సమానత్వమంటే బాహ్యాలంకారాలా!

మగువ మనసు

Women3

సమానత్వమంటే బాహ్యాలంకారాలా!

‘ఇష్టం వచ్చినట్లు జీవించే హక్కు మీకే ఉందా? మాకు లేదా? మీరే తాగొచ్చా? మేం తాగకూడదా? మాకు ఇష్టం వచ్చిన బట్టలను మేం వేసుకోకూడదా? మేమెందుకు మీ అంత స్వేచ్ఛగా ఉండకూడదు? అని ప్రశ్నిస్తూ ఓ వాదానికి, సమానత్వానికి మధ్య ఉండే సంకుచిత భావజాలాన్ని సమానత్వంగా చిత్రీకరించి, సహజత్వాన్ని చంపేసి కృత్రిమ ఊపిరితో కొనసాగుతున్న స్త్రీవాదం మనకు తారసపడుతుంది నేటి పరిస్థితుల్లో. అనుకరణకి, సమానత్వానికి మధ్య చావ్ఞకి, బతుక్కి మధ్య ఉన్నంత తేడా ఉంది.

ఇక్కడ లింగవివక్ష ఉన్న మాట నిజమే కానీ దానికి వ్యతిరేకంగా పోరాటాలు అంటూ ముందడుగు వేసి పురుషుడిలా అన్ని కోణాల్లో మారిపోవడమే స్త్రీ సాధికారత, సమానత్వం, స్వేచ్ఛ అనుకుని త్రిశంకుభావజాలంతో ప్లాస్టిక్‌ పువ్ఞ్వల బతుకు సందడిలో సాగుతున్న నేటి స్త్రీవాద ధృక్కోణం ఈ కింద ప్రశ్నల పట్ల వాస్తవిక స్పష్టత కలిగి ఉంటే మంచిదేమో! వ సమానత్వం అంటే ఏమిటి? వ స్త్రీలకు ఏ విషయంలో సమానత్వం లేదు? వ సమానత్వం లేదా స్వేచ్ఛ లేకపోవడం అనేది భవిష్య పరిణామాలను దృష్టిలో ఉంచుకొని సహేతుకమైన కారణాల వల్ల ఉద్భవించిందా? లేకుంటే కేవలం ఆధిక్యధోరణి ప్రదర్శించడానికే ఉద్భవించిందా? లేక మిధ్రమ ధోరణితో పుట్టిందా? వ ఎటువంటి పరిస్థితుల్లో స్త్రీలకు సమానత్వం అవసరం?

ప్రకృతిరీత్యా స్త్రీ, పురుషు శరీరధర్మాల్లో తేడాలున్నప్పుడు ఆ ప్రకృతికి దూరంగా జరిగి మూర్తిమత్వాన్ని ఇంకొకరిలా మార్చుకుంటే సమాజంలో ఉన్న వివక్ష భావజాలాలు తొలగిపోతాయా? వ పురుషుడు చేసే ప్రతి పని స్త్రీ చేయడమే సమానత్వమా? అలా అయితే స్త్రీ చేసే ప్రతి పని పురుషుడు చేయలేడా! అంటే కొన్ని పనులను ప్రామాణికంగా పెట్టుకుని అవి కృత్రిమంగానైనా చేయడానికి ప్రయత్నించడమేనా సమానత్వమంటే?

ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరి భావజాలానికి తగ్గట్టు వారు చెప్పొచ్చు. కానీ సమాజం వ్యక్తిగత ఆనందం, సమిష్టి సంతోషం, ముందు తరం వారికి ఆదర్శంగా నిలబడగలగడం వంటి సూచికలు స్త్రీ సమానత్వవాదాన్ని నడిపిస్తే అప్పుడు అది అందరికీ ఆమోదదాయకం అవ్ఞతుందేమో కదా? ప్రతి మనిషికి కావాల్సిన కనీస అవసరాలు తిండి, గుడ్డ, ఇల్లు. వీటితో పాటు విద్య కూడా. స్త్రీ, పురుష భేదం లేకుండా వేటికి భంగం కలగకుండా స్త్రీ కూడా ఉండేలా చూడటమే ప్రాథమిక సమానత్వం. స్త్రీలకు సమానత్వం లేని విషయాలు ఏమున్నాయి? ఈ ప్రశ్నను క్షుణ్ణంగా పరిశీలిస్తే అది ఆమె పుట్టి, పెరిగిన వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. ఓ కుటుంబంలో కొడుకు, కూతురు ఇద్దరూ ఉన్నప్పుడు పైన చెప్పినటువంటి నాలుగు అవసరాల్లో దేనిలో ఆమెను వివక్షకు గురి చేసినా అక్కడ సమానత్వం లోపించినట్లే.

పుట్టి పెరుగుతున్న క్రమంలో ప్రతి వ్యక్తి తన అభిరుచుల్ని, అలవాట్లను అలవర్చుకుంటాడు. అందులో భాగంగా స్త్రీకి వంటపని అభిరుచి అయితే దాన్ని ఆమె చేయడంలో తప్పు లేదు. కాని బలవంతంగా అది ‘ఆడపని అని ఆమెపై రుద్ధితే అది ఖచ్చితంగా తప్పే. అదే అభిరుచి అబ్బాయికి ఉంటే అతను ఆ పని చేయడంలో తప్పు లేదు, ఇక్కడ అభిరుచి అనేది ఇష్టం, సామర్ధ్యాలమీద ఆధారపడిన అంశమే కానీ లింగబేదం మీద మాత్రం కాదు. స్త్రీ సమానత్వం లేని అంశాలు ఇవి అని ఖచ్చితంగా నిర్ధారించటానికి లేదు.

