మాతృత్వం ఒక వరం

మాతృత్వం ఒక వరం లాంటింది. పుట్టబోయ బిడ్డకు తల్లిపాలే ఆహారం. దానికనుగుణంగా గర్భధారణ సమయంలోనే స్తనాల్లో బ్రెస్ట్ ఫీడింగ్‌కి అనువుగా మార్పులు కలుగుతాయి. దీన్నే లాక్టేషన్ లేదా నర్సింగ్ లేదా బ్రెస్ట్ పంపింగ్ అని అంటారు. ఇది నాలుగు స్టేజ్లలో కలుగుతుంది. మమ్మోజెనిసిస్: ప్రెగ్నీన్సీ హార్మోన్స్ కనుగుణంగా స్తనాల్లో మార్పులు కలుగుతాయి. స్తనాల సైజ్ పెరిగి నొప్పిగా బాధగా ఉంటూ క్షీర గ్రంథులు, క్షీరవాహికలు ప్రొలాక్టిన్ హార్మోన్ ఉత్పత్తి కనువుగా ఆక్టివ్‌గా పనిచేయడం వల్ల మొదటి ట్రెమిష్టర్‌లో నీళ్ల వంటి స్రావం స్రవిస్తుంది. లాక్టోజెనిసిస్: క్షీర గ్రంథులు కాన్పు కాగానే పాల ఉత్పత్తి ఆక్సిటోసిన్ గ్రోత్ హార్మోన్, ధైరాక్సిన్, గ్లూకోకార్టికాయిడ్స్, ఇన్సులిన్ వంటి వినాశ గ్రంథుల ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావం చూపడం వల్ల పాలు స్రవించడం ప్రారంభమవుతాయి.
గాలక్టోజెనిసిస్ : బిడ్డ పాలు తాగడం ప్రారంభించగానే (సక్కింగ్, రిఫ్లెక్స్ ఎఫెక్ట్ వల్ల) పాల ఉత్పత్తి క్షీర గ్రంథుల ప్రెషర్ వల్ల అధికమవుతుంది. దీనికి ఆక్సిటోసిన్ మిల్క్ ఎజెక్షన్ రిఫ్లెక్స్ వల్ల క్షీరాభివృద్ధి కలుగుతుంది.
బాలింతల్లో జ్వరం, నొప్పి, స్తనాల వాపు, మానసిక ఒత్తిళ్లు ఉన్నప్పుడు పాల ఉత్పత్తి తగ్గుతుంది. దీని వల్ల కొందరిలో స్తనాల వాపు (మష్టాయిటిస్)తో పాటు గడ్డలు కట్టడం జరుగుతుంది. దీని వల్ల పాల జ్వరం వస్తుంది.
గాలక్టోపాయిసిస్: ప్రొలాక్టిన్ హార్మోన్‌నే గాలక్టోపాయిటిక్ హార్మోన్ అని కూడా అంటారు. ఉత్పత్తి అయిన పాలు బిడ్డ తాగగానే క్షీరగ్రంథులు కంటిన్యూగా ప్రొలాక్టిన్ హార్మోన్ ఎఫెక్ట్‌వల్ల ఉత్పత్తి అవుతాయి. పాల ఉత్పత్తి కాన్పు కాగానే ఎంత ఉత్పత్తి అవుతుందనే అంశం తల్లి హెల్త్ కండిషన్పైనే కాకుండా తీసుకునే ఆహారం ట్టి ఉంటుంది. మొదటి వారంలో 240 మిల్లీలీటర్లు ఉత్పత్తి అయితే, రెండవ వారంలో 120-180 మి.లీ.పాలు ఇచ్చిన ప్రతిసారి ఉత్పత్తి అవుతుంది. కాన్పు కష్టమై బిడ్డ చనిపోవడమో లేదా పాల ఉత్పత్తి లేకపోయినట్లయితే దాన్ని సప్రెషన్ ఆఫ్ లాక్టేషన్ (పాలు అణగారిపోవడం) అని అంటారు. ఇది హార్మోన్స్ లేదా మెకానికల్‌గా ఉండవచ్చు. దీనికి డాక్టర్ల పర్యవేక్షణలో మందులు, గట్టిగా కంప్రెషన్ బాండేజ్ కట్టడం, కాపడం వంటివి చేయాల్సి ఉంటుంది. తల్లి కనుక బిడ్డకు పాలివ్వకపోతే కాన్పు అయిన 6వ వారంలో బహిష్టులు 40 శాతం మందిలో, 12వ వారంలో 80 శాతం మందిలో తిరిగి ప్రారంభమవుతాయి. తల్లిపాలు బిడ్డకు కనుక రెగ్యులర్‌గా ఇచ్చినట్లయితే 70 శాతం మందిలో బహిష్టులు 6-9 నెలల వరకు రావు. పాలు మాన్పించిన తరువాత లేదా పాల ఉత్పత్తి తగ్గిన తరువాతనే బహిష్టు తిరిగి ప్రారంభమవుతాయి. 