మహిళా సంక్షేమంతోనే సమాజం అభివృద్ధి

      మహిళా సంక్షేమంతోనే సమాజం అభివృద్ధి

women welfare
women welfare

ఒకదేశంలో అభివృద్ధి ఆ దేశంలోని స్త్రీల సర్వతోముఖాభివృద్ధిపై ఆధారపడి ఉంటుంది. మహిళలకు పట్టాభిషేకం చేస్తాం, స్రీలకు నీరాజనం పలుకుతాం, అమ్మకు పాదపూజ, చట్టసభలల్లో 33% మహిళా రిజర్వేషన్‌ అమలుకు కృషి చేస్తాం అని నాయకుల ప్రసంగిస్తుంటారు. ప్రపంచానికి ప్రేమను, శాంతిని అందిచే శక్తి ఉన్నది ఒక్క మహిళలే. శబ్దాలుగా ఎన్నో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని నేటిస్థితికి చేరుకుంది మహిళాలోకం. స్త్రీ, పురుషుల మధ్య అంతరంగం ఎంత తగ్గితే అంతవేగంగా వృద్ధిరేట్టు పెరుగుతుంది.

స్త్రీ, పురుషల మధ్య ఉపాధి వేతన వ్యత్యాసాలు తొలగిస్తే స్త్రీల ఆదాయం 76% శాతం ప్రపంచ ఆదాయం 17 బ్రిలియన్‌ డాలర్లు పెరుగుతుంది. స్త్రీ సంక్షేమం లేకుండా సామాజికాభ్యున్నతి సాధ్యంకాదు. ఆధునిక మహిళ చరిత్ర సృష్టిస్తుందన్నది కందుకూరి వారిమాట. విద్య విజ్ఞానం, శాస్త్ర, సాంకేతిక అభివృద్ధిలో మహిళల పాత్ర ఎనలేనిదయినప్పటికీ పలు రూపాల్లో వారిపై హింస కోనసాగుతుండమే, బాధకరం. స్త్రీలపై జరుగుతున్న ఆత్యాచారాలను ఆరికట్టేందుకు మనహక్కులను పరీక్షించేందుకు గడిచిన దశాబ్దకాలంగా భారీసంఖ్యలో చట్టలు వచ్చాయి.

చట్టాలు సక్రమంగా అమలు జరిగితే భారతదేశంలో మహిళల పట్ల వివక్ష, ఆత్యాచారాలు ఇప్పటికే ముగిసిపోయి వుండేవి. ప్రపంచవ్యాప్తంగా ప్రతిముగ్గురు స్త్రీలలో ఒకరు శారీరక, లైంగిక హింసను ఎదుర్కొంటున్నట్లు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఆడశిశు హత్యలు, లింగవివక్ష, లైంగిక వేధింపులు, బాల్య వివాహాలు వరకట్నం, గృహహింస, అణచివేత పేరిట మహిళాలోకంపై ఎడతెరిపి లేని దాడి జరుగుతోంది. డబ్బు, అధికారమే పరమావధిగా ఉన్న ప్రస్తుత రాజకీయ సంస్కృతి, సమర్ధత, నిబద్ధత ఉన్న మహిళల ప్రవేశానికి, వారు ఎదగటానికి అవరోధంగా ఉంది. 1993లో 73,74 రాజ్యాంగ సవరణలతో మహిళలకు స్థానిక సంస్థల్లో 33 శాతం రిజర్వేషన్‌ కల్పించారు.

అయిన మహిళాసాధికారతకు దోహదపడే చట్టసభలో 33 శాతం రిజర్వేషన్‌ బిల్లు ఆమోదానికి నోచుకోవడం లేదు. మహిళలకు ఇంటా బయటా సమానావకాశాలు, సమాన సౌకర్యాలు సమాన హక్కులు లభించేటట్లు చూడటానికి ప్రభుత్వం చాలా చర్యలు తీసుకోవాలి. ఏ దేశమైనా బలమైన నాగరికతను నిర్మించాలంటే ఆ దేశంలో మహిళలు సమానహక్కులు, సమానప్రాతినిధ్యం, సమాన ఆరోగ్య రక్షణలతో జీవితాలను ఆనందంతో గడపగలగాలి.

