విలాసాలతో బతుకు విఫలం

sad
sad

విలాసాలతో బతుకు విఫలం

ఇటీవల కాలంలో ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాలకు కుటుంబాలే ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు పెరిగిపోతున్నాయి. షేర్ల బిజినెస్‌తో నష్టపోయిన వారు కొందరైతే, ఉద్యోగాల కోసం భారీమొత్తంలో లంచాలను ఇచ్చేందుకు అప్పులు చేసి, అటు ఉద్యోగం రాక, ఇటు చేసిన అప్పులు తీర్చలేక బతుకు భారమైపోతుంది. ఇంకొందరు చిట్టీలపేర్లతో భారీమొత్తంలో డబ్బులు కట్టి, ఆ డబ్బు వెనక్కి రాకపోవడంతో మోసపోయామని వ్యధ చెందడం, చిట్టీవారు భారీమొత్తంలో ప్రజల నుంచి డబ్బు వసూలు చేసి, రాత్రికి రాత్రే మాయమైపోవడంతో లబోదిబోమంటూ చావ్ఞను కోరుకుంటున్నారు.

ఇవేవీ లేకపోతే విలాసవంతమైన జీవితాన్ని గడపాలనే ఆకాంక్ష, వ్యామోహం, సరైన ప్రణాళిక లేకుండానే విచ్చలవిడిగా డబ్బును ఖర్చుపెట్టే మనస్తత్వం ఉన్నవారు అప్పుల కొలిమిలి కాలి బూడిదైపోతున్న కుటుంబాలు కోకొల్లలు. ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ. ఆర్భాటాల కోసం, లేనిపోని గొప్పలకోసం విలాసవంతమైన వస్తువ్ఞలను కొనుగోలు చేసి, తీరా వాటిని తీర్చలేక నవ్ఞ్వలపాలైపోతున్న కుటుంబాలు తక్కువేమీ కావ్ఞ. అప్పులు చేయకుండా జీవించలేం. కానీ బతుకంతా అప్పుల్లోనే ముగినితేలిపోయే పరిస్థితి వస్తే మాత్రం అది దారుణం. తీర్చగలిగే అప్పులు చేయగలిగితే సమస్య రాద. కానీ అప్పులు తీర్చడం కోసం అప్పులు చేస్తూ, వాటికి వడ్డీలు కట్టడానికి అప్పులు చేస్తూ పోతే మాత్రం బతుకంతా అప్పుల్లోనే గడిచిపోతోంది. కాబట్టి ఈ వలయంలోంచి బయటపడేందుకు ప్రయత్నించాలి. దీనికి ముందు అసలు అప్పులు ఎందుకు చేస్తున్నారో ఆలోచించాలి. ఏ పరిస్థితులు తమను అప్పుల కోసం తరుముతున్నాయో గమనించాలి.

సాధ్యమైనంత వరకు అప్పులు చేయకుండా గడపటం ఎలా సాధ్యమో చూడాలి. ఆ తర్వాత ఉన్న అప్పులు తీర్చడానికి ఏం చేయాలో నిర్ణయించుకోవచ్చు. అదాయానికి తగ్గట్టుగా ఖర్చు పెట్టుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవ్ఞ. కానీ కోర్కెలు అపరిమితంగా ఉండి ఆదాయం స్వల్పంగా ఉన్నప్పుడే అనేక సమస్యలు ఎదురవ్ఞతాయి. అప్పుడే అప్పుల కోసం బయలుదేరుతారు. కొన్ని పరిస్థితుల్లో ఇంకా అనేక కారణాల వల్ల అప్పులు చేస్తుంటారు. సాధారణంగా ఈ కారణాలతో అప్పులు చేస్తుంటారు. ర లగ్జరీ జీవితాన్ని గడపాలనుకునేవారు. మార్కెట్లో వ్ఞన్న వస్తువ్ఞలన్నింటిని సొంతం చేసుకోవాలనుకునేవారు అప్పులు చేయడం పరిపాటి. ర మామూలు అవసరాల కోసంచేసే అప్పులు చేస్తున్నారా? పర్వాలేదు.

చేబడుళ్లు ప్రతిఒక్కరి జీవితంలో తప్పనిసరి. ఇక తీర్చడానికి కూడా పెద్దగా కంగారు పడాల్సిందేమీ ఉండదు. ర ఇంటికి కావాల్సిన ఫర్నీచర్‌, స్కూటర్‌లాంటి వస్తువ్ఞలను కొనడానికి సాధారణంగా చాలామంది వాయిదాల పద్ధతిపైనా లేదంటే లోను ద్వారా తీసుకుంటారు. అయితే మీ ఆదాయాల గురించి ఆలోచించుకోండి. ర పెళ్లిళ్ల కోసం కొందరు అప్పులు చేస్తారు. అయితే పెళ్లి ఖర్చులో ఏమైనా తగ్గించుకోగలమా అని చూడాలి. అందుకోసం ప్లాన్‌ చేసుకోవాలి. ర అప్పు తీర్చడానికి కొందరు అప్పులు చేస్తారు. అయితే ఏటా వడ్డీ కోసం ఎంత చెల్లిస్తున్నామో గమనించాలి. ర పక్కవారు నిత్యం ఏదో ఒక ఫంక్షన్లు చేస్తుంటారని, వారిని చూసి, స్తోమత లేకపోయినా, అప్పులు తెచ్చి అయినా, గొప్పకోసం పంక్షన్లను ఏర్పాటు చేసి, ఇబ్బందు పడుతుంటారు. ర విదేశీ చదువ్ఞల వచ్చాక, బ్యాంకులు, ఇతర ఫైనాన్స్‌ సంస్థలు అప్పులను ఇస్తామంటూ భారీగా ప్రకటనల్ని గుప్పిస్తుంటారు. వాటిని చూసి, ఆకర్షితులై, తమ బిడ్డలు విదేశాల్లో గొప్పగా చదవాలని, ఏమాత్రం ముందు చూపులేకుండా, లక్షలు అప్పులు తెచ్చి, చదివించాలని, ప్రయత్నంలో అప్పులు చేస్తుంటారు.

