సంపూర్ణారోగ్యానికి మెట్లు

healthy lady
healthy lady


నేటి కాలం లో ప్రతి ఒక్కరూ కోరుకునే సంపద సంపూర్ణ ఆరోగ్యమే. ఈ సంపూర్ణ ఆరోగ్యాన్ని మీకు అందించడానికి మూడు మెట్లు ఎపుడూ సిద్దంగా ఉంటాయి. ఎటొచ్చి వాటిని ఎక్కడమే కాస్త శ్రమతో కూడుకున్న పని. ఈ మూడు మెట్లు ఎక్కడం మీవల్ల సాధ్యమవుతుందోమో చూడండి.
కడుపు నిండా తినొద్దు
సాధారణంగా మనం రోజూ తీసుకునే ఆహారంలో 3000- 3500 క్యాలరీలు ఉంటుంది. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజుకి కేవలం 2000 క్యాలరీలు మాత్రమే ఆహారంగా తీసుకోవాలి. ఇలా ఎక్కువైన క్యాలరీల వల్లే అధికబరువు, దానితోపాటే గుండెపోట్లు, ఛాతినొప్పులు, రకరకాల ఆరోగ్యసమస్యలు వస్తాయి. ఆహారంలో క్యాలరీలను తగ్గించడంవల్ల వీటన్నింటినుండి బయటపడి ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు అంటున్నారు.
లోపలికి, బయటికి గాలిని పీల్చండి.

ఒత్తిడినుండి వెంటనే దూరమయ్యే మంచి వ్యాయామం ఇదే. బాసింపట్టు వేసుకుని కూర్చుని మీ రెండు అరచేతులు మోకాళ్ళమీద ఉండేలాగా పెట్టండి. కళ్లు మూసుకుని మెల్లగా గాలిని లోపలికీ, బయటికి పీల్చండి. గాలి ఎలా మీ ఊపిరితిత్తుల్లోకి వెడుతుందో ఊహించండి. గాలిని బయటికి వెడుతున్నపుడు పొట్టభాగం లోపలికి వెళ్లడం గాలి బయటికి రావడం వీటిమీద దష్టిని నిలపండి. ఈ వ్యాయామాన్ని క్రమం తప్పకుండా చేయడం వల్ల ఒత్తిడినుండి క్షణాల్లో దూరం కావడమే కాకుండా మెదడు చురుకుగా తయారవుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
సంతోషంగా ఉండండి
వంటచేస్తున్నా, ఆఫీసు పనులు చేస్తున్నా, మీ పిల్లలతో హోంవర్కు చేయిస్తున్నా ఏ పనైనా సరే చేస్తున్న ప్రతి పనిని ఎంజా§్‌ు చేయండి. ఏ పనైనా సరే ఇబ్బంది లేకుండా మనసుమీదికి ఎక్కువ ఆందోళన తీసుకోకుండా చేయడం వల్ల ఒత్తిడినుండి దూరంగా ఉండవచ్చు.