వెజ్‌ అపోలో

APOLLO
APOLLO

వెజ్‌ అపోలో

కావలసినవి: క్యారెట్‌-100గ్రా ఆలు-100గ్రా, బీన్స్‌-100గ్రా క్యాప్సికమ్‌-100గ్రా అల్లం,వెల్లుల్లి పేస్ట్‌-ఒకటిన్నర స్పూన్లు పెరుగు-ఒక కప్పు, పచ్చిమిర్చి-6 కార్న్‌ఫ్లోర్‌-50గ్రా మిరియాలపొడి-అరటేబుల్‌స్పూన్‌ ఉప్పు-సరిపడా, కరివేపాకు-2,3, రెమ్మలు రెడ్‌కలర్‌-చిటికెడు రిఫైన్డ్‌ ఆయిల్‌-వేపడానికి సరిపడా

తయారుచేసే విధానం

కాయగూరల్ని శుభ్రం చేసి సన్నముక్కలుగా తరగాలి. ముక్కలన్నిటినీ ఒక గిన్నెలో వేసి ఉప్పు, కార్న్‌ఫ్లోర్‌, మిరియాలపొడి, అల్లం,వెల్లుల్లి పేస్టు వేసి, తగినన్ని నీళ్లు పోస్తూ బజ్జీల పిండిలా కలిపి కాగుతున్న నూనెలో బజ్జీలా వేసి ఉంచాలి. తరువాత వేరే బాణలిలో 2స్పూన్ల నూనె వేసి పచ్చిమిర్చి, చీలికలు, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత పెరుగు రెడ్‌ఫుడ్‌ కలర్‌ చేసి కలపాలి. పెరుగు ఉడుకుతుండగా వేసి ఉంచిన వెజిటబుల్స్‌ బజ్జీలన్నీ వేసి నీరు ఇగిరి బాగా డ్రై అయిన తరువాత దించి కొత్తిమీర చల్లాలి. ఇది రైస్‌లోకే కాదు. స్నాక్స్‌గానూ, తినడానికి బావ్ఞంటుంది.