరిగింది. మొసలి తన కాలును పట్టుకోగానే, శ్రమించకుండా దైవాన్ని ప్రార్థించలేదు. ఖురాన్‌ గ్రంధం కూడా ‘నీ ఈశ్వరుడు ప్రజల పనులు ఎరుగనివాడు కాడు అని తెలుపుతుంది. ఏ వ్యక్తి అయినా విజయానికి తనకు తానై మొదట శ్రమించాలి. అనంతరమే దైవ, సత్పురుషుల ప్రవేయం వస్తుంది. సాయి సాహిత్యంలో పురందరుడు అనే పేరుగల వారు ఒకరే కాదు. జాల్నానివాసి, సంస్కృతపండితుడు పురందరే. ఈ పురందరే తన అన్న కుమారుని తీసికొని షిరిడీకి వచ్చాడు.

సాయిని దర్శించాడు. ‘వీడు మా అన్నగారి అబ్బాయి. వీడు ఇంగ్లీషు చదువ్ఞలు చదవాలని, లాయరో, డాక్టరో అవ్వాలని ఆశ. అందుకు మీ ఆశీస్సులు కావాలి అన్నాడు సాయిబాబాతో. సాయిబాబా చిరునవ్ఞ్వ నవ్వాడు. ‘మనం మన పరిధిలో శక్తివంచనలేకుండా, ఆత్మవిశ్వాసంతో, అనుకున్నదాని కొరకు పాటుపడాలి. ఆరంభదశలోనే ఆశీస్సుల కొరకు ఆరాటపడరాదు. కృషి చేయవలసిన దశలోనే ఇతరుల నుండి ఆశీస్సులు, ఆశీర్వాదాలు, దయాదాక్షిణ్యాలు వగైరా గుర్తుకు రాకూడదు. చూడు పురందర్‌! నిస్సహాయ అవస్థలో దైవం గుర్తుకు వచ్చినట్లు, తన కృషిలో విశ్వాసం లోపించినప్పుడు మనిషి ఇతరుల సహాయం కోసం అలమటిస్తాడు. మీరు మీ బాధ్యతల విషయంలో దైవకృపకు చోటివ్వకండి.

అలా చేయటం దైవదృష్టిలో హాస్యాస్పదమైన విషయం. ఆశీస్సులే సర్వస్యం అనుకోవద్దు. మీరు ముందు చేయవలసిన దేదో స్పష్టంగా నిర్ణయించుకొని, చిత్తశుద్ధితో అందుకు కృషి చేయండి. తదుపరి నా ఆశీస్సులు మీకు తప్పక లభిస్తాయి అని పలికాడు సాయి పురందరేతో. చోళ్కారులో అందరినీ, చివరకు సాయిబాబాను కూడా ఆనందపరచిన విషయం మొక్కు చీర్చటం. చోళ్కారు చక్కెరలేని తేనీరు తాగసాగాడు. ఇక చక్కెర ఉన్న ఏ పదార్థాన్ని కూడా సేవించేవాడు కాడు. ఈ సంగతి సాయి గ్రహించాడు. చక్కెర ఎక్కువగా వేసి, తేనీరును చోళ్కారుకు ఇవ్వమని ఒక భక్తుని పునమాయించాడు సాయి. తన కృషిని మనము నిండుమనసుతో చేయుదుముగాక!

  • యం.పి.సాయినాధ్‌