మనసుదోచే కుంకుమ భరిణి

మనసుదోచే కుంకుమ భరిణి

ఆడవాళ్లు ఏ పూజ చేసినా ఏ నోము నోచినా ముందుగా అక్కడ ఉండేది కుంకుమ భరిణే. అంటే ఆ కుంకుమ భరిణకి ఎంతటి ప్రాదాన్యముందో తెలుస్తుంది. అటువంటి కుంకుమ భరిణలు ఆడ వాళ్లను మరింత ఆకర్షించుకుంటున్నాయి వాటి కొత్త కొత్త తళుక్కులతో. పెళ్లిళ్లూ పేరంటాలూ నోములూ వ్రతాలతో ప్రతి ఇల్లూ పండగ వాతావరణాన్ని సంతరించుకుంటుంది. శుభకార్యాలకు ఆహ్వానిస్తూ నో ఇంటికొచ్చినవారిని సాగనంప్ఞతూనో కుంకుమ భరిణి చేతపట్టుకుని కనిపించే ముత్తయిదువ్ఞలకూ ఈ మాసంలో కొదవలేదు. రోజుకో రకంగా రూప్ఞ దిద్దుకుంటున్న పూజాసామగ్రికి పోటీగా కుంకుమ భరిణలూ ఇప్ఞ్పడు అందంగా ముస్తాబవ్ఞతున్నాయి.

భారతీయ మహిళలుకు కుంకుమ ఒక ఆభరణం మాత్రమే కాదు నిత్యజీవితంలో ఓ భాగం కూడా. నోముల్లో అర్చనల్లో కుంకుమ ఉండి తీరాల్సిందే. కుంకుమకే కాదు ఆన్నిభద్రపరిచే కుంకుమభరిణకూ సనాతన సంప్రదాయంలో విశిష్ట స్థానమే ఉంది. కొన్ని ప్రాంతాల్లో చేసే వ్రతాల్లో సంపద శుక్రవారా లూ, ఉదయకుంకుమా, చిట్టిబొట్టు మొదలైన నోముల్లో కుంకుమ భరిణలనే వాయినాలుగా అంద జేస్తారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కుంకుమ భరిణలూ కొత్త సొబగులను అద్దుకుంటు న్నాయి.

ఆధునిక ట్రెండ్‌ లకు సంప్రదాయాన్ని ముడి వేస్తూ రూపుదిద్దుకుంటున్న ఈ భరిణలు ఇప్ఞ్పడు మార్కెట్‌లో తెగ సందడి చేస్తున్నాయి. నక్షత్రాలూ ఏనుగు అంబారీలూ మామి డి ఆకులూ అందమైన ప్ఞవ్ఞ్వలూ ఇలా మనసు మెచ్చిన అన్ని రూపాల్లో కనువిందుచేస్తున్న ఈ కుంకుమ భరిణలు సందడినీ మోసుకొస్తున్నాయి. వెనకటి రోజుల్లో ఒక చిన్న డబ్బా మాదిరిగా ఉండే ఈభరిణల్లో ఇప్ఞ్పడు చాలా వెరైటీలు వచ్చి చేరాయి. దశావతారాలూ లక్ష్మిదేవీ వినాయకుడూ ఇలా దేవతా రూపాలతోపాటు ఏనుగులూ నెమళ్లూ మొదలైన దేవతల వాహనాలనూ జతచేస్తూ కొంగొత్త భరిణలను రూపొందిస్తున్నారు. అంతే కాదు బాగా పాప్ఞలర్‌ అయిన బాహుబలి సినిమా థీముల్లోనూ ఇవి కనిపిస్తున్నాయి.

పున్నమిజాబిలి లా గుండ్రంగా ఉండే ఈ భరిణలు ఇప్ఞ్పడు చదరం, దీర్ఘచతు రస్రాకారాల్లోనూ ముత్యాలూ పచ్చలూ కెంపులతో సరికొత్త వన్నెలద్దుకుంటూ పేరంటానికి రెడీ అయిపోతున్నాయి. మరి కొన్ని మామిడాకులమీద తళుకులీనుతూ దర్శనమిస్తున్నా యి. రకరకాల ఆకృతుల్లో చేసిన వెండి ప్రాచుర్యం లో ఉన్నాయి.

అయితే ఇపుడు అవే కుంకుమ భరిణలు మరిన్ని డిజైన్లలో విభిన్న ఆకృతుల్లో పసిడిమెరుపులను సంతరించుకుని తళుకులీనుతు న్నాయి. బంగారంతో పాటు వన్‌గ్రామ్‌గోల్డ్‌ రకాల్లో నూ రూప్ఞదిద్దు కుంటున్నాయీ అందాల భరిణలు. పేరంటానికి పిలిచేందుకు చేతిలో పట్టుకెళ్లినా పూజలో పసుప్ఞగిన్నెతోపాటు అందంగా అమర్చినా ఈ డిజైనర్‌ భరిణలు ఎదుటివారి చూప్ఞలను కట్టిపడేస్తాయనడంలో సందేహమేముంది!