రంగుల ఆహ్లాదం

WALL Painting
WALL Painting

రంగుల ఆహ్లాదం

రంగులు మన చుట్టూ అందాన్ని, ఆనందాన్ని సృష్టిస్తాయి. ఇంటి గోడలకు, అలంకరణలో మనసుకి నచ్చే రంగుల్ని ఎంపిక చేసుకుంటే ఆ ఆనందం మరింత పెరుగుతుంది. ప్రస్తుతం ఇంటీరియర్‌ డెకరేషన్‌లో ప్రాముఖ్యత సంతరించుకున్న రంగుల గురించి కొన్ని సూచనలు- ్య ఎరుపురంగులో భిన్న షేడ్స్‌ని వాడవచ్చు. ఎరుపు రంగు ఎక్కువగా డైనింగ్‌ గదుల్లో, హాల్‌లో కనిపిస్తుంటుంది కానీ ఎరుపురంగుకి సంబంధించిన భిన్న షేడ్స్‌ని కిచెన్లలో, బెడ్‌రూముల్లో కూడా వాడవచ్చు. ్య మంచి ఆరెంజ్‌ రంగు చూసేందుకు ఆకర్షణీయంగా ఉంటుంది.

దీనిని చాలా వరకు ఇతరరంగులతో కలిపి వాడుతుంటారు. ఇప్పుడు ఈ రంగుని లివింగ్‌రూములకు వాడుతున్నారు. ్య పసుపు కూడా ఆకర్షణీయంగానే ఉంటుంది అయితే దీని పలురకాల షేడ్‌లు పలువిధాలుగా ప్రభావాన్ని చూపిస్తాయి. బాగా గాఢంగా కనిపించే పసుపురంగు చూపుల్ని ఇట్టే ఆకర్షిస్తుంది. అలాగే లేత పసుపు రంగు ఉల్లాసపూరితమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ్య ఆకుపచ్చ, నీలం రంగులు ఉత్తేజితంగా కనిపిస్తాయి. ఈ రంగుల్ని కలిపి వాడటంలో జాగ్రత్త వహిస్తే చూడగానే ‘ఓ! అద్భుతం అనిపించేలా ఉంటాయి. ్య లేత రంగులు చూపులకు హాయినిస్తాయి,

ఇవి గదుల్ని విశాలంగా ఉన్నట్టు చూపిస్తాయి. ్య గది పొడవు వెడల్పుల్ని బట్టి రంగుల్ని ఎంపిక చేసుకోవాలి. గోడలకు రంగులు వేసేందుకు రెండుమూడు షేడ్స్‌ని ఎంపిక చేసుకోవచ్చు. అయితే ఒక పద్ధతి ప్రకారం వీటిని వాడాలి. లేకపోతే గజిబిజిగా ఉంటుంది. మరీ తక్కువ రంగులు వాడినా చూసేందుకు బాగుండదు. ్య ఒకే రంగులో భిన్నషేడ్‌లను ఎంపిక చేసుకోవటం మంచిది. అలా చేసినపుడు గది అలంకరణ బాగా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ్య ఒకే రంగులో భిన్నషేడ్‌లను కాకుండా పూర్తి విరుద్ధంగా ఉన్న రంగుల్ని ఎంపిక చేసుకుంటే గదిలోని అలంకరణ సౌందర్యం మరుగు నపడుతుంది. నిండురంగులు ఎంపిక చేసుకుంటే మన్నిక కష్టమవుతుంది. ఇవి వేడిని లేతరంగుల కంటే ఎక్కువగా గ్రహిస్తాయి. అలాగే ఇవి పాడయి నపుడు తిరిగి రంగులు వేసుకోవాలన్నా కష్టమవుతుంది.