లావు అవుతుంటే…

fat lady
fat lady


లావ్ఞ తగ్గాలనుకునేవారు సమతులిత ఆహారం తీసుకుంటూ, చక్కని ఎక్సర్‌సైజ్‌ చేస్తూ నువ్ఞ్వల నూనెతో శరీరాన్ని మసాజ్‌ చేసుకుంటే లావ్ఞ తగ్గి నాజూకుగా ఉంటారు. ముందు లావ్ఞ అవటానికి కారణాలేమిటో తెలుసుకుందాం.
వంశపారంపర్యం, థైరాయిడ్‌సమస్య, ఆహార నియమాలు సరిగా పాటించకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం. ఆఫీసులో ఎక్కువగా డెస్క్‌వర్క్‌, భోజనం చేయగానే నిద్రపోవటం
వంశపారంపర్యం: దీని వల్ల వచ్చిన లావ్ఞ సమస్య అయితే చిన్నతనం నుంచి ఎక్సర్‌సైజ్‌ చేస్తూ ఆహార నియమాలు పాటించాలి.
కొంతమంది థైరాయిడ్‌ సమస్యతో లావయిపోతారు. అటువంటి వారు ఎండ్రోక్రైనాలజిస్ట్‌ (హార్మోన్స్‌కి సంబంధించిన డాక్టర్‌)ని సంప్రదించాలి. ఆయన సలహా మీద మందులు వాడుతూ యోగాసనాలు వేస్తే లావ్ఞ తప్పక తగ్గుతారు.
చాలామంది ఆహార విషయంలో చాలా అశ్రద్ధ చూపుతారు. లావ్ఞ అవ్వగానే తిండి తగ్గించుకోలేక బాధపడతారు.
మరికొంతమంది లావ్ఞ అవ్వగానే తిండి పూర్తిగా తగ్గించి నీరసించిపోయి హాస్పిటల్స్‌ పాలవ్ఞతారు.
మితిమీరి తినకూడదు. అస్సలు తినకుండా నాజూకు పోకూడదు. సమతులిత ఆహారం తీసుకుంటే ఏ బాధా ఉండదు.
లావ్ఞ తగ్గాలంటే స్వీట్లు, చాక్లెట్లు, ఐస్‌క్రీములు, కేకులు,పేస్ట్రీలు తినకండి. ఇవన్నీ చాలా ఖరీదైనవి. మాలాంటి మధ్యతరగతి మహిళలు ఎక్కడ తింటున్నాం? కాని మేమెందుకు లావ్ఞ అవ్ఞతున్నాం అని కొంతమంది మహిళలు సందేహాలు వ్యక్తం చేస్తారు. బంగాళాదుంప, బీన్స్‌, చిక్కుళ్లు, కాలీఫ్లవర్‌, చిలగడదుంప, అరటిపండ్లు, నెయ్యి, వేపుళ్లు, నూనె వస్తువ్ఞలు, పకోడీలే, బజ్జీలు మొదలైనవి మీరు తినకుండా ఉంటే ఖచ్చితంగా సన్నబడతారు.
శారీరక శ్రమ లేకపోవడం
ఇదివరకు ఇంటిపని, బట్టలపని అవన్నీ ఎవరికి వారే చేసుకునేవారు. కాని ఇప్పుడు పనిమనిషి, చాకలిమనిషి తప్పకుండా ఉంటున్నారు. ప్రతి స్త్రీకి రోజుకు 220 కేలరీల శక్తి కావాలి. కాని రోజుకు ఎన్ని కేలరీల శక్తి నష్టపోతుందో తెల్సుకుందాం.
కిటికీలు దులపడం, పక్కదుప్పట్లు మార్చడం వల్ల 200-250 కేలరీలు
వంటపాత్రలు శుభ్రపరచడం వల్ల-100-200కేలరీలు, బట్టలు ఇస్త్రీ చేయడం వల్ల -100-200కేలరీలు, బట్టలు ఉతకడం వల్ల-250-325కేలరీలు
వంట వండడం వల్ల-125-200కేలరీలు, కూర్చోడం వల్ల -15-25కేలరీలు
ఒక గంటలకు 5కి.మీ నడవడం వల్ల-200-250కేలరీలు
పుస్తకాలు చదవడం వల్ల -5-125 కేలరీలు, టైప్‌, డస్క్‌వర్క్‌ వల్ల – 55-125కేలరీలు
దీనిని బట్టి మీరు అంచనా వేసుకోండి. ఏ పనుల వల్ల మీ శక్తి ఎన్ని కేలరీలు నష్టపోతుందో.
ఉద్యోగినులు ప్రొద్దున పదిగంటల నుంచి లంచ్‌ అవర్‌ ఒంటిగంట వరకు కూర్చుని తరువాత లంచ్‌ చేసి పది నిమిషాలు రెస్ట్‌ తీసుకుని మరలా సాయంకాలం ఐదు గంటల వరకు ఆఫీసులో కూర్చుని వర్క్‌ చేయడం వలన పొత్తికడుపు, నడుము పెరిగిపోతాయి. అందువల్ల వాళ్లు తప్పకుండా తెల్లవారు జామున లేచి పావ్ఞగంట ఎక్సర్‌సైజ్‌కి కేటాయించవలసిందే.
ఇక గృహిణులు భోజనం చేయగానే మధ్యాహ్నం విశ్రాంతిగా నిద్రపోతారు. దీనివల్ల పొత్తికడుపు పెరగడమే కాకకుండా త్వరగా లావవ్ఞతారు. క్రమశిక్షణతో చిన్నపాటి వ్యాయామాలను పాటిస్తే మీరు కూడా సన్నగానే ఉంటారు ఎప్పటికీ.