మహిళల ఆరోగ్యంలో నిర్లక్ష్యం

woman health
woman health


ఇంటిల్లిపాది ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించే మహిళలు తమ విషయానికి వచ్చేసరికి అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. దానివల్ల ఆరోగ్య సమస్యలు దీర్ఘకాల వ్యాధులుగా మారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
అందువల్ల చిన్నపాటి పరీక్షలు రెగ్యులర్‌గా చేయించుకోవడం వలన పెద్ద వ్యాధుల బారినపడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ముఖ్యంగా పాతిక సంవత్సరాలు దాటిన తర్వాత ఆడవారు కొన్ని రకాల ఆరోగ్య పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. అందులో ఒక పరీక్ష కటిభాగానికి సంబంధించినది. దానితో పాటుగా స్తనాల పరీక్ష, మూత్ర పరీక్ష, రక్తంలో చక్కెర, లిపిడ్‌ప్రొఫైల్‌ను పరీక్ష చేయించాలి. అప్పటి నుండి రెండు, మూడు సంవత్సరాలకొకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మంచిది.
పాతిక సంవత్సరాల తర్వాత శరీర రూపంలో తేడా రావడం మొదలవ్ఞతుంది. కాబట్టి శరీరపు ఎత్తు, బరువ్ఞను బట్టి చేసే బాడీమాస్‌ ఇండెక్స్‌ అంచనా వేయించుకుని వయసుకు తగిన బరువ్ఞన్నది లేనిది డాక్టర్‌ని సంప్రదించి నిర్థారించుకోవాల్సి ఉంటుంది.
45వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది మొదలు రక్తంలో కొలెస్ట్రాల్‌ పరీక్ష తప్పనిసరి.
రక్తపోటు పరీక్ష రెండేళ్లకొకసారి చేయించు కోవాలి.జీర్ణవ్యవస్థ పరీక్ష 40వ యేట నుండి చేయించుకుంటే శరీరానికి మేలుచేసినవా రవ్ఞతారు. కాలేయ, కంటి పరీక్షలు పరిస్థితిని బట్టి జరపాలి. ఏమాత్రం ఇంటి పనిమీద ఆసక్తి తగ్గినా, ఏ పనిమీద దృష్టి పెట్టలేక పోతున్నా అది డిప్రెషన్‌ లక్షణంగా భావించి వెంటనే వైద్యుని సంప్రదించాలి. పైగా ఇటీవల కాలంలో అమ్మాయిలు సెల్‌ఫోన్లు, ఇంటర్నెట్‌లతో గంటలకొద్దీ గడుపుతున్నారు. దీంతో వారికి లేనిపోని రోగాలకు గురవ్ఞతున్నారు. సెల్‌ఫోన్‌, నెట్‌ చాటింగ్‌లతో లేనిపోని భావోద్వేగాలకు గురవ్ఞతున్నారు. తెలియని వ్యక్తులతో, వారిమోసపూరితమైన మాటలను నమ్మి, మోసపోతున్నారు. ఇవన్నీ ఆరోగ్యంపై ప్రభావం చూపే అంశాలే. కాబట్టి చిన్నవయసేకదాని నిర్లక్ష్యం చేయకుండా పాతికసంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పుడప్పుడు వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.