సంప్రదాయ తైలంతో…!

BODY OIL
BODY OIL

సంప్రదాయ తైలంతో…!

పూర్వం స్త్రీలు తరచు, తలకు నూనె రాసుకుని, కుంకుడు కాయ లేదా షీకాయ రసంతో రుద్దుకుని తలస్నానం చేయడం ఆచారంగా ఉండేది. కాని ఇప్పుడు షాంపూలు వచ్చాయి. పాత పద్ధతులు మరుగున పడిపోయాయి. షాంపూలలో కలిపే రసాయనాల ప్రభావం వల్ల జుట్టుకు లేనిపోని సమస్యలు రావడం, వాటిని సరిదిద్దుకునేందుకు వేరే పద్ధతులు, రంగులు, రసాయనాలు వాడడం వాటితో పరిస్థితి ఇంకా క్లిష్టతరం కావడం జరుగుతోంది.

పూర్వం తలకి భృంగరాజు తైలం రాసుకునేవారు అందులో అనేక మొక్కల నుండి తీసిన తైలాలు, రసాలు కలిపి ఉండేవి. వీటి మంచి గుణాలు ప్రాచీన ఆయుర్వేద గ్రంధాలలో స్పష్టంగా రాయడం జరిగింది. ఇప్పుడు పాశ్చాత్య దేశాలలో సౌందర్య పోషణకు ఆయుర్వేద పద్ధతుల పట్ల మక్కువ ఎక్కువవ్ఞతోంది. ఆయుర్వేద సిద్ధాంతం ప్రకారం ఒక వ్యక్తి శరీరతత్వం వాత, పిత్త, కఫ అనే మూడు దోషాలను బట్టి నిర్ణయించబడుతుంది. వీటిలో ఏదో ఒకటి ఒక్కొక్క వ్యక్తిలో ప్రబలంగా ఉంటుంది. వాతతత్వం గల చర్మానికి లావెండర్‌ మాయిశ్చరైజర్‌, పిత్తతత్వానికి శాండల్‌వ్ఞడ్‌ వాడాలని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.

వీటిలో రసాయనాలేవీ కలవవ్ఞ. వీటిలో మొక్కల నుంచి, పుష్పాల నుంచి తీసిన పదార్థాలు మాత్రమే ఉంటాయంటు న్నారు. ఇవి క్లీనింగ్‌, రిఫ్రెషనింగ్‌, మాయిశ్చరైజింగ్‌ అనే మూడంచెల కార్యక్రమం ప్రకారం పనిచేస్తాయి. ఇప్పుడున్న పదార్థాలు నరిషింగ్‌ మసాజ్‌ జెల్స్‌, ఫ్రాగ్రెన్స్‌ స్ప్రేలు, బాడీ స్క్రబ్‌లు, హెర్బల్‌ టీలు ఇవి ఒక్కొక్క దోష రకానికి సరిపోయేట్లు ఆయుర్వేద సిద్ధాంతం ప్రకారం తయారుచేయబడ్డాయి. వీటిలో ఉపయోగించిన మొక్కలను ఇండియా, నేపాల్‌ దేశాల నుంచి సేకరించారు. ఆయుర్వేద సూత్రాల ఆధారంగా స్నానానికి ఉపయోగించే ట్రీట్‌మెంట్లు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి శిరోధార రిలాక్సేషన్‌ ట్రీట్‌మెంట్‌.