మెడకు మెరుగులు

LADY33
Beautiful neck

మెడకు మెరుగులు

మెడ నలుపు, పులిపిరులు, ముడతలు, లావు ఇవన్నీ మెడ అందాన్ని పోగొడతాయి. ఇవన్నీ లేకుండా అందమైన మెడ మీ సొంతం కావాలంటే-

గిల్టునగలు వేసుకుంటే ఎలర్జీ ఉన్నవారు వాటికి వీలయినంత దూరంగా ఉండడమే మంచిది. ఈ ఎలర్జీ వల్ల మెడ నలుపురంగులోకి మారుతుంది.

మెడ నలుపుదనం పోవాలంటే ఒక చెంచా పెరుగులో నాలుగైదు చుక్కలు నిమ్మరసం కలిపి ఆ మిశ్రమంతో మెడకు మసాజ్‌ చేస్తే నలుపు పోతుంది. ్య నిమ్మరసం పాలు కలిపిన మిశ్రమాన్ని మెడకు రాసి పావుగంట తరువాత సున్నిపిండితో కడుక్కోవాలి. ఈ విధంగా రోజూ చేస్తే కూడా నలుపు పోతుంది

కొందరికి మెడ ముడతలలో మురికి చేరి ఉంటుంది. సబ్బుతో ఎంత తోమినా పోదు. అటు వంటివారు పెరుగులో బియ్యంపిండి కలిపి మెడకు రాసి ఐదు నిమిషాల తరువాత నలిచి గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే మెడ శుభ్రంగా ఉంటుంది.

మార్కెట్లో దొరికే ‘క్లెన్సింగ్‌ క్రీమ్‌ను దూదితో మెడకు రాసి రెండు నిమిషాలాగి పొడి దూదితో తుడిచేయాలి. ఇలా చేయడం వల్ల మెడమీది మురికి, నలుపు పోతుంది.

బొప్పాయికాయని తెంపితే వచ్చే పాలను పులిపిరుల మీద పెడితే రెండు మూడు రోజులలో రాలిపోతాయి కాని మామూలు చర్మానికి తగలకుండా పెట్టాలి. ్య ఆలివ్‌ ఆయిల్‌తో మసాజ్‌ చేసుకుంటే మెడలావు తగ్గుతుంది.

మెడకు ఎక్కువ చెమట పట్టేవారు ఎక్కువ నగలు ధరించాల్సి వచ్చినపుడు ఆస్ట్రింజంట్‌ లోషన్‌ని దూదితో మెడకు రాసి ఐస్‌క్యూబ్స్‌తో రబ్‌ చేయాలి. తరువాత టవల్‌తో అద్ది లైట్‌గా పౌడర్‌ జల్లుకోవాలి.

ముత్యాల నగలు ధరించాలనుకున్నప్పుడు చెవుల కింద మెడ దగ్గర స్ప్రే చేసుకోకూడదు. స్ప్రేలోని కెమికల్స్‌కి ముత్యాలు పాడవుతాయి. ్య మెడ లావుగా ఉంటే రోజూ ఇరవైసార్లు తలను కుడిపక్కకు ఎడమపక్కకు తిప్పడం లాంటి ఎక్సర్‌సైజు వల్ల మెడ సన్నబడే అవకాశం ఉంటుంది.