30 శాతం మందిలో మాత్రం ముందే బహిష్టులు కనిపించవచ్చు. పాలివ్వని వారిలో కాన్పు తరువాత 4వారంలో, పాలిచ్చే వారిలో 10వ వారంలో అండం విడుదలయ్యే అవకాశముంది. కాబట్టి 1/3 కేసుల్లో తిరిగి గర్భం వచ్చే ఆస్కారముంది. కొంతమంది చంటిపిల్లల చనుమొనల నుండి కూడా పాలు వచ్చే అవకాశముంది. దీన్నే విచ్ మిల్క్ అని అంటారు. ఇది 5-6 రోజుల కంతా ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. వీటిని పిండి లేదా ఒత్తివేయడం చేయరాదు. తల్లిలోని విత్‌డ్రాయల్ హార్మోన్ ఎఫెక్ట్ వల్ల ఏర్పడుతుంది. దీనికి ఎటువంటి చికిత్స అవసరం లేదు. కంగారు పడనక్కరలేదు. బహిష్టుకు ముందు లేదా బహిష్టు సమయంలో హార్మోన్ల ప్రభావం వల్ల స్తనాల్లో పాలు ఏర్పడడం, స్తనాలు బరువెక్కడం, నొప్పి ఉండటం, గడ్డలు కట్టడం ఉంటుంది. ఇది ఒక్కోసారి ప్రీ మెన్ట్సువల్ సింప్టమ్స్ వల్ల కూడా కలుగుతుంది. యుక్తవయస్కుల్లో కూడా రజస్వలకు ముందు, తరువాత పాలు పడడం ఉంటుంది. అలాగే కొంతమంది పురుషుల్లో కూడా పాలు పడతాయి. పాలగ్రంథులు ఉత్పత్తి స్థాయి అన్నీ చనుమొనల చుట్టూ ఉన్న ప్రాంతానికి కేంద్రీకృతమవుతాయి. చనుమొనలలో 15.20 వరకు వీటి వరకు ముఖద్వారాలు తెరిచి ఉంటాయి. గర్భిణీకి 5వ నెల వచ్చేసరికి బాగా పెరిగిపోతాయి. 6వ నెల వచ్చేసరికి కోలోస్ట్రమ్ వంటి ద్రవ పదార్థం తయారై ప్రసవ సమయానికి ఎక్కువవుతుంది. ఆరోగ్యవంతులైన గర్భిణీలు దినానికి సగటున లీటర్ పాలు ఉత్పత్తి చేయగలుగుతుంది. స్తనాల పరిమాణం వాటి పనితీరుని పిట్యూటరీ గ్రంథి కంట్రోల్ చేస్తుంది. అయితే స్తనాల సైజ్‌కి, పాల ఉత్పత్తికి ఎటువంటి సంబంధం ఉండదు. ఒకరిలో ఉన్నట్లు మరొకరలిలో వారి హెల్త్ కండిషన్, మానసిక స్థితి, తీసుకునే ఆహారాన్ని బట్టి పాల ఉత్పత్తి ఉంటుంది. పాలివ్వడం వల్ల స్తనాలు మెత్తగా, తాజాగా జారిపోయి నట్లుంటాయి. తల్లి బిడ్డకు పాలివ్వడం ప్రారంభించగానే ప్రొలాక్టిన్, ఆక్సిటోసిన్ హార్మోన్స్ ప్రేరణ వల్ల స్తనాల్లోని అల్వియులై సంకోచించడం వల్ల చనుమొనల నుండి పాలు 30 సెకన్లలో స్రవించడం ప్రారంభమవుతాయి.
లాభాలు: బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల బిడ్డలో న్యూట్రిషనల్, ఇమ్యూనలాజికల్, సైకలాజికల్ బాండింగ్ ఏర్పడుతుంది. తల్లి పాలలో విటమిన్స్, మినరల్స్, ప్రొటీన్స్ సమృద్ధిగా ఉండి బిడ్డ శారీరక ఎదుగుదలకు ఉపయోగపడుతుంది.
