మష్రూమ్‌ ఆమ్లెట్‌

                          మష్రూమ్‌ ఆమ్లెట్‌

MASHROOM AMLET
MASHROOM AMLET

కావలసినవి: కోడిగుడ్లు-రెండు, చల్లటినీళ్లు-మూడు చెంచాలు, మొక్కజొన్న పిండి -అరచెంచా, మిరియాల పొడి -చిటికెడు, అజినోమోటో-చిటికెడు,సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు-కప్పు క్యారెట్‌, క్యాప్పికమ్‌ ముక్కలు-రెండూ కలిపి పావ్ఞ కప్పు ,టమాట ముక్కలు-పావ్ఞకప్పు, మష్రూమ్స్‌-రెండు, ఉప్పు-రుచికి సరిపడా, కొత్తిమీర తురుము-రెండు చెంచాలు, నూనె-రెండు చెంచాలు
తయారుచేసే విధానం: ముందుగా కోడిగుడ్ల సొన ఓ గిన్నెలోకి తీసుకుని బాగా గిలక్కొట్టాలి. చల్లటినీళ్లలో అజినోమోటో, మొక్కజొన్నపిండి కలిపి సొనకు చేర్చి మరోసారి గిలక్కొట్టాలి. పొయ్యి మీద పెనం పెట్టి అది వేడయ్యాక చెంచా నూనె వేసి గుడ్డు మిశ్రమాన్ని పరిచినట్లు వేయాలి. నిమిష మయ్యాక మంట తగ్గించి ఉల్లిపాయ, క్యాప్సికమ్‌, క్యారెట్‌ టమాట, మష్రూమ్స్‌ ముక్కలు, ఆమ్లెట్‌పై సమానంగా పరిచి ఆ తరువాత మిరియాలపొడి, ఉప్పు, కొత్తిమీర తురుము చల్లి మూతపెట్టేయాలి. రెండు నిమిషాలయ్యాక ఆమ్లెట్‌ను మధ్యకు మడిచి తీసేయాలి. దీన్ని ఒకవైపే కాల్చాలి.