వాటిని ఏవిధంగా తీర్చగలమో అనే ప్రణాళిక తప్పనిసరి. ర పిల్లల పుట్టినరోజు పంక్షన్లకి మరికొందరు అప్పులు చేస్తుంటారు. యాత్రలు చేయడం కోసం కొందరు అప్పులుచేస్తారు. అప్పులు చేసి యాత్రలు చేయాలా అన్న విషయం ఆలోచించరు. ఇలా అప్పులు చేసేవారు అప్పులు తీర్చడం కోసం చిట్టీలు వేస్తారు. చిట్టీలు వేసి మొదటి, రెండవపాటలోనే చిట్టి డబ్బులు తీసుకొని చేసిన అప్పులు తీరుస్తుంటారు. ఇంకొందరు వస్తువ్ఞలను తీసుకొని అప్పులు తీరుస్తుంటారు. ఇలా చేసేప్పుడు కొంచెం ముందు జాగ్రత్త వహించడం మంచిది. తమకు నెలసరి ఎంత ఆదాయం వస్తుందో చూసుకోవాలి. చిట్టీ డబ్బులను ఏ నెలకానెల చెల్లించగలమా లేదా అంచనా వేసుకోవాలి. లాము చేస్తున్న ఉద్యోగం పర్మినెంటా, తుమ్మితే వూడిపోయే ముక్కులాంటిదా అన్న అవగాహన ఉండాలి. ఎందుకంటే భవిష్యత్తు మీద భరోసాతో మీరు అప్పులు చేసి ఇంటికి కావాల్సిన సామానో, మోటారు సైకిల్‌నో కొన్నారనుకోండి. ఉన్న ఉద్యోగం పోతే బతకడం కన్నా అప్పు తీర్చడమే పెద్ద సమస్య అవ్ఞతుంది.

ముఖ్యంగా ప్రైవేటు ఉద్యోగాలు చేసేవారు అప్పులు చేయకుండా జాగ్రత్తపడాలి. ఎందుకంటే ఆ కంపెనీ యాజమాన్యానికి నచ్చకపోయినా తనకు ఆ ఉద్యోగం చేయడం నచ్చకపోయినా ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వ్ఞంటుంది. ఆ ఉద్యోగం మీద వచ్చే ఆదాయంతోనే బతుకు సాగించే వారికి అప్పులుంటే ఉన్న ఉద్యోగాన్ని కోల్పోయి మరో ఉద్యోగం కోసం చేసే ప్రయత్నంలో వాయిదాలు, చిట్టీలు, లోన్లకు ప్రతినెలా చెల్లించే డబ్బు చెల్లించకపోవడం వల్ల సదరు వ్యక్తుల నుంచి వచ్చే ఒత్తిడిని తట్టుకోలేరు. తప్పని పరిస్థితుల్లో నూటికి ఐదు, పదిరూపాయలు వడ్డీ చెల్లించడానికైనా స్ధిపడి అప్పు తెచ్చి వాయిదాలు కడుతుంటారు. ఇలాంటపుపడు ముందున్న వాయిదాలు, తీర్చాల్సిన అప్పు, ఎక్కువ మొత్తంలో వడ్డీ ఇవన్నీ పెరిగి తడిసి మోపెడవ్ఞతాయి. అప్పులు చేయడం సమస్యకాదు. కానీ అప్పులు ఎలా తీర్చగలరన్నది ఆలోచించడం మాత్రం అవసరం. అసలు అప్పుడు చేయకుండా బతకాలన్నా సాధ్యం కాదు. కానీ తీర్చగలిగే అప్పులయితే పరవాలేదు. లేనట్టయితే మీ బతుకంతా అప్పుల వలయంలోనే తిరగాల్సి వస్తుంది. అలా అప్పులతో సతమతమయ్యేవారు మన చుట్టురా చాలామంది ఉన్నారు. అయితే ఎప్పటికైనా అప్పులకు స్వస్తి చెప్పే మార్గం ఉండదా? రొటేషన్‌ పద్ధతిలో అప్పులు చేస్తూ అప్పులు తీరుస్తూ ఆ వలయంలోనే తిరుగాడటం తప్ప మరో పరిష్కారం లేదా అన్నది ఆలోచించకపోతే తీవ్రంగా నష్టపోతారు.