మధుమేహులకు అంజీర

ANJEERA
ANJEERA

మధుమేహులకు అంజీర

సీజన్‌లో దొరికే ఏ పండు అయినా మంచిదే! కాని అంజీర్‌ పండు అన్నిటికంటే భిన్నమైనది. ఇది పోషకాలగని. బజార్లలో తోపుడు బండ్ల మీద కనిపించే అంజీర్‌ పండ్లు ఇప్పుడు అందుబాటు ధరలోనే దొరుకుతున్నాయి. అంజీర్‌తో విటమిన్‌-ఎ, బి1, బి2, క్యాల్షియం, ఐరన్‌, ఫాస్పరస్‌, మెగ్నీషియం, సోడియం, పొటాషియంతో పాటు క్లోరిన్‌ లభిస్తాయి. బరువు తగ్గడంలో పీచుపదార్థాలు చేసే మేలు అంతా ఇంతా కాదు. అంజీర్‌లో అలాంటి పీచు ఎక్కువ. పేవ్ఞల్లోని గోడలకు అంటుకున్న వ్యర్థపదార్థాల్ని పీచుపదార్థం శుభ్రం చేస్తుంది. అప్పుడు జీర్ణశక్తి మెరుగవ్ఞతుంది. ఆకలి పుడుతుంది. గ్యాస్‌ సమస్య తొలగిపోతుంది.

కొలెస్ట్రాల్‌ విషయాని కొస్తే, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచేందుకు తోడ్పడుతుందట అంజీర్‌. కడుపులో క్యాన్సర్లు రాకుండా నిరోధిస్తుంది. అమెరికన్‌ డయాబెటిస్‌ అసోసియేషన్‌ పరిశోధన ప్రకారం మధుమేహులు ఈ పండును తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇందులోని ఇనుము పొటాషియం చక్కెర నిల్వలను సమతుల్య పరుస్తుంది.

అధిక రక్తపోటును నిలువరిస్తుంది. ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల, పొటాషియం తగ్గిపోవడం వల్ల హైపర్‌ టెన్షన్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ. దీనికి అంజీర్‌ బాగా పనికొస్తుంది. శ్వాసకోశ ఇబ్బందు లను దరిచేరనీయదు. ఇందులోని అధిక క్యాల్షియం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. గొంతువాపు, ఇన్‌ఫెక్షన్లను రాకుండా కాపాడుతుందీ పండు. పచ్చి అంజీర్‌ పండ్లు దొరక్కపోతే ఎండుపండ్లు తీసుకుని రోజూ తినొచ్చు.