రోగ నివారణకు ఇంటివైద్యం

                            రోగ నివారణకు ఇంటివైద్యం 

CUTE
CUTE

ప్రతి చిన్న రోగానికి స్పెషలిస్టుల దగ్గరికి వెళ్లడం చాలా వ్యయప్రయాసలతో కూడిన పని. గతంలో అయితే వంటింటి చిట్కాలు, గృహవైద్యం, మూలికావైద్యం, ఇతర దేశీయ వైద్యవిధానాలు అమలులో ఉండేవి. తిరిగి వాటిని పునరుద్ధరిస్తే తొందరగా,శాశ్వతంగా తక్కువ వ్యయప్రయాసలతో ఆరోగ్యవంతులవవచ్చు. అందుకు నమ్మకం, ప్రాక్టికల్‌గా ఆలోచించి అమలుపరచడం ఆవశ్యకం. మన శరీరంలోని కొన్ని ముఖ్యమైన అవయవాలకు వచ్చే రుగ్మతలు, వాటి నివారణోపాయాలను పరిశీలిద్దాం.
ముఖారవిందం
ముఖం అందంగా ఉండడం అదృష్టంగా భావిస్తాం. మొటిమలు, గీతలు కళ్లక్రింద నల్లటి చారలు, కంటి నుండి నీరు కారడం కండ్లకలక వంటివి సౌందర్యానికి, ఆరోగ్యానికి అడ్డు తగుల్తాయి. వీటి నివారణకు గల కొన్ని నేచురల్‌ విధానాలు గురించి తెలుసుకుందాం.
మొటిమలు: కొన్ని తులసి ఆకులు తీసుకుని మెత్తగా రుబ్బి ముఖానికి పూసుకోవాలి.
ల లేత వేప ఆకులు నూరి రాస్తే కూడా మొటిమలు తగ్గుతాయి.
ల తాజా దానిమ్మ పూల రసం క్రమం తప్పకుండా ముఖానికి రాస్తూ ఉంటే మొటిమలు తగ్గుతాయి.
ల పుదీనా ఆకులు ముద్దగా నూరి మొటిమలపై పట్టించి తెల్లవారేక సబ్బుతో ముఖం కడుక్కోవాలి.
ల లేత నిమ్మ ఆకుల ముద్దకు, చిటికెడు పసుపు కలిపి ముఖానికి పట్టించాలి. కొద్దిసేపటి తరువాత గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా కొన్ని రోజులు చేస్తే మొటిమలు పోతాయి.
ల కాకరకాయ ముక్కలు రోజుకొకసారి చొప్పున 4,5 రోజులు రాస్తే మొటిమలు పోతాయి.
ల నిద్రకుపక్రమించే ముందు పచ్చిపాలతో ముఖాన్ని కడుక్కుంటే కూడా ఉపయోగపడుతుంది.
ల వెల్లుల్లి రసం కొద్దికాలం పాటు రాస్తే కూడా మొటిమలు తగ్గుతాయి.
ల పండిన బొప్పాయి గుజ్జురాస్తే మొటిమలు రావ్ఞ.
పులిపిరికాయలు
ల పులిచింతాకు ముద్దగా నూరి పులిపిరికాయలపై రాస్తే అవి తగ్గుతాయి.
ల ఉల్లిపాయ ముక్కగా తరిగి రాస్తే కూడా గుణం కన్పిస్తుంది.
ల బొప్పాయి పాలు రాస్తే కొన్నాళ్లకు పులిపిరికాయలు ఎండి రాలిపోతాయి. తిరిగి రావ్ఞ.
ల కాబేజీ ఆకుల రసం రాస్తే అవి రాలిపోతాయి.
మృదువైన ముఖచర్మం
ల గ్లిజరిన్‌, క్రీమ్‌, తేనె 1:1:1 నిష్పత్తిలో కలిపి రాస్తే పగిలిన పొడి చర్మం మెత్తబడి నున్నగా తయారవ్ఞతుంది.
ల సూర్యరశ్మి వల్ల చర్మం నల్లగా మారితే ఒక టేబుల్‌ స్పూన్‌ రోజ్‌ వాటర్‌ ఒక టేబుల్‌స్పూన్‌ నిమ్మరసం కలిపి నల్లగా మారిన ముఖచర్మంపై రాత్రిపూట రాయాలి. ఉదయం శుభ్రంగా నీళ్లతో కడుక్కుంటే కాంతులిచ్చే చర్మం మీ స్వంతమవ్ఞతుంది.
ల నారింజ, దోసతొక్కలు బాగా గ్రైండ్‌ చేసి ముఖంపై రాయాలి. 20నిమిషాల తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి. వారం రోజుల ఇలా ఒక్కోసారి చొప్పున చేస్తే చర్మ కాంతివంతంగా తయారవ్ఞతుంది. మంచిగంధం, పచ్చిపాలు 1:3 నిష్పత్తిలో కలిపి ముఖానికి రాయాలి. పదిహేను నిముషాల తర్వాత శుభ్రంగా కడగాలి. రెండు రోజులకొకసారి చొప్పున పదిరోజుల పాటు చెయ్యాలి. అప్పుడు కాంతులీనే సుగంధభరిత చర్మంమీదవ్ఞతుంది. ఆపిల్‌ ముక్కలు ముఖం మీద రుద్దుకుంటే రంధ్రాలు మూతపడి చర్మం మృదువ్ఞగా తయారవ్ఞతుంది.