సంశయిస్తే సమస్య తప్పదు

SAD-33
SAD

సంశయిస్తే సమస్య తప్పదు

ఏమేమి పనులు చేయాలి అనేది ఎప్పటికప్పుడు మనం గుర్తు చేసుకుంటూనే ఉంటాం. లేకపోతే మర్చిపోతాము కాబట్టి అది మంచి విధానమే. కానీ చేయకూడని పనులూ ఉంటాయి. వీటిని గుర్తుంచుకోవడమూ అవసరమే- ే కాదు అని చెప్పదలచుకున్న చోట అవును అని అనకండి. ే మీరు సకాలంలో పూర్తిచేయలేము అని అనుకున్నపుడు, ఆ విషయం కచ్చితంగా తెలిసినపుడు అదనపు పని చేస్తానని ఒప్పుకోవద్దు. ే మీ పిల్లలకు, భార్యలేక భర్తకు, స్నేహితులకు నిలబెట్టుకునే అవకాశం లేని, లేనిపోని వాగ్దానాలు చేయకండి. ే అనారోగ్య సమస్యలకు వైద్యుల సలహాలు తీసుకోవడమే ఉత్తమం. మాకు అన్నీ తెలుసు అనే భ్రమలో కొంతమంది ప్రతి విషయానికి సలహా ఇచ్చేందుకు ముందుకు వస్తుంటారు. వీరి సలహాలు అనారోగ్యం తగ్గేందుకు మందులు వాడే విషయంలో తీసుకోకండి. ే అందరినీ సంతోషపెట్టటం, అందరితో అవునని పించుకోవాలని ఆశించడం- ఇవి తలకి మించిన భారాలు. ఈ సూత్రాలను జీవితంలో పాటిస్తుంటే వాటిని వెంటనే వదిలేయండి. ే మీకోసం అంటూ కేటాయించుకున్న వ్యక్తిగత సమయాన్ని ఇతరుల అవసరాలు తీర్చేందుకు వాడకండి.