తల్లి పాలలోని ఆంటీబాడీస్, ఆంటి ఇన్ఫెక్టివ్ ఫ్యాక్టర్స్‌గా పనిచేయడం వల్ల ఇన్ఫెక్షన్స్ రావు. చెవి, శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్, జలుబు, ఎలర్జీస్, విరేచనాలు రావు. తల్లిపాలు బిడ్డ జీర్ణకోశ వ్యవస్థలోని మంచి బాక్టీరియాని పెంపొందించి జీర్ణశక్తిని పెంపొందించి బిడ్డకు కావలసిన శక్తిని అందిస్తాయి. మొదటి నాలుగైదు రోజుల్లో వచ్చే కొలెస్ట్రాల్ పాలలో అమినోఆసిడ్స్ ఎక్కువగా ఉండం వల్ల బిడ్డలో ఇమ్యూనిటీ పెంపొందుతుంది. 6-14 రోజుల తరువాత కొలస్ట్రా§్ు పాలు పల్చగా నీళ్లలాగా ఉండి బిడ్డకు 74 కెకాల్ శక్తిని కలిగిస్తాయి. 7.14 రోజుల తరువాత వచ్చే పాలని మెచ్యూర్ మిల్క్ అని అంటారు. దీని వల్ల 71 క్కెఆల్ ఎనర్జీ కలుగుతుంది. బిడ్డ 6-9 నెలల వరకు ద్రవరూపంలో తల్లిపాలు న్యూట్రిషన్ /ఆహారంగా ఉపయోగపడతాయి. క్రమేణా ఘన పదార్ధాల్ని మెత్తగా ఉడికించి ఆహారంగా ఇవ్వడం వల్ల మెల్లగా పాలని తాగడాన్ని మాన్పించవచ్చు. దీన్నే వీనింగ్ అని అంటారు. కొందరిలో పాటు 1-2 సంవత్సరాల వరకు ఎక్కువగా ఉంటాయి. దీన్నే గాలక్టోరియా అని అంటారు. లాక్టేషన్ని ఈస్ట్రోజెన్ -ప్రొజెస్టిరాన్, హ్యూమన్ ప్లాసెంటల్ లాక్టోజెన్ హార్మోన్స్ మూడు ప్రభావితం చేస్తాయి. అంతేగాకుండా పిట్యూటరీ గ్రంథి నుండి వచ్చే ప్రొలాక్టిన్ ఆక్సిటోసిన్ హార్మన్స్ వల్లనే పాల ఉత్పత్తి జరుగుతుంది. స్ట్రెస్, ఆందోళన, అనారోగ్య పరిస్థితులున్నట్లయితే హార్మోన్ల ఇంబాలెన్స్ వల్ల పాలుత్పత్తి సరిగా జరగదు. 50 శాతం మందిలో మొదటి వారంలో ప్రొలాక్టిన్ హార్మోన్ శాతం తగ్గుతుంది. స్తనాలనేవి పాలని ఉత్పత్తి చేసే పాసిల్ కంటైయినర్స్ కావు. ఇది బిడ్డ పాలు తాగినప్పుడే (సక్కింగ్ రిఫ్టెక్స్) వల్లనే ఆక్టివేట్ అవుతాయి. జాగ్రత్తలు: తల్లి రోజుకూ 3-4 గంటల వ్యవధిలో 8-12 సార్లు పాలు ఇవ్వవచ్చు. బిడ్డకు పాలిచ్చే ముందు తర్వాత స్తనాల్ని శుభ్రంగా కడుక్కోవడం మంచిది. చనుమొనల్లో చీలికలున్నా, నొప్పిగా ఉన్నా, లోపలికి ముడుచుకొని ఉన్న గట్టిగా ఉన్న గర్భధారణ సమయం నుండే క్రీమ్ అప్లై చేయడం మంచిది. రెండుపూటలా పాలు తాగడం కాని చల్లార్చిన నీళ్లు, పళ్లరసాలు, మజ్జిగ, నీళ్లు ఎక్కువగా తాగడం మంచిది. ఆల్కహాల్, స్మోకింగ్, కాఫీ, టీలు ఎక్కువగా తాగడం పాలిచ్చే తల్లులు చేయరాదు. శారీరక మానసిక విశ్రాంతి చాలా అవసరం. తగిన పోషకాహారం తీసుకోవడం తల్లి బిడ్డ ఆరోగ్యానికి మంచిది.

- డాక్టర్. కె.ఉమాదేవి,
తిరుపతి
తాజా కెరీర్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/specials/career/