మీ భర్తను అనుమానించవద్దు

మనస్విని

మీ భర్తను అనుమానించవద్దు

నమస్కారం మేడమ్‌, నా పేరు జయశ్రీ. నా భర్త డాక్టర్‌. ఆయన తన వైద్యవృత్తిలో చాలా బిజీగా ఉంటారు. ఆపరేషన్స్‌ చేయాలంటూ రాత్రుళ్లు కూడా ఇంటికిరారు. దీనివలన మామధ్య శారీరక అనుబంధం రోజురోజుకూ తగ్గిపోతుంది. అంతేకాకుండా మనసు విప్పి హాయిగా, సంతోషంగా మాట్లాడుకునే రోజులు కూడా లేవ్ఞ. ఇంట్లో ఉన్న కొద్ది సమయంలో కూడా వాట్సాప్‌ మెసేజ్‌లతో బిజీగా ఉంటారు. నన్ను బాగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇతని ప్రవర్తనను చూస్తుంటే నా భర్త వేరొక అమ్మాయితో ఏమైనా సంబంధం పెట్టుకున్నారేమో అని అనుమానంగా ఉంది. చెప్పుకోవటానికే నా భర్త డాక్టర్‌, కాని నాకు ఎటువంటి శారీరక, మానసిక సంతోష సమయాలు లేవ్ఞ. దీంతో నాకు రాత్రిళ్లు పిచ్చిపిచ్చి కలలతో నిద్ర సరిగ్గా పట్టడం లేదు. దయచేసి మా వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే పాటించవలసిన మార్గాలను తెలియచేయగలరని ఆశిస్తున్నాను. – జయశ్రీ, కరీంనగర్‌

మీరు తప్పక ఈ సమస్యల సుడిగుండం నుండి బయటపడగలరు. ముందుగా ఈ సాలెగూడు ఆలోచనల నుండి బయటపడాలి. మీ దృక్పధాన్ని మార్చుకోవాలి. ఒంటరిగా ఉంటూ ఈ వ్యతిరేక ఆలోచనలకు ఆజ్యం పోయకూడదు. ఆనందంగా ఉండాలి. మంచి ఆహ్లాదకరమైన పనులు చేస్తూ సమయాన్ని ఉత్సాహభరితంగా వినియోగించుకోవాలి. మీకు ఇష్టమైన పనులు చేస్తూ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. ప్రతినిత్యం ఆనందంగా గడపాలి. అప్పుడు ఈ ఆందోళన, కుంగుబాటు తగ్గిపోతాయి. ప్రతిరోజూ స్వర్గమయం చేసుకోవాలి. వర్తమానంలో జీవించాలి. గతం గురించి చింతించకూడదు. భవిష్యత్‌ గురించి ఆతృత, ఆందోళన వద్దు. మీ భర్తను అనుమానించవద్దు. అనుమానం పెనుభూతం. ఏవైనా మనఃస్పర్ధలుంటే, చర్చల ద్వారా పరిష్కరించుకోండి. భార్యాభర్తలు అనుబంధంతో, ప్రేమతో ఆనందించాలే తప్ప, ఇలా గొడవలు పెట్టుకోరాదు. గృహవాతావరణాన్ని ఆనందభరితంగా మలచుకోవాలి. ప్రేమ, ఆప్యాయతలతో ఉత్సాహంగా ఉండాలి. దైనందిన జీవితం ఆనందంగా మలచుకోవాలి. ఇది తప్పక చేయవలసినవి. ర

సరైన గుర్తింపు లేదు.

నమస్తే అమ్మగారు, నా పేరు కుసుమ. నేను గృహిణి. నా భర్త వ్యాపారం రీత్యా చాలా బిజీగా ఉంటారు. మా మధ్య ఎప్పుడూ గొడవలే. నాకు ఇంట్లో సరైన గుర్తింపు ఉండదు. నన్ను ఎవరూ పట్టించుకోరు. ఏంటో చాలా దిగులుగా అనిపిస్తుంది. చుట్టాలు ఇంటికి వచ్చినా నాకు పెద్దగా వారితో మాట్లాడాలనిపించదు. పెళ్లిళ్లకు కూడా వెళ్లాలనిపించదు. నాకు నేనే అర్ధం కాకుండా ఉన్నాను. ఒక్కొక్కసారి విలువలేని జీవితం ఎందుకు అనిపిస్తుంది. ఒంటరిగా ఉన్నప్పుడు బాగా ఏడ్వాలనిపిస్తుంది. నాకు ఎందుకు ఇలా అనిపిస్తుందో తెలియటం లేదు. దయచేసి నా సమస్యను అర్ధం చేసుకొని ఈ సమస్య నుండి బయటపడే మార్గాలను తెలియచేయగలరని వేడుకుంటున్నాను. – కుసుమ, ఎల్‌.బి.నగర్‌
మీరు ముందుగా ఈ ఆత్మన్యూనతాభావాల నుండి వెంటనే బయటపడాలి. మీరు మీ సమయాన్ని చక్కగా వినియో గించుకొని ప్రయోజకులుగా అవ్వాలి. ఇలాంటి వ్యతిరేక ఆలోచనల నుండి వెంటనే బయటపడాలి. స్నేహితులతో కలవండి. మీ విలువను మీరు గుర్తించండి. మీ స్థాయిని మీరు గుర్తించండి. మీరు మంచి స్థాయిలో ఉన్నారు. అంటే చక్కగా మీరు మీ సమస్యలను గుర్తించగలుగుతున్నారు. తప్పక కౌన్సెలింగ్‌ తీసుకోండి. అప్పుడు వెంటనే ఈ సమస్య పరిష్కారం అవ్ఞతుంది. లేనియెడల మీరు స్వయంగా మీరు మీ విలువను గుర్తించే ఆత్మపరిశీలనా విధానాన్ని నేర్చుకోండి. ప్రతిరోజూ ఆనందంగా గడపవల సిందే. దిగులు, కుంగుబాటు, ఆత్మన్యూన తను దగ్గరకు రానియ్యరాదు. ఉత్సాహం నింపుకోండి. ప్రశాంతం గా జీవితాన్ని గడపటానికి పధకం వేసుకోండి. అప్పుడు మీరు ఈ బాధ అనవసరం అని నేర్చుకొంటారు. ప్రతిరోజూ, ప్రతిని త్యం ఆనందంగా గడపటానికి ప్రయత్నపూర్వకవకంగా శ్రద్ధతో, పధకం వేసుకొని, ఆచరించాల్సిందే. ఇది తప్పనిసరి. జీవితం అమూల్యమైన కానుక. ఆనందాన్ని స్వీకరించండి.

డా శారద, సైకాలజీ ప్రొఫెసర్‌