అన్ని ప్రణాళికలలో దినదినానికి అధిక సంఖ్యలో మహిళలు భాగస్వాములవడం వల్ల వారి కుటుబాలన్ని ఆర్ధిక సౌభాగ్యంతో ఆరోగ్యకరమైన జీవితాలను గడపగలరు. మహిళ సాధికారతకు మార్గం కేవలం ఆర్ధిక ఆలంబనే కాదు. వారు సంపాదించిన ధనాన్ని సక్రమంగా పొదుపు చేసుకోవటానికి దాచుకోవడం నేర్చుకోవాలి. తెలుసుకోవాలి. మహిళలకు అధీకృత ఆర్ధిక సర్వీసుల లభ్యతలో ఎదురవుతున్న అడ్డంకులను కనుగొని వాటివాటిని సత్వరమే పరిష్కరించాలి. రాజకీయలలో మహిళల ప్రాధాన్యం పెరగటం వల్ల రాజకీయ సంస్కృతి కూడా త్వరగా మారుతుంది.

మహిళలకు చట్టసభలో విధిగా మూడోవంతు అవకాశాలు సమంజసమైన వాదనే మహిళలకు జనాభా ప్రాతిపదికన ప్రజాస్వామ్యయుతంగా అవకాశాలివ్వని ప్రధానపార్టీలు మహిళలున్న దాఖలాలు లేవు. పార్లమెంటులో ఉన్న మహిళలు కేవలం 11.6 శాతం మాత్రమే ప్రపంచసగటులో ఇది సగం మాత్రమే. మనదేశంలో లోకసభకు ఎన్నికైన వారిసంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ పోటీ చేసే మహిళల శాతం మాత్రం ఎక్కువగానే ఉంది.

మహిళా రిజర్వేషన్‌ బిల్లు మొదటిసారిగా 1996లో దేవెగౌడ్‌ నాయకత్వంలోని యునైటెడ్‌ ఫ్రెంట్‌ ప్రభుత్వంలో లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కానీ ఈ బిల్లు ఆమోదం పొందడంలో విఫలమైంది. తరువాత కాలంలో 1998, 1999, 2002, 2003లో ఈ బిల్లును పునః ప్రవేశపెట్టినప్పటికీ ఆమోద మార్గం పొందలేకపోయింది. పార్టమెంట్‌లోనూ, రాష్ట్రాల చట్టసభల్లోనూ మహిళలకు మూడోవంతు ప్రాతినిధ్యం కల్పించాలన్న బిల్లు వెలుగులోకి వచ్చి నేటికి 22 ఏళ్లు గడిచింది.

రాజకీయాలలో మహిళల ప్రాధాన్యం పెరగటంవల్ల రాజకీయ సంస్కృతి కూడా త్వరగా మారుతూ వస్తున్నది. అందరూ సమానమే అందరికీ సమన్యాయం అన్నదే ప్రజాస్వామ్యం. రాజకీయ నిర్ణయాధిక స్థాయిల్లో వారికి సమాధిక ప్రాతినిధ్యం కట్టబేట్టి నిబధ్ధత అన్ని పార్టీలూ కనబరచాలి. మహిళా భాగస్వామ్యం పెంచడం, వారిమీద జరుగుతున్న హింసకు చరమగీతం పాడటం, శాంతిభద్రతల స్థాపనలో వారిపాత్రను విస్తరించటం స్త్రీల ఆర్ధిక సాధికారతకు పాటుపడటం జాతీయాభివృద్ధి ప్రణాళికలు, బడ్జెట్‌రూప కల్పనలో మహిళలకు సముచిత ప్రాధాన్యంటివ్వడం అమలు పరచాలి.

