మష్రూమ్‌ బిర్యానీ

mashroom biryani
mashroom biryani


కావలసినవి: పుట్టగొడుగులు-అరకిలో, ఉల్లిపాయలు-రెండు, టమాటా-ఒకటి, బాస్మతి బియ్యం-రెండు కప్పులు
నూనె లేదా నెయ్యి-అరకప్పు, సోయాసాస్‌-రెండు టీస్పూన్లు, అల్లంతురుము-ఒకటిన్నర టీస్పూన్‌,
వెల్లుల్లి రెబ్బలు-4, పచ్చిమిర్చి-రెండు, దాల్చినచెక్క-అంగుళంన్నర ముక్క
యాలకులు-రెండు, లవంగాలు-రెండు,
ధనియాలపొడి-ఒకటిన్నర టీస్పూన్లు, పుదీనా ఆకులు-కొద్దిగా
ఉప్పు-సరిపడా, నిమ్మకాయ-సగం ముక్క.
తయారుచేసే విధానం:
బియ్యం కడిగి గంటసేపు నాననివ్వాలి. తరువాత నీళ్లు వంపేసి ఉంచాలి. ప్రెషర్‌ పాన్‌లో కొద్దిగా నెయ్యివేసి కడిగిన బియ్యంవేసి వేయించి తీసేయాలి. పుట్టగొడుగుల్ని ముక్కలుగా కోసి పక్కన ఉంచాలి. యాలకులు, లవంగాలు, అల్లంతురుము, దాల్చినచెక్క వెల్లుల్లిరెబ్బలు, అన్నీ కలిపి మెత్తగా రుబ్బాలి. ప్రెషర్‌పాన్‌లో సరిపడా నూనె లేదా నెయ్యి వేసి మసాలా ముద్ద వేసి వేయించాలి. తరువాత ఉల్లిముక్కలు వేసి వేయించాలి. ఇప్పుడు పుట్టగొడుగుల ముక్కలు, టమాటా ముక్కలు కూడా వేసి పదినిమిషాలు వేయించాలి. తరువాత సోయాసాస్‌ వేసి కలపాలి. ఇప్పుడు మూడున్నర కప్పుల నీళ్లు పోసి మరిగిన తరువాత వేయించిన బియ్యం వేసి కలపాలి.