శ్రీమదాంధ్రభాగవతం

Donate with integrity
om

ఎంతటి మహనీయుడైనా ఏదో ఒక సమయంలో ఏదో ఒక కారణంగా దిగులు పడటం, చింతచేయటం తప్పదు. అలాంటి సమయంలో తల్లిగాని, తండ్రిగాని, భార్యగాని, భర్తగాని, మిత్రుడుగానీ, ఎవరో ఒక శ్రేయోభిలాషిగాని వచ్చి అతని చింతకు కారణమేమిటో కనుగొని రెండు మంచి మాటలను చెప్పి అతని చింతను రూపుమాపుతారు. అతడు మరీ ఉత్సాహంగా సత్యార్యాలను చేస్తూ తన శేషజీవితాన్ని గడుపుతాడు. ఆత్మవిమర్శ మరీ మంచిది. గురువ్ఞలకే గురువ్ఞ వేదవ్యాస మహర్షి గురుపూర్ణిమ రోజు ఆయనను తలచుకోక ఉండడు. ఏ హిందువైనా అంతటివానికి కూడా చింతించక తప్పలేదు. మనస్సునందు సంతోషం లోపించి కిన్నుడై సరస్వతీనదీ తీరమున ఏకాంతంగా కూర్చున్నాడు. దీర్ఘంగా ఆలోచిస్తూ. ఆయన చింతకు కారణం మనకుండే వ్యక్తిగత కారణం లాంటిదికాదు, భావిభారత జాతిని గురించిన ఆలోచన. ప్రజాశ్రేయస్సును కోరి ఎంతో తపస్సు చేశాడు, ఎన్నెన్నో గ్రంధాలు రచించాడు. అయినా మనసులో ఏదో దిగులు. ఎందుకో? నేను వ్రతములను చేబట్టి వేదములను, గురువ్ఞలను, అగ్నులను పూజించి వారి ఆదేశమను పాటించితిని. వేదార్ధములు, వాటి సారమునంతయూ గూర్చి సర్వధర్మంలను తెలుసుకొనునట్లుగా స్త్రీలకు, శూద్రులకు ప్రియమగునట్లు భారత గ్రంధాన్ని రచించితిని. అయినప్పటికీ దేహం నందుండే జీవ్ఞడు పూర్ణుడే అయినా తన యదార్థస్వరూపాన్ని తెలుసుకోగలిగే ధర్మాన్ని తెలియచేయలేదని తెలియవచ్చినది. తన ఈ విచారణకు అదే కారణం అయివ్ఞండునని భావించెను. (పుట 11-భాగవతసుధ, చిలుకూరు వెంకటేశ్వరు) దీన్నిబట్టి ఏమి తెలుస్తుంది? వ్యాసుడు ఆత్మవిమర్శ చేసుకొన్నాడు. దేనినీ వదలకు ఆయన చేసిన అన్ని పనులను గుర్తుకు తెచ్చుకొన్నాడు. ఆయన వ్రతాలను చేశాడు, వేదాలను, గురువ్ఞలను, అగ్నులను పూజించాడు, వారి ఆదేశాలను పాటించాడు, సద్గ్రంథ రచన చేసి ధర్మాలను బోధించాడు. అవన్నీ ఆయన మనసుకు తృప్తి నివ్వలేదు, దుఃఖాన్ని మిగిల్చాయి. వరి మనం ఆ పనులనే పదేపదే చేస్తూ జన్మవిూద జన్మను ఎత్తుతూ ఉండిపోతే సరిపోతుందా? యోచించండి. వ్యాసుడు యోచించాడు, కనుగొన్నాడు. ఏమని స్వస్వరూపు జ్ఞానమే వెరికైనా శావ్వతానందాన్ని ఇచ్చేదని, తాను అంతవరకు దాన్ని బోధించలేదని, అదే తన చింతకు కారణమని. మరి మనం మన స్వరూపాన్ని తెలుసుకోవాలా? అద్దంలో చూస్తే సరిపోతుందా? మన దేహరూపం కనుపడుతుంది. మన స్వస్వరూపాన్ని చూడాలంటే మన మనస్సనే అద్దంలో చూడాలి. అది మలినంగా ఉంటే బొమ్మ స్పష్టంగా కనపడదు, స్వచ్ఛంగా ఉండాలి. దుర్గుణాలను పెకలించి పారేయాలి.

  • రాచమడుగు శ్రీనివాసులు

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/