వంటిల్లు శుభ్రత ఒంటికి భద్రత

Beautiful Kichen room
Beautiful Kichen room

వంటిల్లు శుభ్రత ఒంటికి భద్రత

కిచెన్‌లో కార్పెట్లు వాడవద్దు. వీటివల్ల కింద ఒలికిన పదార్థాలను పీల్చేసి, దుర్వాసనకు, తేమ చేరడానికి కారణమవ్ఞతాయి. ఆహారపదార్థాల వాసన పురుగుల్ని చేరదీస్తుంది. వంటగది ఫ్లోర్‌కు అంతగా అలంకరణలు వద్దు. కొద్దిపాటి ఏరియా రగ్గులు, అదనపు కుషనింగ్‌ వాడితే సరిపోతుంది. ్జ సింకు వద్ద అండర్‌ఫుట్‌ ఉపయోగించాలి. దీనిని తరచూ ఉతకాలి.

పదార్థాల తయారీ, క్లీనింగ్‌ సందర్భంగా ఏర్పడే తేమను పోగొట్టుకోవడానికి వీలుగా కిటికీని ఎల్లవేళలా తెరిచి ఉంచాలి. కిచెన్‌ క్యాబినెట్స్‌ వంటి బిల్ట్‌ ఇన్‌ ఐటమ్స్‌ సింథటిక్‌ ప్రభావాలకు దూరంగా ఉండాలి. ఫ్రిజ్‌ల వంటి వాటిని మనం కూర్చునే ప్రదేశాలకు దూరంగా ఉంచాలి. ్జ వాటర్‌ ఫిల్టరేషన్‌ సిస్టమ్‌ను కిచెన్‌ వాటర్‌ ట్యాప్‌కు ఎటాచ్‌ చేయాలి. నాన్‌-టాక్సిక్‌ మెటీరియల్స్‌తో వాటర్‌ పైప్స్‌ను తయారుచేయడం మంచిది. వెంటిలేషన్‌ ్జ ఆరోగ్యవంతమైన కిచెన్‌కు వెంటిలేషన్‌ అవసరం. ప్రతిరోజు చేసే కుకింగ్‌, క్లీనింగ్‌లు గుర్తించ తగ్గ ఇండోర్‌ పొల్యూషన్‌కు కారణమవుతాయి.

వంటచేసే సమయంలో కిటికీలు తీయడం లేదా డిష్‌ వాషర్‌రన్నింగ్‌ వల్ల కొంత ఉపయోగం ఉంటుంది. తుది ఫలితాల కోసం మాత్రం స్టవ్‌ పైన మంచి క్వాలిటీ గల హుడ్‌ను ఏర్పాటు చేసుకోవాలి. ఇంటి వెలుపలకు లోపలి కాలుష్యం వెళ్లే ఏర్పాటు చేసుకోవాలి.

క్యాబినెట్స్‌ చాలా కిచెన్‌ క్యాబినెట్స్‌ ఫార్మాల్డిహైడ్‌, ఇతర టాక్సిక్‌ కెమికల్స్‌ కలిగి ఉంటాయి. కొన్నాళ్లకు ఇవి డ్రాప్‌ అవుతాయి కాని, ఈలోగా ఆరోగ్యానికి ఎంతో కొంత హాని తప్పదు. కొత్త క్యాబినెట్‌లలో పదార్థాల స్టోరింగ్‌ వల్ల ప్రభావం ఉంటుంది. ఫార్మాల్డిహైడ్‌ చికాకు కలిగించే ఘాటైన వాసన గల గ్యాస్‌ నీటిలో త్వరగా కలుస్తుంది. వీలయినంత వరకు ఫార్మల్డిహైడ్‌-ఫ్రీ క్యాబినెట్‌లు ఎంచుకోవాలి.

అప్లయెన్సెలు: దాదాపు అన్ని వంట గదుల్లోనూ చిన్న చిన్న అప్లయెన్స్‌లు ఉండి కావాల్సినప్పుడల్లా వాడుకోవటానికి వీలుగా ప్లగ్‌కు పెట్టి సిద్ధంగా ఉంటాయి. ్జ ఇక్కడ ప్రధాన ఆరోగ్య సమస్యల్లా అనవసరంగా ఇ.ఎం.ఆర్‌. ఉత్పత్తి కావడం. అప్లయెన్స్‌ వాడకంలో లేనప్పటికీ ప్లగ్‌పెట్టి ఉన్నప్పుడు ఎ.సి. ఎలక్ట్రిక్‌ ఫీల్డ్‌ క్రియేట్‌ అవుతుంటుంది. అవసరం లేనప్పుడు వేటినైనా ప్లగ్‌ నుంచి తీస్తున్నారో లేదో పరిశీలించండి. ఎంత తక్కువగా అప్లయెన్స్‌లు ఉంటే అంత మంచిదన్న మాట. వంటపాత్రలు ఏళ్ల తరబడి పరిశీలిస్తే వంటపాత్రలు ఎప్పటికప్పుడు మారుతూ వస్తున్నాయి.

1970లలో అల్యూమినియం వంటపాత్రల వల్ల అల్జీమర్స్‌ వస్తుందన్నారు. చాలామంది ఈ పాత్రల వాడకాన్ని మార్చేశారు. ఇప్పుడు నాన్‌స్టిక్‌ పాత్రలదే హవా.అయితే టెఫ్లాన్‌ కోటింగ్‌ పోయిన వాటిని వాడడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. గ్లాస్‌, స్టెయిన్‌లెస్‌ స్టీల్‌, కాస్ట్‌ ఐరన్‌ పాత్రలు సురక్షితమైనవి.

ఫుడ్‌ స్టోరేజ్‌
ఇది మరో ముఖ్యవిషయం. పదార్థాల తయారీ ఆరోగ్యంగా ఉన్నంత మాత్రాన సరిపోదు. వాటిని భద్రపరిచే విషయమూ అంతే ప్రధానం. కొన్ని రకాల ప్లాస్టిక్స్‌ రసాయన ప్రభావానికి గురవ్ఞతాయి. పదార్థాల్ని ప్లాస్టిక్‌ డబ్బాల్లో భద్రపరుస్తున్నట్లయితే, దానికి స్వస్తిచెప్పి, గాజుకు ప్రాధాన్యం ఇవ్వాలి. పిల్లలకు ప్లాస్టిక్‌ శాండ్‌విచ్‌ బ్యాగులు ఇచ్చే బదులు సహజసిద్ధమైన సెల్యులోజ్‌ శాండ్‌విచ్‌ బ్యాగ్స్‌ ఇవ్వాలి. ఫ్లోరింగ్‌ వంటగదిలో ఫ్లోరింగ్‌ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. తడి, ఆహారపదార్థాలు ఒలకడం జరుగుతుంది. కిచెన్‌ ఫ్లోర్‌కు గట్టి ఉపరితలం మంచి ఛాయిస్‌. ఎక్కువసేపు నిలబడి ఉంటారనుకునే ప్రదేశాల్లో మందమైన రగ్‌ లేదా మ్యాట్‌ పరుచుకుంటే సరిపోతుంది. వీటిని ప్రతిరోజూ వ్యాక్యూమ్‌ చేయాలి. లేదా బయటకు తీసుకువెళ్లి బాగా దులిపేయాలి.