వెన్నకాచేదిలా!

Cheese
– వెన్న ఎక్కువ కాలం నిలవ ఉండి వాసన వేస్తూ ఉంటే క్రింది విధంగా చేయండి. ప్రతి అర్థపావు వెన్నకి పావు కప్పు పాలు తీసుకుని వెన్నని పాలలో వేసి కొంచెంగా వేడిచేయండి. వెన్న కరగకుండా ఉండాలి. ఆ తరువాత చిటికెడు ఉప్పు తీసుకుని ఆ వెన్నకి కలిపి బాగా కలపాలి. అలా ఆ పాలన్నీ వెన్న పీల్చుకునేవరకు కలపాలి. తరువాత వెన్నని గట్టిపడేవరకు ఫ్రిజ్‌లో పెట్టండి. అంతే తాజాగా ఉండే వెన్న తయారవుతుంది.
– గట్టిపడిపోయిన ఛీజ్‌ని పారేయకండి. దానిని తురిమి సాస్‌లో, ఆమ్లెట్‌లో వాడుకోవచ్చు.
– నెయ్యి నిల్వ వాసన వేస్తూ ఉంటే అందులో మునగ ఆకు వేసి కొంచెంగా కాచాలి. తరువాత నెయ్యి వడకట్టండి. నెయ్యి తాజాగా తయారవుతుంది.
– వెన్నకాచిన గిన్నెలో నుంచి నెయ్యి తీసేసాక రెండు కప్పుల నీళ్లు పోసి మరిగించండి. నీళ్లు ఇగిరిపోయిన తరువాత అందులో అన్నం వండండి. అన్నం తాజా నెయ్యి వాసనతో ఘుమఘుమలాడటమే కాకుండా నెయ్యి గిన్నె తాలూకు జిడ్డు, మాడు కూడా తేలికగా వదులుతాయి.
– నూనె, నెయ్యి నిల్వ ఉంచిన పాత్రలో పైన పొరలాగా ఏర్పడితే కంగారు పడకండి. ఆ పాత్రని స్టవ్‌మీద ఉంచి కాసేపు వేడిచేసి అందులో ఒక బంగాళా దుంప ముక్క వేయిస్తే నూనె మళ్లీ తాజాగా తయారవుతుంది.
– వెన్న నిల్వ వాసన వస్తుంటే కొంచెం నీళ్లు తీసుకుని అందులో సోడా బై కార్బనేట్‌ వేసి ఆ నీళ్లలో వెన్నని కడగండి. వెన్న నిల్వ వాసన పోయి తాజాగా తయారవుతుంది.