యాసిడ్‌ వాడకంతో నష్టం

Bathroom
Bathroom

యాసిడ్‌ వాడకంతో నష్టం

సాధారణంగా ఇళ్లల్లో మనం వాడే లెట్రిన్‌లు, బాత్రూంలు (వారానికొకసారి శుభ్రం చేయకపోతే) కొన్నాళ్లకు మురికిపట్టి అసహ్యంగానూ, అశుభ్రంగానూ తయారవ్ఞతాయి. వాటిని శుభ్రం చేయడానికి వివిధ టా§్‌ులెట్‌ క్లీనర్లు, యాసిడ్‌లు వాడు తుంటారు. అయితే ఈ యాసిడ్‌ వాడడం వలన శుభ్రమవ్ఞతాయి గానీ, ఈ యాసిడ్‌ ఎఫెక్ట్‌ వలన లోపల ఉండే నీరు పోయే పైపులు ముఖ్యంగా (తేలికైన ప్లాస్టిక్‌పైపులే వాడతారు కదా) ప్లాస్టిక్‌, ఇనుము పైపులు పాడయి చిన్న చిన్న రంధ్రాలు పడి అందులోంచి నీరు స్లాబ్‌లోకి, గోడల్లోకి లీక్‌ అవ్ఞతుంది. తద్వారా బిల్డింగ్‌ లీక్‌ అవ్ఞతుంది. ముందులో టా§్‌ులెట్‌కి మట్టిపైపులు వాడేవారు. వాటికి యాసిడ్‌ ఎఫెక్ట్‌ ఉండదు. మీ బిల్డర్‌కి చెప్పి ‘యాసిడ్‌ రెసిస్టెంట్‌ ప్లాస్టిక్‌ పైపులు వేయించుకోండి. అపార్ట్‌మెంటులు, పై అంత్తుల్లో ఉండేవారు క్లీనింగ్‌కి యాసిడ్‌ వాడకండి. దాని బదులు వారానికొకసారి వేడినీటితో, కాటన్‌గుడ్డతో, లైట్‌ డిటర్జెంట్‌తో శుభ్రం చేసుకోండి. ఇలా అయితే మీ టా§్‌ులెట్‌లు, బాత్రూంలు మీ బిల్డింగ్‌ పదికాలాలు మన్నుతుంది.