మూడీగా ఉన్నారా…!

                             మూడీగా ఉన్నారా…!

MOODY
MOODY

ఒక్కోసారి అకారణంగా దిగులుగా అనిపిస్తుంది. ఏం చేయాలో తోచదు. మీ మనసు అలా మూడీగా ఉంటే… జస్ట్‌ ఈ నాలుగు చిట్కాల్లో ఏదో ఒకటి పాటించండి చాలు.
ౖ మంచి గుమ్మడి గింజలు ఒక గుప్పెడు తినండి (ముందే ఎండబెట్టుకుని ఉంచుకోవాలి). వాటిలో ఉండే మెగ్నీషియం శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది.
ౖ ఐస్‌క్రీమ్‌లో ఉండే ఫ్లేవర్స్‌ మెదడులో సంతోష కారక కేంద్రాలను ఉత్తేజితం చేస్తాయి. మరీ అతిగా కాదుగానీ…ఎప్పుడైనా ఒకసారి మూడ్‌ బాగోకపోతే ఐస్‌క్రీమ్‌ లాగించండి.
ౖ గది తలుపులు మూసేసి మీకు ఇష్టమైన పాట పెట్టుకుని మీకు ఇష్టం వచ్చినట్టుగా డాన్స్‌ చేయండి.
ౖ చన్నీటి స్నానం నరాలను ఉత్తేజితం చేస్తుంది. తద్వారా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండొచ్చు.