పనిచేసే ప్రదేశాలలో కూడా ప్రతి నలుగురు శ్రామీకులలో ఒక స్తీని ఎక్కడ ఎక్కువగా సాంకేతిక, క్లిష్టత ఉంటుందో అక్కడ మహిళల సమస్యలు ఎక్కువ కనిపిస్తున్నది. 1950- 51లో స్త్రీల సగటు జీవితకాలం 31.7 ఏళ్లయితే 2016 నాటికి అది 70 ఏళ్లు అని నమోదయింది. సాధికారత స్త్రీల పాత్ర ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటుంది. విద్య ద్వారా, ఉత్పాదికత ఉండే ఉపాధి ద్వారా మరింత మంది స్త్రీలు ప్రజాజీవనంలో జాతినిర్మాణంలో భాగంకావాలి.

మహిళలపట్ల వివక్షతను రూపుమాపి, వారిని ప్రజాస్రవంతిలో భాగస్వాములను చేసి, ఉపాధి కల్పనా కార్యక్రమాలలోనూ, పరిశ్రమలు, వ్యాపార సంస్థలలోనూ పురుషులతో, ఎంచుకున్న సొంత వ్యాపార, వ్యవహారాలు స్వయంగా సాగించే ప్రక్రియ అలాగే మహిళలు తమ సొంత కాళ్లపై తాము నిలబడేందుకు చేసే ప్రయత్నమే సాధికారత లక్ష్యలను ఎంచుకోవడం, ఎంచుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో చూపే సామర్ధ్యం, శారీరకశక్తి విషయంలో స్త్రీ పురుషుల మధ్య లింగ బేధాన్నా గుర్తించడం, ఆత్మబలం, ఆత్మవిశ్వాసాలే సాధికారత మూలసూత్రంగా నిర్వచించారు.

శ్రామిక మహిళలు దోపిడి వర్గాన్ని ఓడించి ఓటు హక్కును సాధించుకోవడమే కాక 15 నుండి 18 గంటలు వున్న పనిదినాల నుంచి 8 గంటల పనిదినంగా సాధించిన చరిత్ర మహిళకు వుంది. మతాలన్ని మహిళని రెండో పౌరురాలు చూశాయి. భారతదేశంలో మతాలన్ని రెండో పౌరురాలుగా చేశాయి. భారతదేశంలో మతంతోపాటు కులవ్యవస్థ కూడా ఉండటంతో మతంలో కంటే కులవ్యవస్థలో స్త్రీల అణచివేత దారుణంగా వుంది. తమకో అర్ధాన్ని ఇచ్చిన అమ్మ, అక్క, చెల్లి, భార్య, కూతురు తమ జీవితాల్లో ఉన్నందుకు వారి ప్రేమను పొందే అవకాశం లభించినందుకు అప్పుడే సమాజ దృక్కోణంలో మార్పువస్తుంది.

ఇంటిపని, వంటపని, పిల్లల పెంపకం ఉద్యోగం అన్నింటిని ఒక్కచేత్తో చక్కపెట్టగలిగే స్త్రీ కంటే అద్భుతం ఈ ప్రపంచంలో వేరొకటి లేదు. మహిళా అభివృద్ధి కోసం చేసే కృషితో మహిళలు, పురుషులు లేదా లేకుండా దేశంలోని అనేక అసమానతలు, ఇతర సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారమార్గం మహిళలకు ఆర్ధిక, సామాజిక, రాజకీయ సాధికారతే అత్యంత ముఖ్యమైంది. మారుతున్న రోజులకు అనుగుణంగా మహిళాకమిషన్‌ పరిధిని మరింతగా విస్తరించాలి. సమాజాలు, కుటుంబాలు మహిళలను కేవలం కుటుంబ సంరక్షకులుగా చూడడాన్ని మానుకోవాలి.

– సత్యం