శరీరాకృతిని దెబ్బతీసే కేలరీలు

obisity
obisity

శరీరాకృతిని దెబ్బతీసే కేలరీలు

ఏదైనా ఒక పార్టీకి వెళ్లాలనుకున్నప్పుడు మీరు ఎలాంటి దుస్తులను ఎంచుకుంటారు? ఆ సమయంలో మీ మూడ్‌నుబట్టి ఉంటుందా? ఆ పార్టీ ఏ కారణంగా ఏర్పాటు చేశారనే అంశం మీదా? లేక అక్కడికి వచ్చే ఇతర అతిథులను దృష్టిలో ఉంచుకుంటారా? ఇవేవీ కాకపోతే మీ స్థూలకాయాన్ని కప్పే దుస్తులను ఎంచుకుంటారా? ఒకవేళ వీటన్నిటిలో ఆఖరు అంశమే కారణమైతే, అది మీ మనస్సును బాధపెట్టేదిగా ఉంటుందనడంలో సందేహం లేదు. మన చుట్టూ ఉన్న వ్యక్తులను మనం పరిశీలిస్తే ప్రతి అయిదుగురిలో ఒకరు అధిక బరువ్ఞతో బాధపడుతుండగా, ప్రతి పదిమందిలో ఒకరు స్థూలకాయంతో బాధపడుతున్నారు. స్త్రీలు తగిన శారీరక శ్రమ లేకపోవడం వల్ల, వారి ఆహారపు అలవాట్ల వల్ల ఎక్కువగా స్థూలకాయానికి గురవ్ఞతున్నారు. ఆధునిక కాలపు స్త్రీలు ఉద్యోగరీత్యా ఉరుకులు పరుగులతో జీవనాన్ని గడుపుతూ సమయానికి ఆహారం తీసుకోకపోవడం, అందుబాటులో పిజ్జాలు, బర్గర్ల వంటి జంక్‌ ఫుడ్‌ తినేయడం వంటి అంశాల కారణంగా అధిక బరువ్ఞకు గురవు తున్నారు. ఇటువంటి ఆహార పదార్థాల ద్వారా శరీరంలోకి చేరే అధిక కేలరీలు శరీరాకృతిని దెబ్బతీయడమే కాక, ఇతరత్రా ఆరోగ్య సమస్యలకు కూడా కారణమవుతుంటాయి. స్త్రీలలో గుండెజబ్బులు, లైపిడ్‌ లోపాలు, రక్తంలో చక్కెర శాతం అపక్రమాలు, హార్మోన్ల అసమతుల్య, గర్భధారణ తదితర అనేక ఇక్కట్లకు స్థూలకాయం కారణమవుతుంది.

స్థూలకాయం సాధారణంగా అన్ని వయస్సులలోని వారిలోనూ కని పించే సమస్య అయినప్పటికీ, స్త్రీలు ముప్ఫయ్యేళ్ల వయస్సు దాటాక వారిలో ప్రధాన సమస్యగా కనిపిస్తుంటుంది. ఈ వయస్సులో కుటుంబ బాధ్యతలు, వృత్తిపరమైన బాధ్యతల కారణంగా వారికి తమ శరీరంపై శ్రద్ధ తీసుకునే అవకాశం ఉండదు. స్థూలకాయం నుంచి స్త్రీలు బైటపడటానికి చేసే అనేక ప్రయత్నాలు సాధారణంగా వ్యర్థంగా మారుతుంటాయి. దీంతో వారు నలుగురిలోకి రావడానికి సంకోచిస్తారు. ఫంక్షన్లకు, పార్టీలకు వెళ్లడం మానేస్తారు. దీనికి పరిష్కారం లేదా? అని ఆలోచిస్తే తప్పకుండా పరిష్కారం ఉంది. బరువ్ఞ తగ్గడానికి ఉపకరించే కొన్ని అంశాలు మీకోసం…

జీవక్రియపై దృష్టి సారించండి :

విశ్రాంతిగా ఉన్నప్పుడు శరీరం ఎంత శక్తిని వినియోగించుకుందనే విషయాన్ని బేసల్‌ మెటబాలిక్‌ రేట్‌ (బిఎంఆర్‌) అంటారు. విశ్రాంతి తీసుకుంటూనే శరీరంలో అధికంగా ఉన్న కేలరీలను ఖర్చు చేయడం గురించి ఆలోచించండి. మిరపకాయలు, మిరియాలలో ఉన్న కొన్ని పదార్థాలు బిఎంఆర్‌ను పెంచుతాయి. కనుక స్వీట్లు తీసుకోవాలనుకున్నప్పుడు వాటి బదులు స్పైసీ ఆహారాన్ని తీసు కోండి. బిఎంఆర్‌ పెరగడానికి వ్యాయామం ఉపకరిస్తుంది. పీచుపదార్థాం మంచి నేస్తం : పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల చాలాసేపటి వరకూ కడుపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీనితో ఇతర ఉపాహారాల మీదకు మనస్సు పోదు.

వ్యాయామం :

తీవ్రమైన వ్యాయామం చేయడం వల్ల కండరాలు, శరీరంలో నీరు తగ్గుతాయి. బిఎంఆర్‌ పెరగడంలో కండరాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. కనుక వ్యాయామం తప్పనిసరి చేసుకోవాలి.