యోగాతో ఆరోగ్యం, ఆనందం

The Benefits fo Yoga
The Benefits fo Yoga


మా ఇల్లు రుగ్మతలకు నిలయం. ఇక్కొక్కరిది ఒక్కో సమస్య. మా అత్త పదేళ్ల నుంచి డిప్రెషన్‌తో బాధపడుతున్నది. సైకియాట్రిస్టు ద్వారా చికిత్స చేయించుకున్నది. ఒకటి, రెండు రోజులు మాత్రలు మానేసినా తట్టుకోలేదు. మందులు వాడటం వల్ల బరువ్ఞ బాగా పెరిగిపోయింది. మామ కూడ మధుమేహం, అధికరక్తపోటుతో బాధపడుతున్నారు. ఆయన కూడా దాదాపు పదిహేను సంవత్సరాలుగా మందులు వాడుతున్నారు. మావారికి భయం, ఆందోళన ఎక్కువ. ప్రతి చిన్న సమస్యకు తీవ్రమైన ఒత్తిడికి గురవ్ఞతుంటారు. కోపం, విసుగు, చికాకు ప్రదర్శిస్తుంటారు. ఆడపడుచు బి.టెక్‌ చదువుతున్నది. ఆమె అప్పుడప్పుడు కళ్లు తిరిగి కిందపడిపోతుంది. ఆ దశ లో చేతులు, కాళ్లు, చెమటపడుతుంది. గుండెవేగంగా స్పందిస్తుంది.

డాక్టరుకు చూపిస్తే. అది ఫ్యానిక్‌ డిజార్డర్‌ అనే మానసిక సమస్యని, సైకియాట్రిస్టును థైరాయిడ్‌ సమస్యకు మందులు వాడుతున్నది. నేను కూడా ఎప్పుడు నిరాశని, నిస్పృహలతో సతమతమవ్ఞతుంటాను. బాగా బరువ్ఞ పెరిగాను. మాకు పెళ్లయి పదేళ్లు అవుతున్నా పిల్లలు కలుగలేదు. మాకు పాతికకోట్ల ఆస్తులు, ఆదాయ వనరులు ఉన్నాయి. అయితే ఇంట్లో సుఖసంతోషాలు లేవ్ఞ. ఒక్కొక్కరం ఒక్కోరకం సమస్యతో బాధపడుతున్నాం. ప్రతి ఒక్కరు డాక్టర్ల చుట్టూ తిరుగుతూ, మందులు వాడుతున్నాం. సరదాలు, సంతోషాలు మా మధ్య కనిపించడం కరువయ్యింది. మా అందరికి డాక్టర్లు వాకింగ్‌, యోగ, ధ్యానం లాంటివి చేయమని సలహా ఇస్తున్నారు. మా మామ మాత్రమే రోజు అర్ధగంట వాకింగ్‌ చేస్తున్నారు. మిగిలినవారికి తీరక లేదు. ఇటీవల మా అపార్ట్‌మెంట్‌లో ఒకతను మూడురోజులపాటు యోగ తరగతుల డెమో ఇచ్చారు. రోజు అర్ధగంట నుంచి ఒక గంటపాటు యోగాసనాలు, ప్రాణాయామాలు, ధ్యానం సాధన చేస్తే అన్నిరకాల రుగ్మతలు తగ్గుతాయని చెప్పారు. రెండుమూడు నెలలు యోగసాధన చేస్తే మందులు పూర్తిగా మానేయవచ్చని యోగాసనాలు చేసి మరీ చెప్పారు.
ఒక్కొక్కరికి నెలకు రెండువేలు ఫీజు ఇస్తే చాలన్నారు. అయితే మా అత్త ఒప్పుకోలేదు. ఒక్కొక్క జబ్బుకు ఒక్కొక్క డాక్టరు చికిత్స చేస్తున్నారు. వేరువేరు మందులును వాడుతున్నాం. అయినా సంవత్సరాల తరబడి తగ్గని జబ్బులు ఒకే తరహా యోగాపద్ధతులతో తగ్గుతాయా అంటూ కొట్టిపడేశారు. నాకేమో కొంత నమ్మకం ఉంది. ఓ మూడునెలలు సాధన చేసి పరిశీలిద్దామనిపిస్తున్నది. అయితే మా అత్తకు అర్థమయ్యేలా చెప్పి ఒప్పించడం ఎలాగో తెలియడం లేదు. మందులతో తగ్గని రుగ్మతలు యోగ, ధ్యానంతో ఎలా తగ్గుతాయన్న సందేహానికి నావద్ద సమాధానం లేదు. ఈ నేపధ్యంలో నిజంగానే యోగవల్ల రుగ్మతలు తగ్గుతాయా? తగ్గితే ఎలా తగ్గుతాయి? చెప్పగలరు. లేదా వాటివల్ల ప్రయోజనం లేదంటే ఆలోచించడం మానేస్తాను. కాబట్టి మా సందేహాలను నివృత్తి చేయండి.