అది పూర్తిగా ఆమె ఇష్టాలకు సంబంధించిన అంశం అంతే కానీ. ‘ఆడవాళ్లే ఎందుకు వంట చేయాలి? మగవాళ్లు వంట చేస్తేనే స్త్రీకి సమానత్వం వచ్చినట్లు అనే పిడివాదాలు మాత్రం ఖచ్చితంగా వాస్తవానికి దగ్గరగా నిలబడలేవ్ఞ. స్త్రీ, పురుష శరీర ధర్మాలు వేరువేరు. నెలనెల జరిగే రుతుక్రమ పద్ధతిలో ఆమె కొంత శక్తిని కోల్పోవడం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అంతేకాకుండా కొంత కోమలత్వం కలిగిన శరీరం ఆమెది. మొరటు పనులు లేదా కాస్త అసౌకర్యాన్ని కలిగించే పనులు ఆమె చేయలేకపోవచ్చు. ఈ విషయంలో స్త్రీ అశక్తతని, ప్రకృతి ధర్మాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని పనులు స్త్రీలు చేయరాదు అని ఆనాడు అని ఉండవచ్చు. కానీ ఈ క్రమంలోనే పురుష ఆధిపత్యధోరణి ప్రవేశించి ఇంకొన్ని అంశాలు కూడా జత కలిసి ఉండొచ్చు. ఏదిఏమైనప్పటికీ వ్యక్తిగా తను ఏమి చేయగలను? ఏది చేయలేను.

సాధనతో ఏది చేయగలను? అన్న విషయాలు నిర్ణయించుకొని, ముందుకు సాగాల్సిన స్వేచ్ఛాపరిధి అన్నది ప్రతి స్త్రీకి వ్యక్తిగతంగా మారుతూ ఉంటుంది. ఈ సమానత్వ చట్రం తయారు చేసి ఆ పరిధిలో స్త్రీజాతి మొత్తాన్ని ఇరికించేసి, ఇదే స్త్రీ సమానత్వం అని ప్రచారం చేసేవారు, ఈ విషయాలన్నింటిని కూడా నిశితంగా పరిశీలిస్తే బాగుంటుందేమో! భర్త పైశాచిక చర్యల్ని భరిస్తూ, సర్దుకుంటూ కన్నీళ్లతో గడుపుతున్న ఇల్లాల్లు ఇంకా ఎందరో? ఇప్పటికీ ఎన్నో తెగల్లో అవమానాల దాష్టికానికి గురవ్ఞతూ ఉన్న ఆడబిడ్డలు ఎందరో! గుట్టుచప్పుడు కాకుండా వీరంతా భరిస్తున్నారే కానీ గొంతువిప్పి, ఫిర్యాదులు నమోదు చేసేవారు అరుదే. స్వతంత్రంగా బతికే ఆలంబన లేక సర్దుకుపోయే వారికి కావాల్సిందే ‘సమానత్వం అనే అస్త్రం. కానీ పని ఒత్తిడిలో అలిసిపోయి అనుకోకుండా దొర్లే పదప్రయోగాలకి విపరీతంగా స్పందిచే ఆలుమగల బంధాన్ని విచ్ఛిన్నం చేసుకోవడమే సమానత్వం అయితే దాని పరిణామాలు ఎక్కడికి దారి తీస్తున్నాయి? నిజంగా సమస్య ఉందా? లేదా? అనేది నిర్ధారించుకోలేక తటస్థ వైఖరితో కుహనా సమానత్వం పేరిట ఓ తరాన్నే పూర్తిగా విచ్ఛిన్నం చేస్తున్న సంఘటనలెన్నో. అన్నిటికన్నా ముఖ్యంగా ఆలోచించాల్సిన అంశం ఇంకొకటుంది.

అసలు లింగ వివక్షకు కారణం స్త్రీ, పురుషుడిలా ఉండలేకపోవడమా? అంటే తెలియకుండానే ‘పురుషుడిలా ఉంటే వివక్ష ఉండదు అన్న భావనతో పురుష లక్షణాల్ని స్త్రీవాదం పేరిట అలవర్చుకొనే ప్రయత్నం జరుగుతుందా? అంటే తెలియకుండానే స్త్రీలా ఉండటాన్ని ఇష్టపడలేకపోతున్నామా? స్త్రీతత్వాన్ని దాని ఔన్నత్యాన్ని మరిచి పురుష లక్షణాలపై మొగ్గుచూపడమే స్త్రీ సమానత్వంగా చిత్రీకరిస్తున్నామా? ఈ క్రమంలో చివరికి మిగిలేదేమి? ‘స్త్రీ అనే అంశం రూపానికి పరిమితమై వ్యక్తిగా పురుషుడిలా మారిపోవడమేనా? ప్రకృతికి, మనిషికి అవినాభావన సంబంధం ఉంది. సృష్టి క్రమంలోనే ఓ లయబద్దత ఉంది. దాన్ని మర్చిపోయే ఈ వింత పోకడలు జీవితంలోని అందాన్ని పాడుచేయడమే కాకుండా తరతరాల మూలాలు అంతరించేలా చేస్తాయి. అనుకరణ మాని సహజసిద్ధ స్వభావానికి తగ్గట్టు స్వతంత్ర జీవనశైలిని అలవర్చుకునే తతాన్నే ‘స్త్రీ సమానత్వంగా నిర్వర్తించే రోజు రావాలని ఆశిద్దాం.

– శృంగవరపు రచన