వన్నె పిన్నులు

వన్నె పిన్నులు

జుట్టున్నమ్మ ఏ కొప్పయినా వేయగలదని సామెత ఉంది. కొప్పే కాదు. ఆ కొప్పులో ఎన్ని రకాల పిన్నులతోనైనా అలంకరించుకోగలదని ఈ ఫ్యాషన్‌ పిన్నులను చూస్తుంటే అనొచ్చేమో.
నేటి అమ్మాయిలు జుట్టును వదిలేసుకుని చిన్న క్లిప్పులు రెండు వైపులా పెట్టుకుంటున్నారు. మరి ఈ క్లిప్పులు, క్లాత్‌వే కాకుండా సీజెడ్స్‌తో చేసినవి కూడా వస్తుండడంతో వాటిపైనే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఒకప్పుడు ఇది పిల్లల ఆభరణం. ఇప్పుడు పెద్దవారిదీనూ.