  • శిరీష, పాలకొల్లు

అమ్మా, యోగ ప్రక్రియల ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం కలుగుతుండడంతో సందేహం లేదు. తొలి నుంచి యోగసాధన చేసే వారికి రుగ్మతలు దూరంగా ఉంటాయి. చిన్న చిన్న శారీరక, మానసిక సమస్యలు నయమవ్ఞతాయి. అయితే కొన్ని దీర్ఘకాలిక రుగ్మతలకు మందులు తప్పనిసరి. మందులు మానేసి యోగసాధన ద్వారా పూర్తిగా నయం చేయలేం. అయితే యెగసాధన ద్వారా మంచి ఫలితాలు సాధించ వచ్చు. తీవ్రస్థాయి సమస్యలకు యోగపద్ధతులు సహాయకారి చికిత్సగా పనిచేస్తాయి. ఇక విూ కుటుంబంలో విూభర్త, ఆడపడచు సమస్యలను యోగ, ధాన్యంతో తగ్గించవచ్చు. వారిద్దరిదీ నాడీ సంబంధ రుగ్మ తలు. నిత్యయోగ, ప్రాణామయం, ధాన్యం సాధన చేస్తూ జీవనశైలిని మెరుగు పరచుకుంటే వారిద్దరి సమస్యలు తగ్గిపోతాయి. ఇక విూ అత్తగారి డిప్రెషన్‌కు కారణాలు తెలియవ్ఞ. ఆమెలో తీవ్రమైన రసాయనాల అసమతుల్యత ఉన్నట్లయితే మందులు వాడుతూ యోగసాధన చేస్తే డిప్రెషన్‌ పూర్తిగా నియంత్రణ లోకి రావచ్చు. ఒకవేళ ఆమె వ్యక్తిత్వం, ఆలోచన లు, పరిస్థితుల ప్రభావం వల్ల డిప్రెషన్‌కు గురవ్ఞతుంటే మంచి కౌన్సెలింగ్‌ చేయిస్తూ యోగ ద్వారా తగ్గించచ్చు. ఇక విూ మామ, విూరు మాత్రం మందులు వాడుతూ యోగ చేయవలసి ఉంటుంది. అయితే నియమబద్ధంగా యోగసాధన చేస్తుంటే మందుల డోసు తగ్గించవచ్చు. లేదా పెరగకుండా చూడవచ్చు. అయితే యోగ, ప్రాణామాయాలు, ధాన్యం ఇతర యోగ ప్రక్రియలు ఆరోగ్యానికి ఎలా దోహదపడుతాయన్నదే అందరి సందేహం. సాధారణంగా శరీరంలోని కొన్ని అవయవాలు తగినంత చురుగ్గా పనిచేయకపోయినా, ఎక్కువ లేక తక్కువగా రసాయనాలు స్రవించినా రుగ్మతలు తలెత్తుతుంటాయి. ప్యాంక్రియాస్‌ లోపం వల్ల మధుమేహం, థైరాయిడ్‌ హార్మోన్‌ లోపం వల్ల థైరాయిడ్‌ వస్తుంది. అలాగే రకరకాల రసాయనాల అసమతుల్యతవల్ల, నాడీ వ్యవస్థలో లోపం వల్ల మానసిక రుగ్మతలు వస్తుంటాయి. యోగాసనాల ద్వారా శరీరంలో జీవరసాయన చర్యలు మెరుగవుతాయి. నాడీ వ్యవస్థ చైతన్యవంతమవుతుంది. రక్తప్రసరణ మెరుగవడం ద్వారా ప్రతి కండలం, నాడీవ్యవస్థ, కణజాలం, మెదడులో న్యూరాన్లు శక్తివంతం అవ్ఞతాయి. శరీరంలోని అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తాయి. అన్ని హార్మోన్లు సక్రమంగా పని చేస్తాయి. దీనివల్ల శరీరంలో రోగనిరోధక వ్యవస్థ మెరుగవ్ఞతుంది. హార్మోన్లు సమతుల్యంగా వ్ఞంటాయి.
నాడీ కణజాలం ఒత్తిళ్లను తట్టుకునే శక్తిని సంతరించుకుంటాయి. మెరుగవ్ఞతుంది. ధాన్యంవల్ల మనసు ప్రశాంతమై స్వస్థత కలుగుతుంది. అందుకే యోగను సంపూర్ణ ఆరోగ్య ప్రధాయిని అం టుంటారు. కాబట్టి విూరు యోగ ప్రక్రి యలు నేర్చుకుని నిరంతరం సాధన చేస్తే మెరుగైన ఫలితాలు చేకూరు తాయి. దీంతో ఆరోగ్యం, ఆనందం యీ సొంతంజజ

  • డాక్టర్‌ ఎన్‌.బి.సుధాకర్‌రెడ్డి, సైకాలజిస్టు